army jobs
-
Hyderabad: అగ్నివీర్లు వచ్చేశారు.. రిపోర్టు చేసిన తొలి బ్యాచ్
కంటోన్మెంట్: మూడేళ్ల విరామం అనంతరం ఆర్మీ ట్రెయినింగ్ క్యాంపులు కళకళాడుతున్నాయి. ఆర్మీలో ఉద్యోగాల నియామకం కోసం ప్రయోగాత్మకంగా చేపట్టిన అగ్నివీర్ పథకంలో భాగంగా తొలి బ్యాచ్‌కు చెందిన అగ్నివీర్లు హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్లో రిపోర్టు చేశారు. 30వ తేదీ వరకు మొత్తం 2,500 మంది అగ్నివీర్లు రిపోర్టు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 చివరి నాటికి మొత్తం 6,000 మంది అగ్నివీరులు తమ శిక్షణ పూర్తి చేసుకోనున్నారు. శిక్షణ కేంద్రంలో రిపోర్టు చేసిన అగ్నివీర్లకు ఆర్మీ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అగ్నివీర్ల శిక్షణకు అవసరమైన సకల సదుపాయాలను కల్పిస్తున్నారు. (క్లిక్ చేయండి: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు లేనట్టే!) -
Secunderabad: 29 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, సికింద్రాబాద్: యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగనుందని ఆర్మీ పీఆర్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ) సెంటర్ ఏబీసీ ట్రాక్‌లో నిర్వహించే ఈ ర్యాలీలో సోల్జర్ టెక్నికల్ (ఏఈ), సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్, అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ (ఓపెన్ కేటగిరీ), సోల్జర్ (సీఎల్కే/ ఎస్కేటీ– ఏఓసీ వార్డు) కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ (ఓపెన్ కేటగిరీ)లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఈ నెల 26న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్ థాపర్ స్టేడియంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వారు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు ఏఓసీ సెంటర్ హెడ్‌క్వార్టర్స్, ఈస్ట్‌మారేడుపల్లి కార్యాలయంలో నేరుగా లేదా, https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇంటర్‌తోనే.. కొలువు + చదువు
ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొని.. ఉన్నత కొలువుతోపాటు చదువు కూడా కొనసాగించాలనుకునే వారికి చక్కటి అవకాశం.. యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ ఎగ్జామినేషన్! ఈ పరీక్షలో ప్రతిభ చూపితే త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో ఉన్నత ఉద్యోగం లభిస్తుంది! 21 లేదా 22ఏళ్ల వయసులోనే.. త్రివిధ దళాల్లో అడుగుపెట్టి.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు!! శిక్షణ సమయంలోనే నెలకు రూ.56వేలకుపైగా అందుకోవచ్చు. తాజాగా ఎన్డీఏ,ఎన్ఏ(2)–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఎన్డీఏ, ఎన్ఏ వివరాలు, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్, శిక్షణ, కెరీర్ స్కోప్‌పై ప్రత్యేక కథనం.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలను సంక్షిప్తంగా ఎన్డీఏ, ఎన్ఏగా పేర్కొంటారు. ఉత్సాహవంతులైన, సాహసవంతులైన యువతను త్రివిధ దళాలకు ఎంపిక చేసే ఉద్దేశంతో యూపీఎస్సీ ఏటా రెండుసార్లు ఎన్డీఏ, ఎన్ఏ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఎన్డీఏ, ఎన్ఏ అకాడమీల్లో శిక్షణ పూర్తయ్యాక ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్ అకాడమీలలో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఒకే సమయంలో కొలువుతోపాటు బీఏ/బీఎస్సీ/బీటెక్ పట్టాను సొంతం చేసుకునేందుకు మార్గం ఎన్డీఏ, ఎన్ఏ పరీక్ష. ► మొత్తం ఖాళీల సంఖ్య: 400 ► నేషనల్ డిఫెన్స్ అకాడెమీ: 370 (ఆర్మీ–208; నేవీ–42; ఎయిర్ ఫోర్స్–120) ► నేవల్ అకాడమీ:10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్:30 ► ఎయిర్ ఫోర్స్ అకాడమీకి కేటాయించిన ఖాళీ ల్లో 28 ఖాళీలను గ్రౌండ్ డ్యూటీ విభాగంలో భర్తీ చేస్తారు. అర్హతలు ► ఆర్మీ వింగ్: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులవ్వాలి. ► ఎయిర్‌ఫోర్స్, నేవీ, నేవల్ అకాడమీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్లతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► వయోపరిమితి: జనవరి 2,2003–జనవరి 1, 2006 మధ్యలో జన్మించి ఉండాలి. రెండంచెల ఎంపిక ప్రక్రియ ► ఎన్డీఏ, ఎన్ఏ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ముందుగా యూపీఎస్సీ.. ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకొని.