అనంతపురం లీగల్ : జిల్లాలోని అన్ని కోర్టుల పరి«ధిలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి కమలాకర్‌రెడ్డి సంయుక్తంగా వెల్లడించారు. గురువారం న్యాయసేవా సదన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి నెలా రెండవ శనివారం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌లో పెట్టికేసులు, ఇ–చలానా కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా బెంచ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు అతిక్రమించిన చోదకులకు జారీ అయిన ఇ–చలానాలపై 400 కేసులు లోక్ అదాలత్‌కు వచ్చాయన్నారు.
శాశ్వత సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
పర్మినెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (పాల్పస్)లో సభ్యులుగా వ్యవహరించటానికి గెజెటెడ్ హోదాలో ఉద్యోగ విరమణ చేసి 65 సంవత్సరాల లోపు వయసున్న వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికారసంస్థ కార్యదర్శి పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలతో ఈ నెల 15లోగా జిల్లా న్యాయసేవాఅధికారసంస్థ కార్యదర్శికి అందేలా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
రేపు జాతీయ లోక్ అదాలత్
Published Thu, Oct 6 2016 11:17 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement