ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి చేతులెత్తేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్మీ ఉద్యోగాల పేరిట మోసం: ఇద్దరి అరెస్ట్
Published Fri, Mar 17 2017 2:06 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
గుంటూరు: ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి చేతులెత్తేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 45 లక్షల నగదుతో పాటు, 26 అప్పు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు వెంకటరమణ కాలనీకి చెందిన షేక్ ఆషిక్ అలీ, మీర్ క్వాజా మొహిద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు నిరుద్యోగులకు ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి 24 మందిని మోసం చేశారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 3.50 లక్షలు తీసుకొని ఒకవేళ ఉద్యోగం రాకపోతే వెంటనే డబ్బు తిరిగి ఇస్తామని నాన్ జ్యుడీషియల్ బాండ్ పై రాసి ఇచ్చారు.
వారిలో ఒక్కరికి కూడా ఉద్యోగం రాకపోవడంతో.. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామానికి చెందిన మాదాల గోపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి శుక్రవారం నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు తెలిపారు.
Advertisement
Advertisement