లక్నో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అధికారం ఇవ్వకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇండియా కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని యూపీలో బరిలోకి దిగిన హస్తం పార్టీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరించింది.
సమాజ్‌వాదీ పార్టీతో కలిసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని దెబ్బ తీసింది. దీంతో యూపీలో ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమి తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయోత్సాహంతో యూపీలో జూన్11నుంచి15 దాకా ధన్యవాద్ యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర జరగనున్నట్లు తెలిపింది. పార్టీ సీనియర్ నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా సమాజాంలోని పలు వర్గాలకు చెందిన వారికి రాజ్యాంగం కాపీలను బహుకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment