district court judge
-
కోర్టులో జడ్జిని కాల్చి చంపిన పోలీసు
ఫ్రాంక్ఫర్ట్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన ఘటనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా ఈసారి ఏకంగా న్యాయమూర్తి బలయ్యారు. న్యాయమూర్తి పైకి ఆ ప్రాంత పోలీసు ఉన్నతాధికారి బులñ æ్లట్ల వర్షం కురిపించడం గమనార్హం. గురువారం కెంటకీ రాష్ట్రంలోని లెట్చర్ కౌంటీలోని వైట్స్‌బర్గ్ జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న 54 ఏళ్ల జిల్లా జడ్జి కెవిన్ ములిన్స్‌ను ఆయన ఛాంబర్‌లోనే లెట్చర్ కౌంటీ షరీఫ్ షాన్ ఎం.స్టైన్స్ కాలి్చచంపారు. విషయం తెల్సి పోలీసులు పక్కనే ఉన్న పాఠశాలలోని విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించేశారు. కాల్పులు జరిగినప్పుడు కోర్టులో దాదాపు 50 మంది ఉన్నారు. అసలేం జరిగిందంటే? గత ఎనిమిదేళ్లుగా అదే కౌంటీలో షరీఫ్‌గా పనిచేస్తున్న షాన్ గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైట్స్‌బర్గ్ కోర్టు భవనానికి వచ్చి జడ్జి ములిన్స్‌తో విడిగా అత్యవసరంగా మాట్లాడాలని అనుమతి కోరాడు. దీంతో జడ్జి ఆయనను తన ఛాంబర్‌కు తీసుకెళ్లి గది తలుపులు మూసేశారు. చాలాసేపు వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని బయట వరండాలో వేచి ఉన్న వ్యక్తులు చెప్పారు. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, తర్వాత షరీఫ్ షాన్ చేతులు పైకెత్తి బయటికొచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఛాంబర్ లోపలికి వెళ్లి చూస్తే బుల్లెట్ల గాయాలతో రక్తమోడి జడ్జి నిర్జీవంగా పడి ఉన్నారని కెంటకీ రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి మ్యాట్ గేహార్ట్ శుక్రవారం వెల్లడించారు. జడ్జిని షరీఫ్ ఎందుకు చంపారనే కారణం ఇంకా తెలియరాలేదు. ఏ విషయం మీద జడ్జి, షరీఫ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. షరీఫ్‌ను అరెస్ట్ చేసి పోలీసులు హత్యానేరం కింద దర్యాప్తు మొదలుపెట్టారు. -
Gyanvapi Masjid Case: కదిలిన తేనెతుట్టె!
చిన్నగా మొదలైన కొన్ని అంశాలే కాలగతిలో పెను పరిణామాలకు దారితీస్తాయి. ఇది చరిత్రలోని చిత్రమైన లక్షణం. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారానికి సంబంధించి అక్కడి జిల్లా న్యాయస్థానం సోమవారం ఇచ్చిన 26 పేజీల ఆదేశం సరిగ్గా అలాంటిదే. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతామూర్తులను పూజించేందుకు అనుమతించాలంటూ అయిదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్ విచారణార్హమైనదే అని కోర్టు నిర్ణయించడం కీలక పరిణామం. 17వ శతాబ్దికి చెందిన ఈ మసీదులో పూజలకు అనుమతించడానికి ఇప్పుడున్న మూడు చట్టాల ప్రకారం కుదరదంటూ మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ వాదించింది. ప్రార్థనా స్థలాల (ప్రత్యేక ఏర్పాట్ల) చట్టం – 1991, వక్ఫ్ చట్టం – 1995, యూపీ శ్రీకాశీ విశ్వనాథ్ ఆలయ చట్టం –1983... ఈ మూడింటినీ కమిటీ ప్రస్తావించింది. కానీ, జడ్జి విశ్వేశ ఆ వాదనను తోసిపుచ్చారు. ఈ 22న విచారణకు నిర్ణయించారు. జిల్లా కోర్ట్ ఆదేశంపై మస్జిద్ కమిటీ హైకోర్ట్ గుమ్మం తొక్కనుంది. వెరసి, సుదీర్ఘంగా సాగిన అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు – రామజన్మభూమి వ్యవహారంలా ఇక ఇప్పుడు కాశీలో జ్ఞానవాపి కథ మొదలు కానుంది. కొద్దినెలల విరామం తర్వాత జ్ఞానవాపి మసీదు వివాదంలో మొదలైన ఈ కొత్త అంకం అనేక పర్యవసానాలకు దారితీయడం ఖాయం. కొద్ది నెలల క్రితం మసీదు ప్రాంగణాన్ని సర్వే చేసి, వీడియో తీసినప్పుడు బయటపడ్డ శివలింగం తరహా నిర్మాణం గురించి కోర్టులో చర్చకు రానుంది. అయోధ్య, కాశీ, మథురల్లోని మసీదులు నిజానికి హిందువుల భూభూగాలేననే వాదన దీర్ఘకాలంగా ఉంది. చాలా ఏళ్ళుగా బీజేపీ, సంఘ్ పరివార్లు దాన్ని తమ రాజకీయ అజెండాగా మార్చుకున్నాయి. దీనిపై ఇటు వీధుల్లోనూ, అటు కోర్టుల్లోనూ పోరు సాగిస్తూనే ఉన్నాయి. రామజన్మభూమి ఉద్యమం తీవ్రంగా సాగుతున్న వేళ ఆ స్థాయి వివాదాలు ఇతర ప్రార్థనా స్థలాలపై తలెత్తకూడదనే ఉద్దేశంతో 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం చేసింది. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న స్థితినే కొనసాగించాలనీ, ఏ వివాదాస్పద ప్రార్థనా స్థల స్వరూప స్వభావాలనూ మార్చ రాదనీ సదరు చట్టం నిర్దేశిస్తోంది. తీరా 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ప్రార్థనాస్థల రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. మళ్ళీ ఇప్పుడు జ్ఞానవాపిపై కోర్టు ఆదేశంతో ఒకప్పటి బాబ్రీ మసీదు వివాదంలా సమాజంలోని రెండు వర్గాల మధ్య సామరస్యం దెబ్బతిని, సుస్థిరత దెబ్బతినే ప్రమాదం ఉంది. 1991 నాటి చట్టం సైతం నిష్ప్రయోజనం కావచ్చని ముస్లిమ్ వర్గం ఆందోళన. అయితే, 1947కూ, 1993కూ మధ్య జ్ఞానవాపి ప్రాంగణంలో హిందువుల ప్రార్థనలను అనుమతించారు. 1993 తర్వాతా ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏటా ఒకసారి అక్కడ దేవతామూర్తుల ప్రార్థనకు వీలు కల్పిస్తున్నారు. హిందూ మహిళల పిటిషన్‌ను అనుమతించిన జిల్లా కోర్ట్ ఆ సంగతులే గుర్తు చేసింది. ప్రార్థనాస్థల ధార్మిక స్వరూప స్వభావాలను మార్చే ప్రయత్నమేదీ ఇందులో లేదనీ, అక్కడ పూజలు చేసుకొనే హక్కు మాత్రమే అడుగుతున్నారనీ వ్యాఖ్యానించింది. కానీ, కథ అంతటితో ఆగుతుందా అన్నది ప్రశ్న. నిజానికి, జ్ఞానవాపి ప్రాంగణంపై హక్కులకు సంబంధించి హైకోర్ట్‌లో ఇప్పటికే అనేక కేసులు విచారణలో ఉన్నాయి. ప్రాంగణంలో భారత సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ)తో సర్వేకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశం పైనా హైకోర్ట్ విచారిస్తోంది. ఇలా జ్ఞానవాపిపై ఒక వర్గం ఒకే రకమైన పలు కేసులు దాఖలు చేయడం ఒక వ్యూహం ప్రకారం జరుగుతోందని రెండో వర్గం అనుమానం. పూజల కోసం భక్తులు వేసిన పిటిషన్‌ను ముందుగా జిల్లా కోర్టు వినాలని ఆ మధ్య సుప్రీం కోర్టే చెప్పింది. వారణాసి కోర్ట్ తాజా నిర్ణయంతో వివాదం పైకోర్టులకు పాకుతుంది. నిజానికి, దశాబ్దాల తరబడి సాగిన రామజన్మభూమి వివాదంపై 2019లో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు నిచ్చింది. బాబ్రీ మసీదు ఒకప్పుడున్న స్థలంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూనే, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని భారత రాజ్యాంగ లౌకికవాద లక్షణాలను కాపాడేందుకు తీర్చి దిద్దిన చట్టపరమైన పరికరంగా అభివర్ణించింది. తీరా తాజా నిర్ణయంతో వారణాసి కోర్ట్ ఆ మాట లను ప్రశ్నార్థకం చేసి, వివాదాల తేనెతుట్టెను కదిలించింది. పైకి కోర్టు కేసులుగా కనిపిస్తున్నా, వీటిలో రాజకీయాలూ పుష్కలం. బాబ్రీ మసీదు వివాదంతో ఇప్పటికే దేశంలో ఒక వర్గాన్ని బయటి వ్యక్తులుగా చూసే ధోరణి ప్రబలింది. జాతీయవాదం, హైందవ ఆత్మగౌరవం లాంటి పదబంధా లకు ప్రాచుర్యం పెరిగింది. మరోపక్క మథుర, ఆగ్రాల్లోనూ ఇలాంటి కేసులే కోర్టుల్లో ఉన్నాయి. అసలు ‘ప్రార్థనాస్థలాల చట్టం–1991’ రాజ్యాంగబద్ధత పైనా సుప్రీమ్‌లో కేసు పెండింగ్‌లో ఉంది. ఆ అంశంపై సుప్రీమ్ తీర్పు కోసం నిరీక్షించకుండా, జిల్లా కోర్ట్ అత్యుత్సాహం చూపింది. ఈ పరిస్థితుల్లో ఈ వివాదాలన్నిటికీ కీలకం కానున్న 1991 నాటి చట్టానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఎంత త్వరగా తన తీర్పునిస్తే అంత మంచిది. కింది కోర్టులకు అది మార్గదర్శకమవుతుంది. సమస్యలు మరింత జటిలం కాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే, ధార్మిక విశ్వాసాలు నిప్పు లాంటివి. వాటితో చెలగాటమాడితే చేతులు కాలక తప్పదు. ఏమరుపాటుగా ఉంటే సమాజాన్నీ, విభిన్న వర్గాల సామరస్యాన్నీ ఆ అగ్ని దహించకా తప్పదు. న్యాయస్థానాల మొదలు ప్రభుత్వాల దాకా అందరూ అప్రమత్తంగా ఉండాల్సింది అందుకే! -
తెలంగాణలో భారీగా జిల్లా కోర్టు జడ్జిల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. మొత్తంగా 55 మందిని బదిలీ చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పోస్టుల్లో నియమితులైన వారు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది. పేరు పనిచేస్తున్న స్థానం బ దిలీ అయిన స్థానం 1.ఎస్.శశిధర్‌రెడ్డి - లేబర్ కోర్టు పీఓ జిల్లా సెషన్స్ జడ్జి–సంగారెడ్డి 2.ఇ.తిరుమలాదేవి - మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి - రాష్ట్ర జుడిషియల్ అకాడమీ డైరెక్టర్ 3.బీఆర్ మధుసుధన్‌రావు - ప్రిన్స్‌పల్ స్పెషల్ జడ్జి–సీబీఐ చైర్మన్–వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ 4.జీవీ సుబ్రమణ్యం - రిజిస్ట్రార్–జుడిషియల్-1 హైకోర్టు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్–1 చైర్మన్ 5.బి.పాపిరెడ్డి - జిల్లా సెషన్స్ జడ్జి–సంగారెడ్డి - మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 6.సీహెచ్‌కే భూపతి - డైరెక్టర్–రాష్ట్ర జుడిషియల్ అకాడమీ - జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి 7.టి.శ్రీనివాసరావు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–అదిలాబాద్ - జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం 8.జీవీఎన్ భరతలక్ష్మి - చైర్మన్–ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ - లేబర్ కోర్టు పీఓ 9.సీహెచ్ రమేశ్‌బాబు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కామారెడ్డి - ప్రిన్స్‌పల్ స్పెషల్ జడ్జి–సీబీఐ కేసులు 10.బి.సురేశ్ - అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ 11.ఎం.నాగరాజు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నల్లగొండ - అధనపు జిల్లా సెషన్స్ జడ్జి–పెద్దపల్లి 12.బి.ప్రతిమ - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–జగిత్యాల 13.టి.రఘురాం - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి(ఫాస్ట్‌ట్రాక్)–మేడ్చల్ 14.ఎన్.ప్రేమలత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిరిసిల్ల 15.బి.గౌతం ప్రసాద్ -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–నిజామాబాద్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి 16.కే.శైలజ - చైర్పర్సన్, ఎల్‌ఆర్‌ఏటీ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి 17.పి.నారాయణబాబు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఆసీఫాబాద్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–బోధన్ 18.జి.నీలిమ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిద్దిపేట్ జిల్లా జడ్జి హోదాలో వాణిజ్య వివాదాల కోర్టు 19.జి.రాజగోపాల్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి ప్రిన్స్‌పల్ స్పెషల్ జడ్జి–ఎస్పీఈ, ఏసీబీ కేసులు 20.కే.సుదర్శన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఆసీఫాబాద్ 21.ఎన్ఎన్ శ్రీదేవి - ప్రిన్స్‌పల్ ఫ్యామిలీ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కామారెడ్డి 22.హుజాయబ్ అమద్ ఖాన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–భువనగిరి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వనపర్తి 23.ఏ.జయరాజు - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–నల్గొండ 24.కే.కుష - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–భువనగిరి 25.బోయ శ్రీనువాసులు- అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వనపర్తి - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్‌కోర్టు 26.ఎస్వీపీ సూర్యచంద్రకళ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి– బోధన్ ఫ్యామిలీ కోర్టు–ఎల్బీనగర్ 27.పి.నీరజ - అదనపు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ 28.ఎం.జాన్సన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిరిసిల్ల - ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ కోర్టు స్పెషల్ జడ్జి 29.టి.జయలక్ష్మి - ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ కోర్టు స్పెషల్ జడ్జి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్–జనగామ 30.లాల్‌సింగ్ శ్రీనివాస్ నాయక్ - స్పెషల్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - చైర్మన్–ఇండస్ట్రీయల్ ట్రిబ్యునల్ 31.జి.సుదర్శన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–జగిత్యాల - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సంగారెడ్డి 32.జి.ప్రేమలత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–పోక్సో కేసులు - అదనపు జిల్లా జడ్జి–నల్లగొండ 33.పి.ముక్తిద - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ - అదనపు ఫ్యామిలీ కోర్టు జడ్జి 34.బకరాజు శ్రీనివాసరావు - స్పెషల్ సెషన్స్ జడ్జి–అట్రాసిటీ అగైనెస్ట్ వుమెన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–నిజామాబాద్ 35.సీవీఎస్ సాయిభూపతి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సత్తుపల్లి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబుబాబాద్ 36.ఎం.భవాణి - అదనపు జిల్లా జడ్జి–నల్లగొండ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిద్దిపేట్ 37.కే.అరుణకుమారి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు 38.డి.మాధవీకృష్ణ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కరీంనగర్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–అదిలాబాద్ 39.కే.మారుతీదేవి - ఫ్యామిలీ కోర్టు జడ్జి–రంగారెడ్డి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మెదక్ 40.ఎస్.సరిత - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ 41.కే.జయంతి - అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి–మేడ్చల్ - ప్రిన్స్‌పల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి–సికింద్రాబాద్ 42.వినోద్‌కుమార్ - అదనపు స్పెషల్ జడ్జి–ఎస్పీ అండ్ ఏసీబీ కేసులు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం 43.కుమార్ వివేక్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కూకట్పల్లి - అదనపు జిల్లా జడ్జి –కరీంనగర్ 44.ఎం.పద్మజ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్ నల్లగొండ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ 45.పి.లక్ష్మికుమారి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ ట్రాక్ కరీంనగర్ 46.ఎం.సతీశ్‌కుమార్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్ కరీంనగర్ -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–అదిలాబాద్ 47.ఎన్.రోజరమణి - అదనపు స్పెషల్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ 48.టి.అనిత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ ట్రాక్ మెదక్ - అదనపు మెట్రోపాలిటన్ స్పెషల్ జడ్జి–హైదరాబాద్ 49.మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం - అదనపు జిల్లా జడ్జి–ఎల్బీ నగర్ 50.కే.ఉమాదేవి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు 51.బి.అపర్ణాదేవి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు(ఫాస్ట్ ట్రాక్) 52.సీహెచ్ పంచాక్షరీ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్, నిజామాబాద్ - జిల్లా సెషన్స్ జడ్జి నిజామాబాద్ 53.జే.కవిత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ ట్రాక్ జనగామ - అదనపు మెట్రోపాలిటన్ సెసన్స్ జడ్జి హైదరాబాద్ 54.పి.ఆనీరోజ్ క్రిస్టియన్- అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ - జడ్జి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు–పోక్సో 55.ఎన్.సంతోష్‌కుమార్ - పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు–గద్వాల - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ -
జిల్లా కోర్టులో రిపబ్లిక్‌డే వేడుకలు
జగిత్యాలజోన్ : జిల్లా కేంద్రంలోని కోర్టులో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో అదనపు జడ్జి కృష్ణమూర్తి జాతీయ పతాకం ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కవిత, మొదటి, రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు మధు, సతీశ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమనాతిని శంకర్, ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల క్రీడోత్సవాల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కోర్టులో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చిన హెడ్‌కానిస్టేబుల్ మల్లయ్యను జిల్లా జడ్జి అభినందించారు. వ్యవసాయ పరిశోధన స్థానంలో.. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ కళాశాలలో, పాలిటెక్నిక్ కళాశాలలో అసోసియేట్ డీన్ డాక్టర్ పద్మజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్పర్సన్ ప్రియాంక, జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో భాగ్యలక్ష్మి, ఉద్యానశాఖ కార్యాలయంలో ప్రతాప్‌సింగ్, ట్రాన్స్‌కో కార్యాలయంలో ఎస్ఈ శ్రవణ్‌కుమార్, ఏడీ కార్యాలయంలో ఏడీఏ రాజేశ్వర్, జగిత్యాల జైల్లో జైలర్ ప్రేమ్‌కుమార్ జాతీయ జెండాలు ఎగురవేశారు. ఎస్పీ కార్యాలయంలో.. జగిత్యాలక్రైం :జిల్లా కేంద్రంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 69వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అనంతశర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అటవీశాఖ కార్యాలయంలో... జిల్లా అటవీశాఖ కార్యాలయంలో జిల్లా అటవీశాఖ అధికారి నర్సింహరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీధర్ జెండా ఆవిష్కరించారు. అగ్నిమాపక కేంద్రంలోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఆగస్టు 13న నేషనల్ లోక్ అదాలత్
లీగల్ (కడప అర్బన్ ): జిల్లా వ్యాప్తంగా నేషనల్ మెగా లోక్ అదాలత్‌ను ఆగస్టు 13న నిర్వహించనున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ భవన్లో న్యాయవాదులు, అధికారులతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలా నేషనల్ మెగా లోక్ అదాలత్‌ను రెండవ శనివారం నిర్వహించాలనే నిబంధన మేరకు ఆగస్టు 13న జిల్లా కోర్టుతో పాటు, వివిధ కోర్టుల్లో నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీ కాదగిన కేసులన్నింటినీ పరిష్కరించుకోవచ్చన్నారు. వివిధ బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న రుణాల కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. చెక్కు బౌన్స్ కేసులను కూడా డిక్రీ కాదగిన దశలో కూడా పరిష్కరించుకునే విధంగా సంబంధిత న్యాయవాదులు, న్యాయవాదుల సంఘం వారు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి యూ. యూ. ప్రసాద్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.వి. రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.