కవిత బెయిల్‌పై మే మొదటి వారంలో తీర్పు | Kavitha Bail petition Hearing Updates In ED Liquor Case | Sakshi
Sakshi News home page

కవిత బెయిల్‌పై మే మొదటి వారంలో తీర్పు

Published Thu, Apr 25 2024 6:09 PM | Last Updated on Thu, Apr 25 2024 6:09 PM

Kavitha Bail petition Hearing Updates In ED Liquor Case - Sakshi

కవిత బెయిల్ పిటిషన్ ల పై ముగిసిన వాదనలు

సీబీఐ కేసులో మే 2న బెయిల్ జడ్జిమెంట్

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి సీబీఐ కేసులో మే 2న తీర్పు వెల్లడించనుంది. అదే విధంగా ఈడీ కేసులో బెయిల్‌పై మే6న తీర్పు వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. కాగా మే7తో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది.

ఈడీ వాదనలు

  • పీఎంఎల్‌ఏ చట్టం సెక్షన్‌ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్ట్‌ చేశాం
  • అక్రమంగా అరెస్ట్‌ చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదు
  • ఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగింది.
  • రూ. 581 కోట్ల రూపాయలు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారు.
  • అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారు.
  • దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం జరిగింది.
  • ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కింది. 
  • దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారు.
  • పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారు.
  • విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారు.
  • విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు.
  • అసాధారణ లాభాలు గడించారు.
  • బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారు.
  • ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌కు  బెయిల్  దక్కలేదు.
  • ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం అందింది.
  • మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక  స్టేట్మెంట్ ఇచ్చారు.
  • అరవింద్ కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసులురెడ్డి మద్యం వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటేరియట్ కలిశారు. 
  • కవిత ను కలవాలని కేజ్రీవాల్ చెప్పారని మాగుంట చెప్పారు.
  • కవితను కలిసినప్పుడు 100 కోట్లు ఆప్ కి ఇస్తే ఢిల్లీ మద్యం వ్యాపారం ఇస్తారని ఆమె చెప్పింది.
  • అందులో 25 కోట్లు  కవిత మనిషి బుచ్చిబాబుకు మాగుంట చెల్లించారు.
  • ఎల్ 1 లైసెన్స్‌లో మేజర్ షేర్ దక్కించుకేందుకు కవిత ప్రయత్నించారు.
  • అయితే, సమీర్ మహేంద్రకు 33, మాగుంట 33, కవిత  33 శాతం వాటాలను పొందారు.
  • బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ మెసేజ్‌లో ఈ సాక్షాలు దొరికాయి.
  • మాగుంట రాఘవ అప్రూవర్ గా మారి అన్ని విషయాలను ధృవీకరించారు.
  • ఒకసారి 15 కోట్లు, మరోసారి 10 కోట్లు బుచ్చిబాబుకు, అభిషేక్ బోయినపల్లి కి మాగుంట సిబ్బంది ఇచ్చారు
  • అనుకూలంగా లిక్కర్ పాలసీ తయారీ కోసం ఈ లంచాలు ఇచ్చారు
  • కోర్టు అనుమతి తోనే నిందితులు అప్రూవర్ గా మారారు
  • అప్రూవర్‌ను ప్రలోభ పెట్టారని  అనుమానిస్తే అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టడమే. 
  • అప్రూవర్‌లపై  చేస్తున్న ఆరోపణలు ప్రచారం కోసం చేస్తున్న రాజకీయ వాదనలే తప్పు వాటిలో పస లేదు.
  • ఎవరు ఎవరికి ఎలక్టొరల్ బాండ్స్ ఇచ్చారనేది ఈ కేసులో అనవసరం.
  • చట్టం ప్రకారమే ఈ కేసు ముందుకి వెళ్ళాలి.
  • అనేక సార్లు  అరుణ్ పిళ్లై స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చారు.
  • ఈడీ బెదరించిందని ఎప్పుడూ చెప్పలేదు.
  • కవితకు నోటీసు ఇచ్చిన తర్వాతే  అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు
  • కవిత ఒత్తిడితోనే ఆరు నెలల తర్వాత అరుణ్ పిళ్లై వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు 
  • ఈడీ బెదిరిస్తే , అప్పుడే వెనక్కి తీసుకోకుండా ఆరు నెలలు తర్వాత వాంగ్మూలం వెనక్కి తీసుకుంటారా ?
  • కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చి బాబు స్టేట్మెంట్ ఇచ్చారు
  • దీని ద్వారా విజయ్ నాయర్ తో కలిసి లిక్కర్ పాలసీ తయారు చేశారు
  • పబ్లిక్ లోకి రాకముందే లిక్కర్ పాలసీ వీరికి వచ్చింది
  • కవిత చెప్పిన అంశాలే మద్యం పాలసీలో పెట్టారు
  • కవిత బంధువు మేకా శరణ్ ను ఇండో స్పిరిట్ లో ఉద్యోగిగా పెట్టారు
  • ఉద్యోగానికి హాజరు కాకుండా జీతం తీసుకున్నారు
  • విచారణ కోసం పిలిస్తే ఏడెనిమిది రోజుల పాటు మిస్ అయ్యాడు
  • ఈ కేసుకు సంబంధించి అనేక మంది వాంగ్మూలాలు ఇచ్చారు
  • హవాలా ఆపరేటర్స్ వాంగ్మూంలాలు ఇచ్చారు
  • కవిత ఇచ్చిన 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారు
  • ఎందుకు డిలీట్ చేశారంటే కవిత సమాధానం చెప్పలేదు
  • తన ఫోన్లను పని మనుషులకు ఇచ్చారని కవిత పొంతన లేని సమాధానాలు చెపుతున్నారు
  • పని మనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారు?
  • ఫోన్లు ఇవ్వాలని కోరిన వెంటనే డేటా ఫార్మాట్ చేశారు
  • సాక్ష్యాలు ధ్వంసం చేశారు, సాక్షులను బెదిరించారు

కాగా మంగళవారం మధ్యాహ్నం సైతం ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ నేటికివాయిదా వేశారు. మరోవైపు లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.

బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం నాటి వాదనలు..
ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్‌ హొస్సేన్‌ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్‌ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.

డీ తరఫున న్యాయవాది జొహెబ్‌ హొస్సేన్‌ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్‌ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.

ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్‌ ఆర్డర్‌ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు.   

ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్‌ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్‌ హొస్సేన్‌ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్‌ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్‌ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్‌ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్‌ చాట్‌లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. 

వాదనల తర్వాత కోర్టు బెయిల్‌ పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సిబిఐ కేసులో మే 2న, ఈడీ కేసులో మే 6న తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. మే 7న కవిత జ్యుడిషియల్‌ కస్టడీ ముగియనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement