
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రక్షణ సలహాదారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా శాంతి సేథి నియమితులయ్యారు. జాతీయ భద్రతా సలహాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆమె సమన్వయం చేయనున్నారు. శాంతి 1993లో యూఎస్ నేవీలో చేరారు.
యూఎస్ నౌకాదళంలో గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ డికేటర్ నౌక ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. యూఎస్ యుద్ధ నౌక కమాండర్‌గా వ్యవహరించిన తొలి ఇండో అమెరికన్ ఆమే. భారత్‌కు వచ్చిన యూఎస్ నౌకకు తొలి మహిళా కమాండర్ కూడా.
చదవండి: (ఏడాది కాలంలో దాదాపు 8 లక్షల వీసాల జారీ: డొనాల్డ్ హెఫ్లిన్)