National Lok Adalath
-
మార్చి 12న జాతీయ లోక్ అదాలత్
సాక్షి, సిటీబ్యూరో: కేసుల రాజీకి సంబంధించిన జాతీయ లోక్ అదాలత్ వచ్చే నెల 12న జరగనుంది. దీనికి సంబంధించి న్యాయ విభాగం నుంచి నగర పోలీసులకు సమాచారం అందింది. ప్రజలకు ఉపయుక్తమైన లోక్ అదాలత్‌పై అందరికీ అవగాహన కల్పించాలని కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశించారు. వీలున్నంత వరకు అత్యధికులు దీన్ని వినియోగించుకుని, ఫలితాలు పొందేలా కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతలను జోనల్ డీసీపీలకు అప్పగించారు. దీంతో ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న సంయుక్త పోలీసు కమిషనర్ ఎం.రమేష్ రెడ్డి బుధవారం తన పరిధిలోని అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ భారీ లోక్ అదాలత్‌కు సంబంధించిన సమాచారం సంబంధిత వ్యక్తులకు అందించే బాధ్యతలను ఇన్స్పెక్టర్లు, సబ్– ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం ద్వారా లోక్ అదాలత్‌తో పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని రమేష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. -
ప్రాథమిక స్థాయి నుంచే న్యాయ సాయం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయం అర్థించే వారికి ప్రాథమిక స్థాయి నుంచే న్యాయ సహాయం అందాలని జాతీయ న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్ని రాష్ట్రాల న్యాయ సేవల సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు, సభ్య కార్యదర్శులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘పోలీస్ స్టేషన్‌కు హాజరవ్వాల్సి వచ్చినప్పటి నుంచే న్యాయ సహాయార్థులకు న్యాయ సేవలు అందించాలి. సరైన సమయంలో అప్పీలు దాఖలు చేయడం, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలు, సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీలతో సమన్వయం చేసుకోవడం, బెయిల్ అప్లికేషన్ అవసరమైన వారిని గుర్తించడం, వారికి న్యాయ సేవలు అందించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. శిక్ష పడిన వారికి న్యాయ సేవలు అందించే దిశగా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో నల్సా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రమంగా అన్ని రాష్ట్రాలకు దీనిని విస్తరించాలని నిర్ణయించారు. నేర బాధితులకు న్యాయ సహాయం అందించాలన్న మరో ముఖ్యమైన అంశంపైనా చర్చించారు. 2020లో ఐదు జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహించనున్నట్టు వివరించారు. ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్ రెండో శనివారం ఈ అదాలత్‌లను నిర్వహిస్తారు. -
రేపు జాతీయ లోక్ అదాలత్
అనంతపురం లీగల్ : జిల్లాలోని అన్ని కోర్టుల పరి«ధిలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి కమలాకర్‌రెడ్డి సంయుక్తంగా వెల్లడించారు. గురువారం న్యాయసేవా సదన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి నెలా రెండవ శనివారం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌లో పెట్టికేసులు, ఇ–చలానా కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా బెంచ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు అతిక్రమించిన చోదకులకు జారీ అయిన ఇ–చలానాలపై 400 కేసులు లోక్ అదాలత్‌కు వచ్చాయన్నారు. శాశ్వత సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం పర్మినెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (పాల్పస్)లో సభ్యులుగా వ్యవహరించటానికి గెజెటెడ్ హోదాలో ఉద్యోగ విరమణ చేసి 65 సంవత్సరాల లోపు వయసున్న వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికారసంస్థ కార్యదర్శి పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలతో ఈ నెల 15లోగా జిల్లా న్యాయసేవాఅధికారసంస్థ కార్యదర్శికి అందేలా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
నేడు జాతీయ లోక్ అదాలత్
అనంతపురం లీగల్ : జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిల్లో జాతీయ లోక్ అదాలత్‌ను రెండవ శనివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, కార్యద ర్శి కమలాకర్‌రెడ్డి తెలిపారు. కోర్టులో దాఖ లు చేయని వివాదాలను కూడా ఈ లోక్ అదాల త్లో రాజీ మార్గంలో పరిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. కక్షిదారులు లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఆగస్టు 13న నేషనల్ లోక్ అదాలత్
లీగల్ (కడప అర్బన్ ): జిల్లా వ్యాప్తంగా నేషనల్ మెగా లోక్ అదాలత్‌ను ఆగస్టు 13న నిర్వహించనున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ భవన్లో న్యాయవాదులు, అధికారులతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలా నేషనల్ మెగా లోక్ అదాలత్‌ను రెండవ శనివారం నిర్వహించాలనే నిబంధన మేరకు ఆగస్టు 13న జిల్లా కోర్టుతో పాటు, వివిధ కోర్టుల్లో నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీ కాదగిన కేసులన్నింటినీ పరిష్కరించుకోవచ్చన్నారు. వివిధ బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న రుణాల కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. చెక్కు బౌన్స్ కేసులను కూడా డిక్రీ కాదగిన దశలో కూడా పరిష్కరించుకునే విధంగా సంబంధిత న్యాయవాదులు, న్యాయవాదుల సంఘం వారు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి యూ. యూ. ప్రసాద్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.వి. రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒకే రోజు 2,096 కేసులకు పరిష్కారం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 2,096 కేసులు పరిష్కరించి ఆ జిల్లా న్యాయసేవాధికార సంస్థ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. అదాలత్‌లో వివిధ కేసుల్లో పిటిషనర్లకు రూ.5,37,55,124 పరిహారంగా మంజూరు చేసినట్లు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి చెప్పారు. -
లోక్‌అదాలత్‌లో 13 వేల కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,672 కేసులు పరిష్కరించినట్లు న్యాయసేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శి శ్యాంప్రసాద్ శనివారం తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ కేసీ భాను, జస్టిస్ చంద్రయ్యల నేతృత్వంలో ఈ అదాలత్ నిర్వహించామన్నారు. -
క్షణికావేశంలో నేరాలు
* అలాంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించాలి * హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేసీ భాను సాక్షి, హైదరాబాద్: కొందరు క్షణికావేశంలో మొదటిసారి నేరాలకు పాల్పడుతున్నారని, ఈ కేసులను గుర్తించి రాజీతో పరిష్కరించాలని హైకోర్టు సీని యర్ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ జస్టిస్ ఖండవల్లి చంద్రభాను సూచించారు. డిసెంబర్ 6న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్న సందర్భంగా నాంపల్లి క్రిమినల్ కోర్టుల ఆవరణలో బుధవారం పోలీసు ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో భాను ప్రసంగించారు. తరచుగా నేరాలకు పాల్పడుతున్న, కరడుగట్టిన నేరస్తుల కేసులను లోక్‌అదాలత్‌లలో పరిష్కరించాల్సిన అవసరం లేదన్నారు. తెలిసో తెలియకో మొదటిసారి నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించాలని, ఈ కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించడం ద్వారా వారు మరోసారి నేరాలకు పాల్పడే అవకాశం ఉండదన్నారు. మన దేశంలో జనాభాకు అనుగుణంగా కోర్టుల సంఖ్య లేదని, దీంతో కోర్టులపై కేసుల భారం అధికమవుతోందన్నారు. లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ సహా దర్యాప్తు దశలో ఉన్న కేసులను రాజీ ద్వారా పరిష్కరించవచ్చని లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి శ్యాంప్రసాద్ తెలిపారు. అనంతరం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజని మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాలతో ఎక్సైజ్ కేసులు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, మెమో రూపంలో సెక్షన్‌ను మార్చడంతో ఈ కేసులను రాజీ ద్వారా పరిష్కరించవచ్చన్నారు. న్యాయమూర్తులు, అన్ని ప్రభుత్వ విభాగాల అధికారుల సహకారంతో లోక్‌అదాలత్‌లో కేసులను పరి ష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ మహేం దర్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో సీఐడీ ఐజీ చారుసిన్హా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొండారెడ్డి, అదనపు సీపీ స్వాతిలక్రా, న్యాయమూర్తులు లక్ష్మీపతి, రాజ్‌కుమార్, రాధాకృష్ణ కృపాసాగర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.