
సాక్షి, హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు మరికొందరిపై పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నమోదైన కేసును నాంపల్లి కోర్టు సోమవారం కొట్టేసింది. ఈ కేసులో మంత్రి తలసానితో పాటు ఎమ్మెల్సీలు స్టీఫెన్ సన్, రాజేశ్వరరావు, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్, అప్పటి మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూప నిందితులుగా ఉన్నారు.
వీరంతా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ గతేడాది ఎన్నికల్లో ప్రచారం చేశారనే ఆరోపణలపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ కోసం నాంపల్లి కోర్టు ఆధీనంలో ఏర్పాటైన ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. అభియోగపత్రాలతో పాటు కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కొట్టివేసింది
చదవండి: ఈటల రాజేందర్‌కు తప్పిన ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment