జాతీయస్థాయిలో నగర భద్రతకు ప్రశంసలు | Praise to the location of national security | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయిలో నగర భద్రతకు ప్రశంసలు

Published Fri, Mar 18 2016 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

జాతీయస్థాయిలో నగర భద్రతకు ప్రశంసలు

జాతీయస్థాయిలో నగర భద్రతకు ప్రశంసలు

హైదరాబాద్ నగరానికి దేశవ్యాప్తంగా రక్షణ విషయంలో ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ తెలిపారు.

సేఫ్టీ, సెక్యూరిటీ ఇండియా సదస్సులో డీజీపీ అనురాగ్‌శర్మ
 
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి దేశవ్యాప్తంగా రక్షణ విషయంలో ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న సేఫ్టీ, సెక్యూరిటీ ఇండియా-2016 జాతీయ సదస్సును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రమాదకర పనులు చేసేటప్పుడు సేఫ్టీ సామగ్రిని తప్పకుండా వాడాలన్నారు.

హ్యుమన్, వర్క్‌మెన్, ఫైర్‌సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రీయల్, ఎలక్ట్రికల్ సేఫ్టీల్లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, వస్తువులను వాడుకోవాలని సూచించారు. సదస్సులో  70 మంది సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శించారు. కార్యక్రమంలో యూఎస్ జనరల్ కాన్సులేట్ మైకేల్ సి.ముల్లిన్స్, ఫార్మర్ వన్‌ఎఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ కేసీ రెడ్డి, మాజీ డీజీపీ స్వర్ణజీత్‌సేన్ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement