బాండ్‌ పేపర్లతో డ్రామాలా?.. కాంగ్రెసోళ్లను నమ్మొద్దు: ఎమ్మెల్సీ కవిత | Mlc Kavitha Comments On Congress Party | Sakshi
Sakshi News home page

బాండ్‌ పేపర్లతో డ్రామాలా?.. కాంగ్రెసోళ్లను నమ్మొద్దు: ఎమ్మెల్సీ కవిత

Published Tue, Nov 28 2023 10:47 AM | Last Updated on Tue, Nov 28 2023 12:22 PM

Mlc Kavitha Comments On Congress Party - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్లతో డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నాయకులకు బాండ్‌ పేపర్లు రాసిచ్చే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.

‘‘కర్ణాటకలో ఇలాగే బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పారు. పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు దిగజారి మోసం చేస్తారు. కర్ణాటకలో సంతకాలు చేసి 100 రోజులు అవుతున్నా ఒక్క కార్యక్రమం కూడా మొదలు పెట్టలేదు. మోదీ అధికారంలో ఉన్న కేంద్రంలో 13 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. తెలంగాణకు వచ్చి యువతతో సమావేశాలు నిర్వహించి రెచ్చ గొడుతున్నారు’’ అంటూ కవిత మండిపడ్డారు.

‘‘కాంగ్రెస్ మొసలి కన్నీళ్లకు బలైతే ఐదేళ్లు బాధ పడతారు.11 సార్లు పాలించిన కాంగ్రెస్ పాలనలో కరెంట్ సరిగ్గా లేదు. 9 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చాం. 50 ఏళ్లలో 41 రిజర్వాయర్‌లు నిర్మిస్తే 9 ఏళ్లలో 107 రిజర్వాయర్‌లు బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించాం’’ అని కవిత పేర్కొన్నారు.
చదవండి: కాంగ్రెస్‌ ‘బాండ్‌ పేపర్లు’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement