
హీరో రామ్‌చరణ్ ఓ వైపు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌సీ 16’(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు ఈ నెలలో మైసూర్ వెళ్లనున్నారాయన. తొలి చిత్రం ‘ఉప్పెన’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ద్వితీయ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేసే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ‘ఆర్‌సీ 16’ ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన శివ రాజ్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్ పోషించనున్నారు. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈ నెల 22 నుంచి కర్నాటక రాష్ట్రంలోని మైసూర్‌లో మొదలవుతుందని సమాచారం. రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారట బుచ్చిబాబు. అక్కడ నాన్‌స్టాప్‌గా 15 రోజుల పాటు షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment