సాక్షి, న్యూఢిల్లీ: అమేథి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘2010లో నేనే స్వయంగా అమేథిలో ఆయుధాల ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాను. గత కొన్నేళ్లుగా అక్కడ చిన్న తరహా ఆయుధాలు తయారవుతున్నాయి. ఆదివారం మీరు (మోదీ) అమేథి వెళ్లి అలవాటైన రీతిలో అబద్ధాలు చెప్పారు. మీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా?’అంటూ రాహుల్ ట్విటర్‌లో ప్రశ్నించారు.
అమేథీలో ప్రధాని మోదీ భారత్–రష్యా సంయుక్తంగా నిర్మించిన ఏకే 203 కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిల్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతూ.. 2007లో ఆయుధాల తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి 2010లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉండగా అలాంటిదేమీ జరగలేదన్నారు. స్థానిక ఎంపీ (రాహుల్ గాంధీ) అమేథీలో ఉపాధి కల్పనలో విఫలమయ్యారని విమర్శించారు. రాహుల్ ఆరోపణల్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిప్పికొడుతూ అమేథీలో అభివృద్ధిని చూసేం దుకు రాహుల్ భయపడుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment