
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇండియానాపొలిస్ నగరం సమీపంలోని మున్సీ పట్టణంలో ఘోరంగా జరిగింది. ఆరేళ్ల బాలుడు ఇంట్లో ఐదేళ్ల తన చెల్లిని తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన బాలిక కన్నుమూసింది. ఈ ఘటనలో బాలుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు.
మంగళవారం తెల్లవారుజామున జరిగినట్లు అధికారులు తెలిపారు. బాలిక తలలో తూటా దిగినట్లు చెప్పారు. ఆమెను స్థానిక ఐయూ హెల్త్ బాల్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. సురక్షిత ప్రాంతంలో పెట్టిన రెండు హ్యాండ్ గన్స్‌లో నుంచి ఒకదానిని తన ఆరేళ్ల బాలుడు తీసుకున్నట్లు చెప్పారు అరెస్టయిన జాకబ్ గ్రేసన్. తన చెల్లిన కాల్చినట్లు చెప్పారు. నిరక్ష్యంగా వ్యవహరించినందుకు జాకబ్‌తో పాటు ఆయన భార్య కింబెర్లి గ్రేసన్‌ను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే..
Comments
Please login to add a commentAdd a comment