
కంటోన్మెంట్: మూడేళ్ల విరామం అనంతరం ఆర్మీ ట్రెయినింగ్ క్యాంపులు కళకళాడుతున్నాయి. ఆర్మీలో ఉద్యోగాల నియామకం కోసం ప్రయోగాత్మకంగా చేపట్టిన అగ్నివీర్ పథకంలో భాగంగా తొలి బ్యాచ్‌కు చెందిన అగ్నివీర్‌లు హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్లో రిపోర్టు చేశారు. 30వ తేదీ వరకు మొత్తం 2,500 మంది అగ్నివీర్‌లు రిపోర్టు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
2023 చివరి నాటికి మొత్తం 6,000 మంది అగ్నివీరులు తమ శిక్షణ పూర్తి చేసుకోనున్నారు. శిక్షణ కేంద్రంలో రిపోర్టు చేసిన అగ్నివీర్‌లకు ఆర్మీ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అగ్నివీర్‌ల శిక్షణకు అవసరమైన సకల సదుపాయాలను కల్పిస్తున్నారు. (క్లిక్ చేయండి: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు లేనట్టే!)
Comments
Please login to add a commentAdd a comment