![Nampally Criminal Court Sentenced Accused To Death - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/18/Nampallycourt.jpg.webp?itok=WOQLDKhV)
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2018కి సంబంధించిన ఓ కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అయితే, తొలిసారిగి హైదరాబాద్‌లో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి.
వివరాల ప్రకారం.. అదనపు కట్నం కేసులో భార్యను చంపిన భర్తకు నాంపల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది. భవానీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇంజమ్ హక్ అనే వ్యక్తి తన భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో 2018లో ఇంజమ్ హక్ తన భార్యను హత్య చేశాడు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా నేడు నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఇదిలా ఉండగా.. తొలిసారి హైదరాబాద్‌లో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి.
Comments
Please login to add a commentAdd a comment