amedhi
-
లాక్డౌన్ : కూతురును కాపాడుకోవాలనే తాపత్రయంతో..
లక్నో : మండుటెండలో ఒక చేతిలో బ్యాగు పట్టుకుని మరో చేత్తో తన మూడేళ్ల కూతురును భుజాలపై ఎత్తుకొని తన సొంతూరుకు వెళ్లడానికి ఏదైనా వాహనం లిఫ్ట్ ఇస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తోంది. ఇంతలో ఒక ట్రక్కు స్పీడుగా ఆమెను దాటుకుంటూ వెళ్లిపోయింది. ఇక చేసేదేంలేక కాలినడకనే తన ప్రయాణాన్ని ప్రారంభించింది.తన కూతురిని కరోనా బారీ నుంచి కాపాడాలనే ఆ తల్లి తాపత్రయం ఇండోర్ నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమేథీకి నడిపించేలా చేసింది. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రుక్సానా బానో తన భర్త అఖ్విబ్‌తో కలిసి యూపీలోని అమేథీలో నివసిస్తుంది. వారిద్దరికి నర్గీస్ అనే మూడేళ్ల కూతురుంది. 8వ తరగతి వరకు చదువుకున్న రుక్సానాకు కూతురంటే పంచప్రాణాలు. తాను బతికేదే తన కూతురు కోసమని రుక్సానా చాలాసార్లు స్పష్టం చేసింది. రుక్సానా భర్త అఖ్విబ్ ఒక హోటల్లో వెయిటర్‌గా పని చేస్తుండగా, ఆమె ఇళ్లలో పనిమనిషిగా చేస్తుంది. వారిద్దరికి కలిపి వచ్చే 9వేల రూపాయల జీతంలో ప్రతీ నెల రూ. 3వేలు తన కూతురు నర్గీస్ పేరిట బ్యాంకులో డిపాజిట్ చేసేవారు. తాము చదవుకోకపోయినా నర్గీస్ మాత్రం చక్కగా చదువుకోవాలనే ఆలోచన రుక్సానాలో బలంగా ఉండేది. ఇలా హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో కరోనా మహమ్మారి అలజడి సృష్టించింది. (ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు) దేశ వ్యాప్తంగా కరోనా విజృంభించడంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ వారి పాలిట శాపంగా మారింది. ఇద్దరు తమ ఉపాధి కోల్పోవడంతో అంతవరకు తాము దాచుకున్న డబ్బులు చూస్తుండగానే ఆవిరయ్యాయి.అయితే తన కూతురు రుక్సానా పేరిట బ్యాంకులో ఉన్న డబ్బును తీయడానికి రుక్సానా మనసు ఒప్పుకోలేదు. ఎంత కష్టమైనా సరే ఆ డబ్బు తీయద్దని భావించింది.అప్పటికే ఇండోర్ ప్రాంతంలో కరోనా కోరలు చాస్తుంది. అయితే కేంద్రం లాక్‌డౌన్‌ను గతవారం మళ్లీ పొడిగించడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.ఇక్కడే ఉంటే తన కూతురు కరోనా బారీన పడుతుందేమోనని భయపడింది. ఉన్న ఊరును వదిలి అమేధీలోని సొంతూరుకు వెళ్లాలని అనుకుంది. ఇదే విషయాన్ని భర్తతో చెబితే తాను ఇప్పుడు రాలేనని , ఇక్కడే ఉంటానని రుక్సానాకు చెప్పాడు. భర్త తన వెంట రావడానికి సముఖత వ్యక్తం చేయకపోవడంతో అఖ్విబ్‌ను వదిలేసి సొంతూరుకు వెళ్లాలని నిశ్చయించుకుంది. ఇంతలో తనకు తెలిసిన బంధువులు కూడా అమేధీలోని సొంతూరుకు వెళుతున్నారని తెలుసుకుంది. ఒక బ్యాగులో దుస్తులు, బిస్కెట్లు, జామ్ పెట్టుకొని కూతురు నర్గీస్‌ను తీసుకొని ఆ బృందంతో కలిసి బుధవారం రాత్రి ప్రయాణం ప్రారంభించింది. ట్రక్కు, లారీల్లో లిఫ్ట్ అడిగి వారంతా కలిసి ఎలాగోలా లక్నోకు చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ ప్రయాణం ప్రారంభించారు. రుక్సానా తన బిడ్డ నర్గీస్‌కు ఎండ వేడి తగలకుండా ముఖానికి ఒక చిన్న గుడ్డ కప్పి తన బంధువులతో కలిసి ప్రయాణం చేస్తుంది. ఇదే విషయాన్ని రుక్సానాను అడగితే.. ' లాక్డౌన్ మా పాలిట శాపమైంది. అయినా సరే నా కూతురును కాపాడుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నా. ఎంతకష్టమైనా సరే సొంతూరుకు వెళ్లేవరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది' అని పేర్కొంది. -
బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
అమేథీ (యూపీ): కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ అబద్ధాలను, చేతల్లేని ఒట్టి మాటలను ప్రజలకు వివరించి, కాషాయ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. ఉత్తరప్రదేశ్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. తన అన్న రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ నియోజకవర్గంలో ‘మన బూత్, మన గౌరవం’ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని, ఆ నియోజకవర్గ బూత్ స్థాయి కాంగ్రెస్ అధ్యక్షులతో దాదాపు రెండు గంటలపాటు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ కార్యకర్తలే ప్రజలకు వివరించాలనీ, లేకపోతే ఈ ప్రభుత్వ నిజస్వరూపం ప్రజలకు తెలీదని ప్రియాంక పేర్కొన్నారు. అమేథీ అంటే కాంగ్రెస్‌కు సొంత కుటుంబం, ఇల్లు వంటిదనీ, అందుకే రాహుల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారనీ, కానీ బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ కేవలం కాలక్షేపానికే అమేథీకి వస్తున్నారని ప్రియాంక అన్నారు. కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేయడమంటే తనకు ఇష్టమనీ, అయితే, పార్టీ కోసం ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమని తెలిపారు. పర్యటనలో భాగంగా ప్రియాక అయోధ్య వెళ్లనున్నారు. అయోధ్యలో రాముని విగ్రహం నెలకొల్పిన రామ్‌లల్లాను దర్శించుకుంటారా లేదా అనే ఇంకా తెలియాల్సి ఉంది. -
కీలక సెగ్మెంట్స్: ఈ విషయాలు మీకు తెలుసా!
వారణాసి పార్లమెంట్ నియోజక వర్గం: కాంగ్రెస్, కమలం పోటాపోటీ ఉత్తర ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో కీలకమైనది వారణాసి.ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు (రోహనియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్,వారణాసి కంటోన్మెంట్, సేవాపురి)ఉన్నాయి.పవిత్ర పుణ్యక్షేత్రం కాశీనే వారణాసి అని కూడా పిలుస్తారు. జిల్లా కేంద్రమైన వారణాసి జనరల్ నియోజకవర్గం.1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏడు సార్లు, బీజేపీ ఆరు సార్లు గెలిచింది.సీపీఎం, జనతాదళ్,భారతీయ లోక్‌దళ్ ఒక్కోసారి విజయం సాధించాయి.2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్‌పై 3.71 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.ఈ ఎన్నికల్లో నోటాకు రెండు వేలకుపైగా ఓట్లు వచ్చాయి. అమేథి పార్లమెంట్ నియోజక వర్గం: గాంధీ–నెహ్రూ కుటుంబ అడ్డా ఉత్తరప్రదేశ్‌లో మరో కీలక లోక్‌సభ నియోజకవర్గం అమేథీ. 1967లో ఇది ఏర్పాటైంది. దీని పరిధిలో ఐదు శాసన సభ నియోజకవర్గాలు (తిలోయి, సలాన్, జగ్దీశ్పూర్, గౌరీగంజ్, అమేథీ) ఉన్నాయి. నియోజకవర్గం ఏర్పాటు నుంచీ కాంగ్రెస్‌కు కంచుకో టగా నిలుస్తోంది. గాంధీ–నెహ్రూ కుటుంబానికి చెందిన సంజ య్గాంధీ (1980), రాజీవ్‌గాంధీ (1981), సోనియాగాంధీ (1999) ఇక్కడ నుంచి గెలిచారు. సోనియా తర్వాత ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ ప్రస్తుతం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 నుంచి ఆయన వరుసగా మూడు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. అయితే, 1977 ఎన్నికల్లో జనతా పార్టీ, 1998 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ గెలిచాయి. గత ఎన్నికల్లో (2014) రాహుల్ గాంధీ, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై 1.07 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాయ్‌బరేలి పార్లమెంట్ నియోజక వర్గం: కాంగ్రెస్‌కు కంచుకోట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తల్లి సోనియాగాంధీ ప్రాతి నిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ ఉత్తరప్రదేశ్‌లో ఉంది. జనరల్ కేటగిరీకి చెందిన ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ స్థానాలు (బచరవాన్, హర్చంద్పూర్, రాయ్‌బరేలీ, సరేని, ఉం ఛర్) ఉన్నాయి. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 16 సార్లు, బీజేపీ రెండుసార్లు, జనతా పార్టీ ఒకసారి గెలిచాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు (1967,71) వరుసగా గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, అజయ్ అగర్వాల్ (బీజేపీ)ను 3,52,713 ఓట్ల తేడాతో ఓడించారు. 1999 నుంచి సోనియా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
అబద్ధాలు చెప్పేందుకు సిగ్గుపడట్లేదా?
సాక్షి, న్యూఢిల్లీ: అమేథి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘2010లో నేనే స్వయంగా అమేథిలో ఆయుధాల ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాను. గత కొన్నేళ్లుగా అక్కడ చిన్న తరహా ఆయుధాలు తయారవుతున్నాయి. ఆదివారం మీరు (మోదీ) అమేథి వెళ్లి అలవాటైన రీతిలో అబద్ధాలు చెప్పారు. మీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా?’అంటూ రాహుల్ ట్విటర్లో ప్రశ్నించారు. అమేథీలో ప్రధాని మోదీ భారత్–రష్యా సంయుక్తంగా నిర్మించిన ఏకే 203 కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిల్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతూ.. 2007లో ఆయుధాల తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి 2010లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉండగా అలాంటిదేమీ జరగలేదన్నారు. స్థానిక ఎంపీ (రాహుల్ గాంధీ) అమేథీలో ఉపాధి కల్పనలో విఫలమయ్యారని విమర్శించారు. రాహుల్ ఆరోపణల్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిప్పికొడుతూ అమేథీలో అభివృద్ధిని చూసేం దుకు రాహుల్ భయపడుతున్నారని అన్నారు. -
'అందరూ తరలి వచ్చి ఓటేయండి'
అమేథీ : ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఆయన బుధవారం ఉదయం అమేథీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు స్వచ్చంధంగా తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత తరలి రావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రాహుల్ మోడీపై విరుచుకుపడ్డారు. తక్కువ కులం వాడిని కాబట్టే కాంగ్రెస్ తనను టార్గెట్ చేస్తుందన్న మోడీ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. -
రాహుల్ అనుమానం నిజమవుతుందా?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవిపై చేపట్టే విషయంపై స్పష్టత ఇచ్చారు. ఇన్నాళ్లు ఈ విషయంపై పెదవి విప్పని సోనియా గాంధీ తనయుడు మౌనం వీడారు. ప్రధాని పీఠం అధిష్టించేందుకు తాను సిద్ధమని సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే అందుకు అవకాశం రావాలంటూ మెలిక పెట్టారు. అందుకు ఎన్నికలు అయ్యేదాకా వేచిచూడాలని వెల్లడించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే పీఎం సీటులో కూర్చునే విషయం గురించి ఆలోచిస్తానని చెప్పారు. తాను ప్రధానమంత్రి కావాలని ఎంపీలు కోరితే ఆలోచిస్తానని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల తర్వాత లోక్‌సభ సభ్యులు, పార్టీ తనను ప్రధాని పదవి చేపట్టమని కోరితే కచ్చితంగా దీనిపై ఆలోచిస్తానని 'చినబాబు' సెలవిచ్చారు. అయితే తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే పీఎం పోస్టు చేపట్టే అంశం గురించి కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటానని అన్నారు. సొంత నియోజకవర్గం అమేథిలో రెండు రోజు పర్యటిస్తున్న రాహుల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌ను కూడా లోక్‌సభ సభ్యులే ఎన్నుకున్నారని రాహుల్ గుర్తుచేశారు. ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించే సంప్రదాయం తమ పార్టీలో లేదన్న తన తల్లి వాక్కును రాహుల్ పునరుద్ఘాటించారు. ప్రధానిగా ఎవరు ఉండాలని ఎన్నుకునే హక్కు ఎంపీలకు ఉందన్నారు. ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్‌ను ప్రధానిగా ప్రకటించాలని పలు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు కోరారు. ఇలాంటి సంప్రదాయం కాంగ్రెస్‌లో లేదని సోనియా ఈ విజ్ఞప్తిని తిరస్కరించారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ వెనుకడుగు వేయడాన్ని విపక్షాలు ఎద్దేవా చేశాయి. మోడీని చూసి కాంగ్రెస్ భయపడుతోందని బీజేపీ ఆరోపించింది. ఓడిపోయే పార్టీకి ప్రధాని అభ్యర్థిగా తన కుమారుడి పేరు ప్రకటించడం ఇష్టంలేక సోనియా అడ్డుచక్రం వేశారని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాహుల్‌ను రాజకీయ బలిపీఠంపై ఎక్కించేందుకు ఇష్టంలేకే సోనియాగాంధీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదన్నారు. అయితే రాహుల్ చేసిన తాజా వ్యాఖ్యలు మోడీ మాటలను నిజం చేసేవిగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదన్న అనుమానం రాహుల్ మాటల్లో వ్యక్తమయిందని విశ్లేషిస్తున్నారు. అధికారంలోకి వస్తేనే తాను ప్రధాని పదవి చేపడతానని రాహుల్ పరోక్షంగా అంగీకరించారని అంటున్నారు. రాహుల్ అనుమానం నిజమవుతుందా, లేదా తెలియాలంటే సాధారణ ఎన్నికల వరకు ఆగాల్సిందే. -
రాహుల్‌పై ఆప్ నేత కుమార్ విశ్వాస్ పోటీ
న్యూఢిల్లీ : ఢిల్లీని పదిహేనేళ్లపాటు పాలించిన షీలాదీక్షిత్‌ను మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై రణభేరి మోగించింది. లోక్‌సభ ఎన్నికల్లో అమేధీ నుంచి రాహుల్ గాంధీపై పోటీకి దిగనున్నట్లు ఆప్ నేత కుమార్ విశ్వాస్ శనివారమిక్కడ వెల్లడించారు. కుటుంబ రాజకీయాలకు బద్దలు కొట్టడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. ఒకవేళ రాహుల్ అమేధీ నుంచి కాకుండా మరెక్కడైనా పోటీ చేసినా.. తాను అక్కడే నిలబడతానని కుమార్ విశ్వాస్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ తమకు అగ్గిపుల్లతో సమానమని ఆప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాహుల్ నియోజకవర్గంలో ఇప్పటికే కుమార్ బిశ్వాస్ పర్యటించి....పరిస్థితిని సమీక్షించారు కూడా. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పార్లమెంటుపై గురిపెట్టింది. దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు కసరత్తు ప్రారంభించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది.