డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్‌ను భారత మహిళల హాకీ జట్టు పరాజయంతో ఆరంభించింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 1-4తో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. భారత్ తరఫున అనురాధా దేవి తోక్‌చామ్ ఏకైక గోల్ సాధించగా... పిపా హెవార్డ్స్ (18, 47వ ని.), అనితా మెక్‌లారెన్ (51వ ని.), పెట్రియా వెబ్‌స్టెర్ (53వ ని.)లు కివీస్‌కు గోల్స్ అందించారు. ఉక్కపోత, వేడి వాతావరణం ఉన్నప్పటికీ భారత క్రీడాకారిణులు ఆరంభంలో అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు.
అయితే న్యూజిలాండ్ పదేపదే దాడులు చే స్తూ ఆరో నిమిషంలో రెండు పెనాల్టీ కార్నర్లను సా ధించింది. కానీ భారత డిఫెండర్లు, గోల్ కీపర్ సవితా అద్భుతంగా అడ్డుకట్ట వేశారు. రెండో క్వార్టర్స్‌లో మరింత అటాకింగ్‌కు దిగిన కివీస్ తొలి గోల్ సాధించింది. ఎండ్‌లు మారిన తర్వాత పుంజుకున్న భారత్ వరుసపెట్టి అవకాశాలను సృష్టించుకున్నా గోల్స్ మాత్రం చేయలేకపోయింది. నాలుగో క్వార్టర్స్‌లో కివీస్ ఏకంగా మూడు గోల్స్ చేసి గెలిచింది.