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరికి తదుపరి దశలో ఎస్ఎస్బీ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్–పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ► ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి. పేపర్ 1–మ్యాథమెటిక్స్–300 మార్కులకు; పేపర్ 2–జనరల్ ఎబిలిటీ టెస్ట్–600 మార్కులకు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 900 మార్కులకు రాత పరీక్ష జరుగుతుంది. ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. ► జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో.. పార్ట్–ఎలో ఇంగ్లిష్ 200 మార్కులకు; పార్ట్–బీలో 400 మార్కులకు జనరల్ నాలెడ్జ్ పరీక్ష ఉంటుంది. ► పేపర్–2 పార్ట్–బిలో మొత్తం ఆరు విభాగాలు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ; కరెంట్ ఈవెంట్స్) నుంచి ప్రశ్నలడుగుతారు. ఫిజిక్స్‌కు 25 శాతం; కెమిస్ట్రీకి 15శాతం, జనరల్ సైన్స్‌కు 10 శాతం, హిస్టరీ,స్వాతంత్య్రోద్యమానికి 20 శాతం, జాగ్రఫీకి 20 శాతం, కరెంట్ ఈవెంట్స్‌కు పది శాతం వెయిటేజీ ఉంది. పేపర్–1, పేపర్–2లలో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారిని తదుపరి దశకు ఎంపిక చేస్తారు. మలి దశ.. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ► ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలో విజయం సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు మలిదశలో 900 మార్కులకు ఎస్ఎస్బీ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ► అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలు, రాత పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా.. ఎస్ఎస్బీ(సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్) నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌లోనూ నెగ్గాల్సి ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్ విభాగాన్ని ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్‌లో కూడా విజయం సాధించాలి. ► ఎస్ఎస్బీ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్ట్, వెర్బల్ టెస్ట్, నాన్ వెర్బల్ లెస్ట్, సామాజిక అంశాలపై ఉన్న అవగాహన, తార్కిక విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షిస్తారు. అదే విధగా పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం అయిదు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్డీఏ, ఎన్ఏలో శిక్షణ ఎన్డీఏ, ఎన్ఏ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లోనూ విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు వారు ఎంచుకున్న విభాగం ఆధారంగా శిక్షణ ఉంటుంది. తొలుత నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. మొదటి రెండున్నర సంవత్సరాలు అన్ని విభాగాల అభ్యర్థులకు ఉమ్మడి శిక్షణ ఉంటుంది. చివరి ఆరు నెలలు అభ్యర్థులు ఎంపికైన విభాగం ఆధారంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇలా మొత్తం మూడేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా జేఎన్‌యూ–ఢిల్లీ.. బీఏ, బీఎస్సీ, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) డిగ్రీలను అందిస్తుంది. ఎయిర్‌ఫోర్స్, నేవల్ విభాగాలను ఎంచుకున్న వారికి బీటెక్ పట్టా లభిస్తుంది. నేవల్ అకాడెమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ ఎన్ఏ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన వారికి నేవల్ అకాడమీ(ఎజిమల)లో నాలుగేళ్లపాటు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఆ తర్వాత వీరికి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్ సర్టిఫికెట్ అందిస్తారు. ఫిజికల్ ట్రైనింగ్ ఎన్డీఏలో మూడేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎంపికైన విభాగంలో మళ్లీ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆర్మీ క్యాడెట్లకు ఐఎంఏ(డెహ్రాడూన్), నేవీ క్యాడెట్స్‌కు నేవల్ అకాడమీ(ఎజిమల), ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లకు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(హైదరాబాద్)లలో ఫీల్డ్ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ సమయంలో రూ.56,100 స్టయిఫండ్‌గా లభిస్తుంది. ఫీల్డ్ ట్రైనింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రూ.56,100–1,77,500 వేతన శ్రేణితో కెరీర్ ప్రారంభం అవుతుంది. ప్రాథమికంగా ఆర్మీ విభాగంలో లెఫ్ట్‌నెంట్, నేవీ విభాగంలో సబ్ లెఫ్ట్‌నెంట్, ఎయిర్‌ఫోర్స్ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్ కేడర్‌తో కెరీర్ ప్రారంభమవుతుంది. రాత పరీక్షలో విజయం ఇలా ► ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు సిలబస్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. ► పూర్తిగా కాన్సెప్ట్ ఆధారితంగా ఉండే పేపర్–1 (మ్యాథమెటిక్స్)లో మంచి మార్కుల కోసం అల్జీబ్రా, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, అనలిటికల్ జామెట్రీ, ఇంటిగ్రల్ కాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయడం మేలు చేస్తుంది. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి. కాబట్టి బేసిక్స్‌పై స్పష్టత, ఫార్ములాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► పేపర్–2 జనరల్ ఎబిలిటీలో రాణించేందుకు బేసిక్ ఇంగ్లిష్, గ్రామర్, వొకాబ్యులరీ రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. ► జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి..ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, చరిత్ర–భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్‌లపై అవగాహన చేసుకోవాలి. పాత ప్రశ్న పత్రాలు, ఆయా విభాగాలకు ఇచ్చిన వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. ► ఫిజిక్స్‌లో ఎలక్ట్రోమాగ్నటిజం, మెకానిక్స్, డైనమిక్స్‌లోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► కెమిస్ట్రీలో కెమికల్ అనాలసిస్,ఇనార్గానిక్ కాంపౌండ్స్, పిరియాడిక్ టేబుల్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఈక్విలిబ్రియమ్, థర్మోడైనమిక్స్, క్వాంటమ్ మెకానిక్స్‌పై ప్రధానంగా దృష్టిసారించాలి. ► జనరల్ సైన్స్‌లో వ్యాధులు–కారకాలు, ప్లాంట్ అనాటమీ, మార్ఫాలజీ, యానిమల్ కింగ్ డమ్లను చదవాలి. ► కరెంట్ అఫైర్స్ కోసం పరీక్ష తేదీకి ముందు ఆరు నెలల వ్యవధిలో జరిగిన సమకాలీన పరిణామాలపై దృష్టి సారించాలి. ► హిస్టరీ విభాగాలకు సంబంధించి.. స్వాతంత్రోద్యమ సంఘటనలు, రాజులు–రాజ్య వంశాలు, చారిత్రక కట్టడాలు, యుద్ధాల సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి. ► జాగ్రఫీ విషయంలో ప్రకృతి వనరులు, విపత్తులు, నదులు, పర్వతాలు, పర్యావరణం వంటి అంశాల్లో పట్టు సాధించడం మేలు చేస్తుంది. ► ఎన్డీఏ రాత పరీక్షలో అడుగుతున్న ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే ఉంటున్నాయి. కాబట్టి ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ:జూన్ 29, 2021 ► ఆన్లైన్ దరఖాస్తు ఉపసంహరణ: జులై 6 నుంచి జులై 12 వరకు ► ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 5, 2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం ► వెబ్సైట్: www.upsc.gov.in -
Army Jobs: 502 ఆర్మీ పోస్టులు, నెలకు రూ.35,400
భారత సైనిక విభాగానికి చెందిన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 502 సూపర్వైజర్(బ్యారక్ స్టోర్), డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి ఎంఈఎస్ నోటిఫికేషన్–2021 విడుదలైంది. మిలిటరీ సర్వీస్‌లో సేవలు అందించాలనుకునే అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న ఖాళీలు, విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం... పోస్టుల సంఖ్య: 502 ఎంఈఎస్–2021 నోటిఫికేషన్ ద్వారా మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 502 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 450 సూపర్వైజర్ పోస్టులు, 52 డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు ► డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ అసిస్టెంట్స్‌షిప్‌లో డిప్లొమా ఉండాలి. దీంతో పాటు ఆటోక్యాడ్, ఆపరేషన్ ఆఫ్ జిరాక్స్, ప్రింటింగ్ అండ్ లామినేషన్ మెషీన్‌పై ఏడాది కాలం అనుభవం అవసరం. ► సూపర్వైజర్ పోస్టులకు ఎకనామిక్స్/కామర్స్/స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ తప్పనిసరి. దీంతోపాటు స్టోర్స్ అండ్ అకౌంట్స్ మెయింటెనెన్స్‌లో ఏడాది అనుభవం తప్పనిసరి.లేదా ఎకనామిక్స్/కామర్స్/ స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్‌తోపాటు మెటీరియల్ మేనేజ్మెంట్/వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్/ పర్చేజ్/లాజిస్టిక్స్/ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో డిప్లొమా,స్టోర్స్ అకౌంట్స్ మెయింటెనెన్స్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. ► రెండు విభాగాల పోస్టులకు అభ్యర్థుల వయసు దరఖాస్తు చేసుకునే నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు. వేతనం ► సూపర్వైజర్, డ్రాఫ్ట్స్మెన్గా ఎంపికైనవారు పే లెవెల్–6 ప్రకారం నెలకు రూ.35,400 – 1,12,400 వరకూ వేతనం అందుతుంది. పరీక్ష విధానం ► పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానం ఉం టుంది. 125 మార్కులకు 100 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. సిలబస్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. ► జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్– 25 ప్రశ్నలు –25 మార్కులు; ► జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లిష్– 25 ప్రశ్నలు–25 మార్కులు; న్యూమరికల్ ఆప్టిట్యూడ్–25 ప్రశ్నలు –25 మార్కులు; ► స్పెషలైజ్డ్ టాపిక్ – 25 ప్రశ్నలు– 50 మార్కులకు ఉంటుంది. ముఖ్యమైన తేదీలు ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ► దరఖాస్తులకు చివరి తేదీ: 12.04.2021 ► రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు ఫీజు లేదు) ► రాత పరీక్ష తేది: 16.05.2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖపట్నం ► వెబ్సైట్: దరఖాస్తు కోసం https://www.mesgovonline.com/mesdmsk/లో ‘న్యూ రిజిస్ట్రేషన్’ లింక్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆర్మీ జాబ్స్.. ఏప్రిల్ 18న ఎన్డీఏ; ఎగ్జామ్ టిప్స్ -
ఆర్మీ జాబ్స్.. ఏప్రిల్ 18న ఎన్డీఏ; ఎగ్జామ్ టిప్స్
దేశ రక్షణ దళాల్లో చేరడం చాలా మంది యువత కల. సైనిక దళాల్లో సవాళ్లతో కూడిన ఉజ్వల కెరీర్‌కు మార్గం.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్ష (ఎన్డీఏ). ఇందులో అర్హత సాధిస్తే.. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఉన్నత స్థాయి హోదాలో పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. దేశ రక్షణ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి హోదాను పొందొచ్చు. సరైన ప్రణాళిక..పట్టుదలతో ఎన్డీఏ పరీక్షకు సన్నద్ధమయితే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. 2021 ఏడాదికి గాను ఎన్డీఏ పరీక్షను ఏప్రిల్ 18న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. పరీక్షకు సన్నద్ధమ్యే అభ్యర్థులకు కోసం ఎగ్జామ్ టిప్స్... ఏటా రెండుసార్లు ► త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నియామకాలు, శిక్షణ ప్రక్రియను చేపట్టడానికి ఎన్డీఏను ఏర్పాటు చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు ఎన్డీఏ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అర్హులైన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. ప్రతిభ చూపిన వారిని శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక.. ఆయా విభాగాల్లో ఉద్యోగాల్లో నియమిస్తారు. రక్షణ దళాల్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఎన్డీఏ సువర్ణావకాశం. ► ఇంటర్/10+2 పూర్తిచేసిన అభ్యర్థులు ఎన్డీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ ఏటా దాదాపు 6 నుంచి 7 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఎన్డీఏ 2021 ప్రకటన వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. 900 మార్కులకు రాత పరీక్ష ఎన్డీఏ పరీక్ష ఏప్రిల్ 18న ఆఫ్‌లైన్‌లో జరుగనుంది. పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఈ ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్– 300 మార్కులు, జనరల్ ఎబిలిటీ–600 మార్కులు (ఇంగ్లిష్, సైన్స్, హ్యుమానిటీస్ అండ్ కరెంట్ అఫైర్స్) పేపర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 2.30 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తారు. రెండు పేపర్లు ఒకే రోజు నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కులో నుంచి 33శాతం కోతగా విధిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. వ్యూహాత్మక ప్రిపరేషన్ ► పరీక్షకు నెల రోజుల సమయమే ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త విషయాల జోలికి వెళ్లకుండా.. ముఖ్యమైన టాపిక్స్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. ► గతంలో నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం.. మాక్ టెస్టులను రాయడం వంటివి చేయాలి. ► మ్యాథమెటిక్స్‌కు సంబంధించి షార్ట్ ట్రిక్స్‌ను ఉపయో గించి ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయాలి. ఇచ్చిన టైమ్‌ను సద్వినియోగం చేసుకునే విధంగా మ్యాథమెటిక్స్ విభాగంపై దృష్టి పెట్టాలి. ► పేపర్–2కు సంబంధించి ఇంగ్లిష్‌లో 40శాతం వెయిటేజీని కవర్ చేసేవిధంగా ప్రిపరేషన్ ఉండాలి. ఇందుకోసం న్యూస్ పేపర్లను చదవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఇంగ్లిష్, వొకాబ్యులరీ మెరుగుపరచుకోవచ్చు. ► పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో కాన్సెప్ట్లపై పట్టు పెంచుకోవాలి. ► జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు సంబంధించి ముఖ్యమైన టాపిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ► కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, భారత్ ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, అవార్డులు, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ► ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన రోజుల (ప్రముఖుల పుట్టిన తేదీలు, ఇతర ప్రాధాన్యత కలిగిన రోజులు)గురించి తెలుసుకోవాలి. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ►ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ ఇంటర్వ్యూ 900 మార్కులకు ఉంటుంది. ఇందులో కూడా స్టేజ్–1,2 అనే రెండు దశలు ఉంటాయి. స్టేజ్–1కు అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే స్టేజ్–2కు అనుమతిస్తారు. ►స్టేజ్–1: ఈ ఇంటర్వ్యూలో ఆఫీసర్ ఇంటలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్), వెర్బల్–నాన్ వెర్బల్ టెస్ట్స్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్(పీపీ అండ్ డీటీ) పరీక్షలు నిర్వహిస్తారు. ►స్టేజ్–2 : ఈ ఇంటర్వ్యూలో గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్, సైకాలజీ టెస్టులు నిర్వహిస్తారు. గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్‌లో జీడీ, జీపీఈ,పీజీటీ, హెచ్జీటీ, ఐఓటీ, కమాండ్ టాస్క్, షేక్ రేస్, ఇండివిడ్యువల్ లెక్చర్, ఎఫ్జీటీ వంటివి ఉంటాయి. ►సైకాలజీ టెస్ట్ : థిమాటిక్ అప్రెషన్ టెస్ట్(టీఏటీ), వర్డ్ అసోసియేషన్ టెస్ట్ (డబ్ల్యూఏటీ), సిచ్యూవేషన్ రియాక్షన్ టెస్ట్(ఎస్ఆర్టీ), సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్(ఎస్డీ) వంటి వాటితోపాటు కాన్ఫరెన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ►పైన పేర్కొన్న రెండు స్టేజ్ల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టులు జరిపి.. మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఆయా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ►ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పరీక్ష. కాబట్టి అభ్యర్థులు దీని కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ► అభ్యర్థుల వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని పరీక్షించే విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు పూర్తి సమాచారంతో ప్రత్యేకంగా సిద్ధం అవ్వాలి. హైదరాబాద్: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో జాబ్స్ -
డిఫెన్స్‌లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ
-
ఆర్మీ ఉద్యోగాల పేరిట మోసం: ఇద్దరి అరెస్ట్
గుంటూరు: ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి చేతులెత్తేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 45 లక్షల నగదుతో పాటు, 26 అప్పు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు వెంకటరమణ కాలనీకి చెందిన షేక్ ఆషిక్ అలీ, మీర్ క్వాజా మొహిద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు నిరుద్యోగులకు ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి 24 మందిని మోసం చేశారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 3.50 లక్షలు తీసుకొని ఒకవేళ ఉద్యోగం రాకపోతే వెంటనే డబ్బు తిరిగి ఇస్తామని నాన్ జ్యుడీషియల్ బాండ్ పై రాసి ఇచ్చారు. వారిలో ఒక్కరికి కూడా ఉద్యోగం రాకపోవడంతో.. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామానికి చెందిన మాదాల గోపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి శుక్రవారం నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు తెలిపారు. -
ఆర్మీ ఉద్యోగాల్లోను నకిలీలు