
'అందరూ తరలి వచ్చి ఓటేయండి'
అమేథీ : ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఆయన బుధవారం ఉదయం అమేథీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు స్వచ్చంధంగా తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
ముఖ్యంగా మహిళలు, యువత తరలి రావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రాహుల్ మోడీపై విరుచుకుపడ్డారు. తక్కువ కులం వాడిని కాబట్టే కాంగ్రెస్ తనను టార్గెట్ చేస్తుందన్న మోడీ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.