
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 నిర్వాహకులకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. బిగ్‌బాస్ కోఆర్డినేటర్ టీమ్ సభ్యులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బిగ్‌బాస్ కోఆర్డినేటర్స్ మహిళలను వేధిస్తున్నారంటూ.. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా కార్యక్రమ నిర్వాహకులు అభిషేక్, రవికాంత్, రఘులపై బంజారాహిల్స్ , రాయదుర్గం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ అగ్రిమెంట్ వ్యవహారంతో పాటు క్యాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ టీమ్ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి వాదనలు విన్నధర్మాసనం బిగ్‌బాస్ టీం సభ్యులకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment