
సాక్షి, హైదరాబాద్: ‘నా రాజీనామా లేఖ స్పీకర్ వద్దే ఉంది. టీడీఎల్పీ టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం అయ్యాక రాజీనామా లేఖ అప్రస్తుతం’అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి గురించి స్పందించాల్సిన అవసరం తనకు లేదని, ఆయన రాజీనామా లేఖ ఇప్పటివరకు స్పీకర్‌కు రాలేదని తెలిపారు. రాజీనామా లేఖను స్పీకర్‌కే ఇచ్చినట్లు అనవసర ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ చేరికతో కాంగ్రెస్‌లోనే అసలు ఆట మొదలైందని వ్యాఖ్యానించారు. రేవంత్ రాజీనామా స్పీకర్ ఆమోదం పొందితే ఎన్నికలు తప్పవని అన్నారు. సభలో ఓడిపోయేందుకే కాంగ్రెస్ అవిశ్వాసం పెడతానంటోందని, సంఖ్యా బలం లేనప్పుడు అవిశ్వాసం పెట్టడమెందుకని నిలదీశారు. రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణలో కూర్చున్నా జరిగేదేమీ లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment