Andrei Belousov: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్‌ | Russia: Vladimir Putin appoints economist Andrei Belousov as defense minister | Sakshi

Andrei Belousov: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్‌

Published Tue, May 14 2024 5:41 AM | Last Updated on Tue, May 14 2024 5:41 AM

Russia: Vladimir Putin appoints economist Andrei Belousov as defense minister

మాస్కో: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్‌చేపట్టిన వ్లాదిమిర్‌ పుతిన్‌ మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించారు. రాజ్యాంగం ప్రకారం శనివారం మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. పాత కేబినెట్‌లో రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు మాత్రమే అవకాశమివ్వలేదు. రక్షణ శాఖ సహాయ మంత్రి తిమూర్‌ ఇవనోవ్‌ అవినీతి ఆరోపణలతో అరెస్ట్‌ కావడంతో షోయిగుకు పదవీ గండం తప్పదని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. 

ఆదివారం అధ్యక్షుడు పుతిన్‌ నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్‌(65)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. షోయిగుకు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటరీ బాధ్యతలను అప్పగించారు. ఆండ్రీ బెలౌసోవ్‌ 2020 నుంచి ఫస్ట్‌ డిప్యూటీ ప్రధానమంత్రిగా కొనసాగు తున్నారు. అంతకుముందు ఏడేళ్లపాటు పుతిన్‌ సలహాదారుగా ఉన్నారు. కొత్త ఆవిష్కరణలకు, నూతన ఆలోచనలకు అనుగుణంగా రక్షణ శాఖను తీర్చిదిద్దేందుకే బెలౌసోవ్‌ను నియమించినట్లు అధ్యక్ష భవనం తెలిపింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement