సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ శంతను గౌడర్ (62) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న జస్టిస్ శంతను గౌడర్ ఇటీవల గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రి ఐసీయూలో చేరారు. పరిస్థితి విషమించి మృతి చెందారు. అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో జరిగాయి.
1958లో కర్ణాటకలో జన్మించిన జస్టిస్ శంతను గౌడర్ 1980లో బార్‌కౌన్సి ల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. 2004 లో కర్ణాటక హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గౌడర్ 2016లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన పదవీకాలం 2023 మే వరకు ఉంది. జస్టిస్ గౌడర్ మృతిపట్ల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment