
అమెరికాలో గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. జార్జియాలోని ఓ గోల్ఫ్ కోర్టులో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ ప్రొఫెషనల్ గోల్ఫ్ ఆటగాడితో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కెన్నెసాలోని పైన్‌ట్రీ కౌంట్రీ క్లబ్‌లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జెన్ సిల్లర్ అనే ఆటగాడితో పాటు మరో రెండు మృతదేహాలను కాబ్ కౌంటీ పోలీసులు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 41 ఏళ్ల సిల్లర్ తలలో బుల్లెట్ దూసుకుపోయిందని.. దీంతో అక్కడిక్కడే చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.
ఇక దగ్గర్లో ఉన్న పొదల్లో నుంచి పాల్ పియర్‌సన్ అనే వ్యక్తితో పాటు మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, వాళ్ల శరీరంలోనూ బుల్లెట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. దుండగుడి కోసం ప్రస్తుతం తనీఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సిల్లర్ మృతిపట్ల గోల్ఫ్ అసోషియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు గోఫండ్‌మీ పేజీ ద్వారా విరాళాల సేకరణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment