
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు పశు వైద్యాధికారులను పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. అధికారుల సస్పెన్షన్‌కు సంబంధించి ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గొర్రెల కొనుగోలు, రవాణాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పశు వైద్యాధికారి కాంతయ్య, అదే జిల్లా రుద్రంగి మండల పశు వైద్యాధికారి మనోహర్‌కుమార్‌లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తలసాని హెచ్చరించారు.