searching operation
-
చిరుతలను బంధించడానికి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన టీటీడీ
-
తిరుమల నడకదారిలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత
-
తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత
-
మావోయిస్టు పార్టీ అగ్రనాయకులకోసం కొనసాగుతున్న వేట
-
చెడ్డీ గ్యాంగ్ కోసం ముమ్మర గాలింపు
గుణదల (విజయవాడ తూర్పు): నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయకంపితులను చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. నగరంలోని గుణదల, మధురానగర్ రైల్వేస్టేషన్ ప్రాంతాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ తాళం వేసిన ఇళ్లు, విల్లాస్, అపార్టుమెంట్లలో తరచూ దొంగతనాలకు పాల్పడుతూ కలకలం సృష్టిస్తున్నారని, దీనివలన ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే దోపిడీలు గుజరాత్ రాష్ట్రంలోని చాహోత్ జిల్లా నుంచి చెడ్డీ గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించింది. గత పది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ సంచరిస్తోంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తరచూ ఈ గ్యాంగ్ దోపిడీలు చేస్తుంటారని టి.కె.రాణా తెలిపారు. కేవలం రాత్రి సమయాల్లోనే నివాసాల మధ్య తిరుగుతూ చోరీలు చేయటమే వీరి లక్ష్యమని వివరించారు. రైల్వే స్టేషన్లే వీరి జాగాలు... రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడే చెడ్డీ గ్యాంగ్ సభ్యులు పగటి పూట యాత్రికులుగా నటిస్తారు. అందుకే దూర ప్రాంతాల నుంచీ వచ్చిపోయే ప్రయాణికుల్లా రైల్వే స్టేషన్లలో ఉంటుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా అమాయకుల్లా నటిస్తూ మోసం చేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. దోపిడీలు పూర్తయిన తరువాత వీరు రైలు మార్గాల ద్వారానే వారివారి స్వస్థలాలకు చేరుకుంటారని పోలీస్ కమిషనర్ వివరించారు. సాధారణంగా వీరు అర్ధరాత్రి 1–4 గంటల మధ్య దొంగతనాలు చేస్తుంటారని చెప్పారు. దాడికి పాల్పడరు.. చెడ్డీ గ్యాంగ్ దోపిడీకి అడ్డు వచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడతారని, అవసరమైతే హత్య చేసేందుకు కూడా వెనుకాడరని అపోహలు ప్రచారంలో ఉన్నాయని, అయితే ఇవి నమ్మదగినవి కావని సీపీ స్పష్టం చేశారు. గత పది రోజుల వ్యవధిలో నగరంలో 3 చోట్ల ఈ చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడ్డారని, ఈ ఘటనల్లో సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు దోచుకుపోయారని, అయితే ఆయా ఘటనల్లో ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు.. చెడ్డీ గ్యాంగ్‌ను అదుపులోనికి తీసుకునే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్యాంగ్ సభ్యుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. ఇటీవల జరిగిన చోరీల సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించినట్లు చెప్పారు. నగర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో చెడ్డీ గ్యాంగ్‌పై సమాచారాన్ని అందించామన్నారు. క్రైమ్, లా అండ్ ఆర్డర్, పోలీసులను పది బృందాలుగా నియమించినట్లు వివరించారు. అనంతరం గుణదల, మధురానగర్ రైల్వే స్టేషన్లలో పర్యటించారు. డీసీపీ హర్షవర్థన రాజు, మాచవరం పోలీసులు హాజరయ్యారు. గుజరాత్‌కు ప్రత్యేక బృందాలు చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీస్ టీమ్‌లను గుజరాత్‌కు పంపినట్లు సీపీ టి.కె.రాణా తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా చెడ్డీగ్యాంగ్ దొంగల ఫొటోలను సేకరించిన పోలీసులు మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే గుజరాత్ పోలీసులతో చర్చలు జరిపి దొంగలను పట్టుకునేందుకు సంయుక్త కార్యాచరణ అమలు చేస్తున్నారు. నగర ప్రజలు అందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డీసీపీ బాబూరావు, ఏడీసీపీ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
Hyderabad: మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు
-
గోల్ఫ్ కోర్టులో కాల్పులు.. ముగ్గురి దుర్మరణం
అమెరికాలో గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. జార్జియాలోని ఓ గోల్ఫ్ కోర్టులో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ ప్రొఫెషనల్ గోల్ఫ్ ఆటగాడితో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కెన్నెసాలోని పైన్‌ట్రీ కౌంట్రీ క్లబ్లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జెన్ సిల్లర్ అనే ఆటగాడితో పాటు మరో రెండు మృతదేహాలను కాబ్ కౌంటీ పోలీసులు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 41 ఏళ్ల సిల్లర్ తలలో బుల్లెట్ దూసుకుపోయిందని.. దీంతో అక్కడిక్కడే చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఇక దగ్గర్లో ఉన్న పొదల్లో నుంచి పాల్ పియర్సన్ అనే వ్యక్తితో పాటు మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, వాళ్ల శరీరంలోనూ బుల్లెట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. దుండగుడి కోసం ప్రస్తుతం తనీఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సిల్లర్ మృతిపట్ల గోల్ఫ్ అసోషియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు గోఫండ్‌మీ పేజీ ద్వారా విరాళాల సేకరణ చేపట్టారు. -
ఆధునిక పరిజ్ఞానంతో గాలింపు
గల్లంతైన విద్యార్థుల ఆచూకీకి కృషి ఎన్డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి బేగంపేట: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన నగర విద్యార్థుల ఆచూకీ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జల్లెడ పడుతున్నట్లు ఎన్డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. శనివారం బేగంపేటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లార్జి డ్యామ్ కింది భాగంలోని మూడున్నర కిలోమీటర్ల పరిధిలో ఇక ఎలాంటి మృతదేహం ఉండే అవకాశం లేదని తమ సంస్థ నిపుణులు తేల్చిచెప్పినట్లు చెప్పారు. ఆదివారం ఉదయం నుంచిప్రారంభించే సెర్చింగ్ ఆపరేషన్‌లో నౌకాదళానికి చెందిన అత్యాధునిక సైడ్ స్కాన్ సోనార్, జీఎంఆర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన లాడర్ అనే మరో స్కానింగ్ యంత్రం సాయంతో నది అడుగు భాగంలో జల్లెడ పట్టనున్నట్లు పేర్కొన్నారు. మెత్తం ఆపరేషన్‌లో తమ ఎన్డీఎంఏ టీమ్‌తో సహా మెత్తం 700 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. లార్జి డ్యామ్ కింద నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండో డ్యామ్ వరకు జల్లెడ పడుతున్నట్లు తెలిపారు. తీవ్ర వాతవరణ ప్రతికూలతల మధ్య విద్యార్థుల ఆచూకీ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల వేదనను తాము అర్థం చేసుకుంటామని అయితే ప్రకృతి సహకరించక పోవడంతో తీవ్ర ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసు బృందం తిరుగు పయనం హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లా లార్జి డ్యామ్ వద్ద బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల గాలింపు చర్యల్లో పాలుపంచుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం నేడు తిరుగుపయనమైంది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే స్పందించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సహాయక చర్యల కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించిన విషయం తెలిసిందే. బాలనగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ నేతృత్వంలో వెళ్లిన పేట్‌బషీరాబాద్ ఏసీపీ ఎం.శ్రీనివాసరావు, దుండిగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు బృందం ఘటనా స్థలంలో వారం రోజుల పాటు బాధిత విద్యార్థి కుటుంబాలకు ధైర్యం చెబుతూ సహాయ చర్యల్లో పాలు పంచుకున్నారు. విద్యార్థుల మృతదేహాలు వెలికి తీయడంలో అక్కడి అధికారులు, సిబ్బందికి తోడుగా నిలిచారు. వెలికి తీసిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం లోను, మృతదేహాలు హైదరాబాద్‌కు తరలించడంలో సహకరించారు. గ ల్లం తైన 24 మంది విద్యార్థుల్లో కేవలం 8 మంది విద్యార్థుల మృతదేహాలు మాత్రమే బయటపడగా.. ఇంకా 16 మంది ఆచూకీ కానరాలేదు. మృతదేహాలు వెలికి తీసేందుకు ఇంకా ఆధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టాలని అక్కడి ప్రభుత్వం భావించింది. దీంతో వారం రోజు నుంచి అక్కడే విధినిర్వహణలో నిమగ్నమైన సైబరాబాద్ పోలీసులు ఆదివారం తిరిగి రానున్నారు. మృతదేహాలు ఆలస్యంగా లభించే అవకాశాలు ఉన్నాయని బాలనగర్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ పేర్కొన్నారు.