
సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయి కిరణ్ యాదవ్, సినీ ప్రముఖులు కలిసి 14 వేల మంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
రెండు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న 14 వేల మంది సినీ కార్మికులు, సినీ, టీవీ ఆర్టిస్టులకు నిత్యావసర సరుకులు కలిగిన కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, శంకర్, కొరటాల శివ, నిర్మాతలు సీ. కళ్యాణ్, దిల్ రాజులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment