సాక్షి, హైదరాబాద్ : ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది.1998లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తుండాపై కేసు నమోదైన విషయం తెలిసిందే. వరుస బాంబు పేలుళ్లలో తుండా పాత్ర ఉందన్న పోలీసులు అందుకు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించకపోవడంతో తుండాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. డిఫెన్స్ వాదనతో ఏకీభవించిన కోర్టు.. గత 6 సంవత్సరాలుగా కొనసాగుతున్న తుండా కేసులో కీలక తీర్పు వెలవరించింది. నిజానికి ఈ కేసులో తీర్పును గత నెల 18న వెల్లడించాల్సి ఉంది. కానీ, ఈ కేసును విచారణ జరుపుతున్న న్యాయమూర్తి సెలవులో ఉండడంతో నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పును వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment