Secunderabad: 29 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ | Secunderabad: Indian Army to Hold Recruitment Rally From Nov 29 to Jan 30 | Sakshi
Sakshi News home page

Secunderabad: 29 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Published Tue, Nov 9 2021 2:26 PM | Last Updated on Tue, Nov 9 2021 2:27 PM

Secunderabad: Indian Army to Hold Recruitment Rally From Nov 29 to Jan 30 - Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: యూనిట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కోటా కింద ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కొనసాగనుందని ఆర్మీ పీఆర్‌ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌ (ఏఓసీ) సెంటర్‌ ఏబీసీ ట్రాక్‌లో నిర్వహించే ఈ ర్యాలీలో సోల్జర్‌ టెక్నికల్‌ (ఏఈ), సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్, అవుట్‌ స్టాండింగ్‌ స్పోర్ట్స్‌మెన్‌ (ఓపెన్‌ కేటగిరీ), సోల్జర్‌ (సీఎల్‌కే/ ఎస్‌కేటీ– ఏఓసీ వార్డు) కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అవుట్‌ స్టాండింగ్‌ స్పోర్ట్స్‌మెన్‌ (ఓపెన్‌ కేటగిరీ)లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఈ నెల 26న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌ ఏఓసీ సెంటర్‌ థాపర్‌ స్టేడియంలో రిపోర్ట్‌ చేయాలని సూచించారు. క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వారు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు ఏఓసీ సెంటర్‌ హెడ్‌క్వార్టర్స్, ఈస్ట్‌మారేడుపల్లి కార్యాలయంలో నేరుగా లేదా, https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement