'హైదరాబాద్ అందరిదీ, ఏ ఒక్కరి జాగీరూ కాదు' అని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వాలనేది రాజకీయ నిర్ణయమన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని....హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఒప్పుకునేది లేదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుందన్నారు.