
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఐదేళ్లపాటు సైన్యంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రక్షణరంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. త్రివిధ దళాల్లో సైనిక సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కమిటీ ఈ మేరకు ఓ నివేదికను పార్లమెంటుకు సమర్పించింది.
ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు కమిటీ తెలిపింది. ఈ సమస్య తీవ్రతను రక్షణశాఖ డీవోపీటీ దృష్టికి సరిగ్గా తీసుకెళ్లలేకపోయిందని ఆక్షేపించింది. ప్రస్తుతం భారత ఆర్మీలో 7,679 మంది అధికారులతో పాటు 20,185 మంది జూనియర్ కమిషన్డ్ అధికారులు, నేవీలో 1,434 మంది అధికారులతో పాటు 14,730 మంది సెయిలర్లు, వాయుసేనలో 146 మంది అధికారులు, 15,357 మంది ఎయిర్‌మెన్ల స్థానాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment