Vidya Nagar
-
డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ!
విద్యానగర్/కరీంనగర్: బొటిక్ రంగం పెరిగిన ఆధునికతతో మగ్గం వర్క్ నుంచి కంప్యూటరైజ్డ్ రంగంలోకి అడుగిడింది. మనకు నచ్చిన డిజైన్లలో బ్లౌజులు, డ్రెస్‌లను కుట్టించుకునే అవకాశం కంప్యూటరైజ్డ్ బొటిక్ ద్వారా మహిళలకు లభించింది. ఫ్యాషన్ డిజైనర్లు మహిళల కలలకు రూపమిస్తూ బొటిక్ ప్రపంచాన్ని కలర్ఫుల్గా మారుస్తున్నారు. అతివల మనసు దోచే బొటిక్లెన్నో రోజురోజుకూ కరీంనగర్లో వెలుస్తూ ఫ్యాషన్మయంగా మార్చేస్తున్నాయి. వైవిధ్యాన్ని కోరుకునేవారికి సృజనాత్మకతను జత చేస్తూ కంప్యూటర్ ద్వారా కొత్త ఫ్యాషన్లు రూపొందిస్తున్నారు. డిజైన్ బట్టి ధరలు కరీంనగర్లో ప్రస్తుతం కంప్యూటర్ బొటిక్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు ధరించడానికి మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. వారు ఎంచుకున్న డిజైన్లను బట్టి బ్లౌజ్‌పై డిజైన్ వేయడానికి రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ తీసుకుంటున్నారు. రోజూ మూడు బ్లౌజ్‌లు.. బొటిక్ కంప్యూటర్ మిషన్స్ రాక ముందు మగ్గం వర్క్ చేసేవారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన బొటిక్ కళాకారులు ఒక్క బ్లౌజ్‌పై మగ్గం వర్క్ చేస్తే వారం పదిరోజులు పట్టేది. ప్రస్తుతం రోజుకు మూడు బ్లౌజ్లకు బొటిక్ వర్క్ చేస్తున్నాను. – కొప్పుల వేణుకుమార్, నవ్యశ్రీ కంప్యూటర్ బొటిక్ వర్క్స్, జ్యోతినగర్, కరీంనగర్ ఫ్యాషన్ డిజైనింగ్‌కు ఆదరణ.. ఫ్యాషన్ డిజైనింగ్‌కు ఆదరణ పెరిగింది. కరీంనగర్‌లోని విద్యానగర్‌లోని శ్రీ వేంకటేశ్వర టెంపుల్ వద్ద 2సంవత్సరాల క్రితమే వసుంధర పేరుతో కంప్యూటరైజ్డ్ బొటిక్ సెంటర్ ఏర్పాటు చేశాను. యువతుల నుంచి పెద్దవారి వరకు బొటిక్ వర్క్ బ్లౌజ్‌లు ధరిస్తున్నారు. కొరియర్ సర్వీస్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా వర్క్ ఆర్డర్స్ వస్తాయి. – శ్వేతారఘురాం, కంప్యూటరైజ్ బొటిక్ వర్క్స్, విద్యానగర్, కరీంనగర్ అభిరుచికి తగ్గట్లు.. బొటిక్ డిజైనింగ్‌లో కంప్యూటర్లు వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పుడు మరింత ఆధునిక కంప్యూటరైజ్డ్ బొటిక్ మిషన్స్ వచ్చాయి. కొరుకున్న డిజైన్‌ను 1గంట నుంచి 8గంటలలోపు సమయం పడుతుంది. – నవ్యశ్రీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్, జ్యోతినగర్, కరీంనగర్ కోరుకున్న డిజైన్లు.. ఎప్పటికీ ఉండే పెళ్లిళ్లు, పేరంటాలకు తోడు ఇప్పుడు స్పెషల్ పార్టీలు కూడా వచ్చి చేరాయి. ఇలాంటి పార్టీల్లో హుందాతనం, హోదా, ప్రత్యేకత ఉట్టిపడేలా డ్రెస్సింగ్ ఉండాలని మహిళలు కోరుకుంటారు. కోరుకున్న డిజైన్‌ను గంట నుంచి 8 గంటలలోపు తయారు చేసి ఇస్తున్నారు. ఇద్దరం కలసి ఏర్పాటు చేశాం మేమిద్దరం స్నేహితులం. ఇద్దరం కలిసి లేడీస్ టైలరింగ్ షాపు నిర్వహించే వాళ్లం. క్రమేణా మంచి ఆదరణ లభించింది. మా కస్టమర్లు చాలా మంది బొటిక్ డిజైనింగ్ వేరే వారి వద్ద చేయించేవారు. వారందరి ప్రోత్సాహంతో ఎంబ్రాయిడరీ బొటిక్ కంప్యూటరైజ్డ్ మిషన్ గత నెలలో తీసుకొచ్చి వర్క్ చేస్తున్నాం. ప్రస్తుతం రోజుకు రూ.1000 వరకు వస్తున్నాయి. – భారతి, శ్వేత, షణ్ముఖి డిజైనర్స్, జ్యోతినగర్, కరీంనగర్ ఒక్కరోజులో కోరుకున్న డిజైన్‌లో బ్లౌజ్.. ఇది వరకు బ్లౌజ్‌పై మగ్గం వర్క్ చేయించుకోవాలటే రెండు, మూడు నెలల సమయం పట్టేది. పండుగకు రెండు నెలల ముందే చీర కొనుక్కొని మ్యాచింగ్ బ్లౌజ్‌పై మగ్గం వర్క్‌కోసం ఇచ్చేదాన్ని, ఇప్పుడు సీజన్ వర్క్‌ను బట్టి వారం ముందు ఇస్తే చాలు బొటిక్ బ్లౌజ్ తయారు అవుతుంది. – తూమ్ అరుణ, గృహిణి, సుభాష్‌నగర్, కరీంనగర్ గ్రాండ్ లుక్ ఉండాలి ఎంతో ఖరీదు పెట్టి పట్టు చీర తీసుకున్న తర్వాత మంచి డిజైన్‌తో బొటిక్ వర్క్ బ్లౌజ్ ఉండాలి. అప్పుడే చీరకు మరింత గ్రాండ్ లుక్ వస్తుంది. తద్వారా మనకూ వస్తుంది. చీర బాగుండి బ్లౌజ్ బాగాలేకుంటే చీరకు ఉన్న అందం పోతుంది. – సింగిరికొండ మాధవి, గృహిణి, తిరుమల నగర్, కరీంనగర్ చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
భర్త ఇంటి ముందు భార్య దీక్ష
విద్యానగర్ (కరీంనగర్) : మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తిరుగుతున్న భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అతని ఇంటి ముందు బైఠాయించిందో మహిళ. ఈ ఘటన కరీంనగర్ జిల్లా విద్యానగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. తనను పట్టించుకోకుండా మరో మహిళతో తిరుగుతూ అన్యాయం చేస్తున్న భర్త చంద్రశేఖర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కవిత అతని ఇంటిముందు దీక్షకు దిగింది. -
గ్రేటర్లో తమ్ముళ్ల ఆగ్రహజ్వాలలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అసమ్మతి నాయకుల ఆగ్రహజాల్వలు పెల్లుబికాయి. ఇప్పటికే రెబల్ అభ్యర్థులతో తలలు పట్టుకుంటున్న పార్టీలకు... నాయకుల ఆగ్రహ ఆవేశాలు గెలుపుపై నీళ్లు చల్లే విధంగా మారనున్నాయి. విద్యానగర్ టికెట్ దక్కకపోవడంతో మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి వర్గీయులు స్థానికంగా ఉన్న టీడీపీ జెండా దిమ్మెను కూల్చివేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున విద్యానగర్ నుంచి చంద్రమౌళి కార్పొరేటర్‌గా గెలిచాడు. పునర్విభజనలో విద్యానగర్ రద్దయింది. దీంతో చంద్రమౌళి నల్లకుంట డివిజన్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే టీడీపీ వనం మాలతి అనే మరో నాయకురాలికి టికెట్ కేటాయించడంతో ఆగ్రహం చెందిన నాయకులు బీభత్సం సృష్టించారు. సిట్టింగ్ కార్పొరేటర్‌కు కాకుండా మరొకరికి ఎలా కేటాయిస్తారంటూ చంద్రమౌళి వర్గీయులు ప్రశ్నించారు. ఇది గ్రేటర్లో ఏ ఒక్క డివిజన్‌కే పరిమితం కాదు.. పలు డివిజన్లలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. -
కుక్కుల దాడిలో గాయపడిన చిన్నారి మృతి
బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి గోపి (6) పది రోజులు మృత్యువుతో పోరాడి అశువులుబాశాడు. ఈ నెల 21న విద్యానగర్ సమీపంలోని శ్రీనగర్‌లో కుక్కల దాడితో తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానిక విమ్స్‌లో చేర్పించారు. అయితే గురువారం బాలుడి పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు తరలించాలని సూచించారు. దీంతో గురువారం రాత్రి 12.30 గంటల సమయంలో బాలుడిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా మృతి చెందాడు. శుక్రవారం వేకువజామున బాలుడి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కౌల్‌బజార్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పురుగుల మందుతాగి అస్వస్థతకు గురైన బాలుడి తల్లి.. కుక్కలదాడిలో గాయపడి కొడుకు మృతిచెందడంతో మనస్తాపం చెందిన బాలుడి తల్లి ఆదిలక్ష్మి మార్చురీ వద్ద పురుగుల మందు తాగి, అస్వస్థకుగురైంది. వెంటనే పక్కనున్న మహిళలు, కాంగ్రెస్ ప్రముఖుడు రవి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విమ్స్ ఐసీయూలో ఆమె చికిత్స పొందుతోంది. అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి భర్త సంజీవ ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆదిలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో బ్రతువు తెరువకోసం బళ్లారిలోని విద్యానగర్ సమీపంలో శ్రీనగర్‌లో ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్తలేకపోవడం, కొడుకు మృతిచెందడంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందుతాగి అస్వస్థకుగురై విమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆదిలక్ష్మిని బళ్లారి కార్పొరేషన్ కమిషనర్ చిక్కన్న పరామర్శించాడు. అనంతరం కమిషనర్ చిక్కన్న విలేకరులతో మాట్లాడుతూ బాలుడి మృతికి జిల్లాసమితి సభ్యులతో చర్చించి ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారాన్ని చెల్లిస్తామని తెలిపారు. ప్రస్తుతం రూ.25వేలు చెల్లించనున్నట్లు చెప్పారు. కుక్కలను చంపడానికి వీలుకాదు. కాకపోతే కుక్కల సంతానం అభివృద్ది చెందకుండా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. బళ్లారి నగరంలో సుమారు 8వేల వీధి కుక్కలు ఉన్నాయని, శస్త్రచికిత్సకు ఒక్కోకుక్కకు రూ. 650లు ఖర్చు అవుతుందని తెలిపారు. -
ఎరుపెక్కిన విద్యావనం
ఓయూలో పీడీఎస్‌యూ మహాసభలు ప్రారంభం హైదరాబాద్, న్యూస్‌లైన్: సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) అనుబంధ విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ 19వ రాష్ట్ర మహాసభలు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలుత విద్యానగర్‌లోని ఎస్వీఎస్ కళాశాల మైదానంలో పీడీఎస్‌యూ వ్యవస్థాపకులు జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్‌ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, రంగవల్లి, చేరాలు, స్నేహలత తదితర అమరులకు జోహార్లు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులతో ఓయూ ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి జేఎల్ గౌతంప్రసాద్, నగర అధ్యక్షురాలు సత్య, ఓయూ అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.