ఆ తర్వాతే షూటింగ్‌లకు అనుమతి: తలసాని | Telugu Film Industry Celebrities Meets Talasani Srinivas Yadav | Sakshi
Sakshi News home page

ఆ తర్వాతే షూటింగ్‌లకు అనుమతి: తలసాని

Published Wed, May 27 2020 3:06 PM | Last Updated on Wed, May 27 2020 4:21 PM

Telugu Film Industry Celebrities Meets Talasani Srinivas Yadav - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్‌తో టాలీవుడ్‌సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశమయ్యారు. నిర్మాతలు సీ.కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్‌.శంకర్, మా అధ్యక్షుడు నరేష్‌, ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్ రాంమోహన్ రావు, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని తలసాని అన్నారు. సినీ పరిశ్రమకు బెస్ట్‌ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అన్ని పరిశీలించిన తర్వాతే షూటింగ్‌లకు అనుమతిస్తామని పేర్కొన్నారు.

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుంది. లాక్ డౌన్‌తో సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లు నిలిచిపోయి ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి వద్ద సినీ ప్రముఖులతో ఇప్పటికే సమావేశంలో పలు అంశాలను చర్చించడం జరిగింది’ అని తలసాని అన్నారు. షూటింగ్‌లకు అనుమతిపై రేపు మరోసారి సమావేశమవుతామన్నారు. (భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement