భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. భారతదేశం ఒక వ్యవసాయ దేశం. అయినప్పటికీ దేశం సమాచార, సాంకేతికరంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయడంతోపాటు టెక్నాలజీని గ్రామాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. కాగా భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రజలు రోజువారీ పనుల కోసం స్మార్ట్‌ఫోన్‌లపై అధికంగా ఆధారపడుతున్నారు. దేశప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తారు. ఇది భారతదేశంలో మొబైల్-కామర్స్ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. భారతదేశం అనేది పట్టణ, గ్రామీణ ప్రాంతాలుగా విభజితమైవుంది.
డిజిటల్ ఇండియాకు మరింత ప్రోత్సాహం
గ్రామీణ భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యతను పెంచే లక్ష్యంతో పలు కార్యక్రమాలను ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం గణనీయమైన ప్రయత్నాలు సాగిస్తోంది. దీనిలో భాగంగానే ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారతదేశంలోని పౌరులందరికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండేలా, చెల్లింపు వ్యవస్థ ఆన్‌లైన్ లేదా నగదు రహితంగా ఉండేలా చూడటం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. పౌరులు డిజిటల్ అక్షరాస్యులు కావడం వల్ల ఇటు ప్రభుత్వ రంగం, అటు ప్రభుత్వ సంస్థలు డిజిటల్‌గా యాక్టివ్‌గా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా పౌరులు ప్రభుత్వ సేవలను విరివిగా అందుకోగలుగుతారు.
డిజిటల్ విలేజ్ ప్రాజెక్టు
డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారత ప్రభుత్వం చేపడుతున్న అతి ముఖ్యమైన పథకం డిజిటల్ విలేజ్. దీని ద్వారా కొన్ని గ్రామాలు డిజిటల్ యాక్టివ్ క్యాష్‌లెస్ గ్రామాలుగా రూపొందుతాయి. అప్పుడు గ్రామీణ ప్రాంతాలవారు తమ రోజువారీ పనులను పూర్తిగా ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు వీలు ఏర్పడుతుంది. డిజిటల్ విలేజ్ మొదటి లక్ష్యం గ్రామీణ సంస్థల పనిని ఇంటర్నెట్ ద్వారా నియంత్రించడం.
డిజిటల్ విలేజ్ ప్రోగ్రామ్‌లోని ప్రాథమిక లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికత అభ్యాసం,రోజువారీ వినియోగాన్ని ప్రోత్సహించడం. సీఎస్‌ఈ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ డిజిటల్ విలేజ్‌కు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తోంది. సీఎస్‌ఈ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ గ్రామీణ భారతదేశాన్ని మరింత డిజిటల్‌గా యాక్టివ్‌గా మార్చడానికి వివిధ సేవలను అందిస్తుంది. సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా గ్రామీణ భారతదేశానికి ఇంటర్నెట్ సేవలు, సౌరశక్తి, విద్య, డిజిటల్ ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక సేవలను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: 40 ఖాతాల్లోకి ఉన్నట్టుండి లక్షలు.. బ్యాంకుకు పరుగులు తీసిన జనం!
Comments
Please login to add a commentAdd a comment