సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను నవంబర్ 8 నుంచి 14వ తేదీ వరకు ఘనంగా నిర్వ హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రారంభ, ముగింపు వేడు కలను శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ అధ్యక్ష తన వివిధ రంగాలకు చెందిన 42 మంది ప్రముఖు లతో ఆర్గనైజింగ్ కమిటీని నియమించామన్నారు. ఈ చలన చిత్రోత్సవంలో 19 మంది జ్యూరీ మెంబర్స్‌ను ఎంపిక చేయగా, వీరిలో భారత్ నుంచి 8 మందిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. 93 దేశాలు, 295 సినిమాలు ప్రదర్శనలో పాల్గొంటాయని తెలిపారు. అన్ని దేశాల నుంచి 291 మంది, మన రాష్ట్రం నుంచి 50 మంది బాలల ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొ ననున్నట్లు వివరించారు. 108 దేశాల నుంచి 1,408 చిత్రాలను ఈ ఉత్సవాల్లో ప్రదర్శనకుగాను ఎంట్రీ లను పంపినట్లు తెలిపారు. చిత్రాల ప్రదర్శనకు ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్‌ను ఎంపిక చేశామని చెప్పారు. బుద్ధిమాంద్యం, వికలాంగ బాలల కోసం తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో ప్రత్యేకంగా చిత్రా లను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక థియేటర్‌లో బాలల చలన చిత్రాలు ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొ న్నారు. 45 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని సుమారు 1.50 లక్షల మంది పిల్లలను థియేటర్ల వరకు తీసుకువచ్చి, తిరిగి పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రదర్శించే చిత్రాలు...
బాలల చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకుగాను షాను, మట్టిలో మాణిక్యాలు, ఎగిసే తారాజువ్వలు, డూడూ – డీడీ, ఇండీవర్ స్పెషల్ ఫిల్మ్‌గా పూర్ణ తెలుగు చిత్రాలు ఎంపికైనట్లు మంత్రి తలసాని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ఈశ్వర్ (అత్తాపూర్), శివపార్వతి (కూకట్‌పల్లి), రంగా (జీడిమెట్ల), మహాలక్ష్మి (కొత్తపేట), ప్రశాంత్( సికింద్రాబాద్), సినీ–పోలీస్ స్క్రీన్ 3 (మల్కాజ్‌గిరి), సినీ పోలీస్ స్క్రీన్ 4 (మల్కాజ్‌గిరి), హైటెక్ (మాదాపూర్), కుమార్ (కాచిగూడ), గోకుల్ (ఎర్రగడ్డ) సినిమా థియేటర్లను అద్దెకు తీసుకున్నట్లు వివరించారు. తెలుగు లలిత కళాతోరణంలో నవంబర్ 9 నుండి 13 వరకు రోజూ సాయంత్రం చలనచిత్ర ప్రదర్శనతోపాటు 98 పాఠశాలలకు చెందిన బాలలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పబ్లిక్ గార్డెన్‌లోని జవహర్ బాల భవన్‌లో నవంబర్ 9 నుండి 13వ తేదీ వరకు రోజూ సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు దాదాపు 120 మంది పిల్లలతో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసిన 30 మంది, రెసిడెన్షియల్ స్కూల్స్‌కు చెందిన 20 మంది బాలలను ఈ ఉత్సవాలకు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా శాశ్వతంగా అనుమతులు వచ్చిన వెంటనే నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయనున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ రాంమోహన్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేస్తామని ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ మిట్టల్ తెలిపారు. సమావేశంలో ఎఫ్‌డీసీ జేఎండీ కిషోర్‌బాబు పాల్గొన్నారు.
8 నుంచి బాలల చలన చిత్రోత్సవాలు
Published Thu, Oct 26 2017 11:58 PM | Last Updated on Fri, Oct 27 2017 12:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment