ఆగస్టు 13న నేషనల్‌ లోక్‌ అదాలత్‌ | national lok adalath by august 13th | Sakshi
Sakshi News home page

ఆగస్టు 13న నేషనల్‌ లోక్‌ అదాలత్‌

Published Sat, Jul 23 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

ఆగస్టు 13న నేషనల్‌ లోక్‌ అదాలత్‌

ఆగస్టు 13న నేషనల్‌ లోక్‌ అదాలత్‌

లీగల్‌ (కడప అర్బన్‌ ):

జిల్లా వ్యాప్తంగా నేషనల్‌ మెగా లోక్‌ అదాలత్‌ను ఆగస్టు 13న నిర్వహించనున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కోర్టులోని లోక్‌ అదాలత్‌ భవన్‌లో న్యాయవాదులు, అధికారులతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలా నేషనల్‌ మెగా లోక్‌ అదాలత్‌ను రెండవ శనివారం నిర్వహించాలనే నిబంధన మేరకు ఆగస్టు 13న జిల్లా కోర్టుతో పాటు, వివిధ కోర్టుల్లో నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీ కాదగిన
కేసులన్నింటినీ పరిష్కరించుకోవచ్చన్నారు. వివిధ బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న రుణాల కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. చెక్కు బౌన్స్‌ కేసులను కూడా డిక్రీ కాదగిన దశలో కూడా పరిష్కరించుకునే విధంగా సంబంధిత న్యాయవాదులు, న్యాయవాదుల సంఘం వారు
సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి యూ. యూ. ప్రసాద్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.వి. రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement