భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఘనంగా జరిగాయి. టెంపుల్ టెర్రేస్ నగరంలో భారతీయులు ఈ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్- మాట, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు అంబరాన్నంటాయి. మాట, నాట్స్‌తో పాటు పలు తెలుగు సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇక భారతీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు.
ఈ సందర్భంగా ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని, ప్రసంగించారు. 75 ఏళ్ళ చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇండియన్ రిపబ్లిక్ థీమ్ తో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ అలరించారు.ఇక జాతీయ జెండాలను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు.
చిన్నారులు భారతమాత వేషాధరణలో.. స్వాత్రంత్య యోధుల గెటప్పులలో ఆకట్టుకున్నారు. ఇక భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పలువురిని మెమెంటోలతో సన్మానించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుడ్ మరియు వెండర్ స్టాల్స్‌కి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌కు సహాయసహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు.
(చదవండి: డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!)
Comments
Please login to add a commentAdd a comment