
చంద్రబాబు.. తునికి ఎందుకు వెళ్లలేదు?
ప్రశ్నించిన మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అరగంటలో వస్తానని ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికిన ఏపీ సీఎం చంద్రబాబు తునిలో అల్లర్లు జరిగి ఒక రోజు గడిచినా ఎందుకు వెళ్లలేదని రాష్ట్ర వాణి జ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. జరిగిన సంఘటనలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని కారణాలు చూపి, తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గాలి మాటలతో ప్రజలను వంచించడం మాని ఏపీపై శ్రద్ధ వహిస్తే బాగుంటుందని సూచించారు.
తునిలో జరిగిన అల్లర్ల విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును గమనించైనా, గ్రేటర్ ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించి, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని తలసాని కోరారు.