న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కాపీ, పేస్ట్ బడ్జెట్ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. సొంత ఆలోచనలు, దార్శనికత లేకుండా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు లాంటి నాయకులు దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కేంద్ర మధ్యంతర బడ్జెట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్‌ను ఆర్థిక అధికారులు తయారు చేశారా, ఆర్‌ఎస్‌ఎస్ చేసిందా అని ఆయన ప్రశ్నించారు. తాను రైతులకు రుణమాఫీ ప్రకటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారని, ఇప్పుడు ఆయనే రైతులకు తాయిలాలు ప్రకటించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment