
బిపిన్, రమ్య, ఏవి స్వామి, బాబుమోహన్, సాయి త్రిశాంక్ ముఖ్య తారలుగా కూర అంజిరెడ్డి సమర్పణలో షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై బిపిన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బంగారు తెలంగాణ’. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ ఈ చిత్రం ఆడియో సీడీలను విడుదల చేశారు. దర్శకుడు– నటుడు– నిర్మాత బిపిన్ మాట్లాడుతూ–‘‘తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. సీయం కేసీఆర్ కృషి వల్లే బంగారు తెలంగాణ సాధ్యం అయింది.
అసలు... తెలంగాణ ఎలా వచ్చింది? అనే కాన్సెప్ట్‌పై సినిమాను తెరకెక్కించాం. సినిమాకు సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారు మా సినిమా రిలీజ్‌కు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మందల విజయభాస్కర్ రెడ్డి.