బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి గోపి (6) పది రోజులు మృత్యువుతో పోరాడి అశువులుబాశాడు. ఈ నెల 21న విద్యానగర్ సమీపంలోని శ్రీనగర్‌లో కుక్కల దాడితో తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానిక విమ్స్‌లో చేర్పించారు. అయితే గురువారం బాలుడి పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు తరలించాలని సూచించారు. దీంతో గురువారం రాత్రి 12.30 గంటల సమయంలో బాలుడిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా మృతి చెందాడు. శుక్రవారం వేకువజామున బాలుడి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కౌల్‌బజార్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందుతాగి అస్వస్థతకు గురైన బాలుడి తల్లి..
కుక్కలదాడిలో గాయపడి కొడుకు మృతిచెందడంతో మనస్తాపం చెందిన బాలుడి తల్లి ఆదిలక్ష్మి మార్చురీ వద్ద పురుగుల మందు తాగి, అస్వస్థకుగురైంది. వెంటనే పక్కనున్న మహిళలు, కాంగ్రెస్ ప్రముఖుడు రవి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విమ్స్ ఐసీయూలో ఆమె చికిత్స పొందుతోంది. అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి భర్త సంజీవ ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు.
దీంతో ఆదిలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో బ్రతువు తెరువకోసం బళ్లారిలోని విద్యానగర్ సమీపంలో శ్రీనగర్‌లో ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్తలేకపోవడం, కొడుకు మృతిచెందడంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందుతాగి అస్వస్థకుగురై విమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆదిలక్ష్మిని బళ్లారి కార్పొరేషన్ కమిషనర్ చిక్కన్న పరామర్శించాడు.
అనంతరం కమిషనర్ చిక్కన్న విలేకరులతో మాట్లాడుతూ బాలుడి మృతికి జిల్లాసమితి సభ్యులతో చర్చించి ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారాన్ని చెల్లిస్తామని తెలిపారు. ప్రస్తుతం రూ.25వేలు చెల్లించనున్నట్లు చెప్పారు. కుక్కలను చంపడానికి వీలుకాదు. కాకపోతే కుక్కల సంతానం అభివృద్ది చెందకుండా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. బళ్లారి నగరంలో సుమారు 8వేల వీధి కుక్కలు ఉన్నాయని, శస్త్రచికిత్సకు ఒక్కోకుక్కకు రూ. 650లు ఖర్చు అవుతుందని తెలిపారు.
కుక్కుల దాడిలో గాయపడిన చిన్నారి మృతి
Published Sat, Feb 1 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement