
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో కొనసాగింది. ఈ సమయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పర్యటనలో రాహుల్ గాంధీని ఆరేళ్ల బుడ్డోడు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగాడు. దీనికి రాహుల్ గాంధీ సరదా సమాధానం ఇచ్చారు. అదేమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే!
‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఉన్న రాహుల్‌ను ఆ కుర్రాడు ఈ ప్రశ్న అడగగానే రాహుల్ గాంధీ కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అర్ష్ అనే ఆరేళ్ల బాలుడు రాహుల్ గాంధీకి సంబంధించి ఓ బ్లాగ్ క్రియేట్ చేశాడు. దానిలో ఆ కుర్రాడు రాహుల్ గాంధీని కాబోయే ప్రధానిగా అభివర్ణించాడు.
ఆ కుర్రాడు రాహుల్ గాంధీని ‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని అడిగాడు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘ఇప్పుడు నేను పనిలో బిజీగా ఉన్నాను. తర్వాత ఆలోచిస్తాను’ అని అన్నారు. తరువాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కాగా బీహార్ వచ్చిన రాహుల్‌ను చూసేందుకు జనం తరలివచ్చారు. ఈ యాత్ర మణిపూర్‌లో ప్రారంభమై పశ్చిమ బెంగాల్ మీదుగా బీహార్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment