జిల్లా కోర్టులో రిపబ్లిక్‌డే వేడుకలు | republic day celebrations across jagtial district | Sakshi
Sakshi News home page

జిల్లా కోర్టులో రిపబ్లిక్‌డే వేడుకలు

Published Sat, Jan 27 2018 5:53 PM | Last Updated on Sat, Jan 27 2018 6:00 PM

republic day celebrations across jagtial district - Sakshi

జెండా ఎగురవేస్తున్న జడ్జి కృష్ణమూర్తి


జగిత్యాలజోన్‌ : జిల్లా కేంద్రంలోని కోర్టులో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో అదనపు జడ్జి కృష్ణమూర్తి జాతీయ పతాకం ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కవిత, మొదటి, రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌లు మధు, సతీశ్‌కుమార్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భీమనాతిని శంకర్, ప్రధాన కార్యదర్శి మదన్‌మోహన్‌  పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల క్రీడోత్సవాల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కోర్టులో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చిన హెడ్‌కానిస్టేబుల్‌ మల్లయ్యను జిల్లా జడ్జి అభినందించారు.


వ్యవసాయ పరిశోధన స్థానంలో..


పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ కళాశాలలో, పాలిటెక్నిక్‌ కళాశాలలో అసోసియేట్‌ డీన్‌  డాక్టర్‌ పద్మజ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ ప్రియాంక, జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో భాగ్యలక్ష్మి, ఉద్యానశాఖ కార్యాలయంలో ప్రతాప్‌సింగ్, ట్రాన్స్‌కో కార్యాలయంలో ఎస్‌ఈ శ్రవణ్‌కుమార్, ఏడీ కార్యాలయంలో ఏడీఏ రాజేశ్వర్, జగిత్యాల జైల్లో జైలర్‌ ప్రేమ్‌కుమార్‌ జాతీయ జెండాలు ఎగురవేశారు.


ఎస్పీ కార్యాలయంలో..


జగిత్యాలక్రైం :జిల్లా కేంద్రంలో ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 69వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అనంతశర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  


అటవీశాఖ కార్యాలయంలో...


జిల్లా అటవీశాఖ కార్యాలయంలో జిల్లా అటవీశాఖ అధికారి నర్సింహరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎక్సైజ్‌ శాఖ కార్యాలయంలో ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ జెండా ఆవిష్కరించారు. అగ్నిమాపక కేంద్రంలోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement