హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అసమ్మతి నాయకుల ఆగ్రహజాల్వలు పెల్లుబికాయి. ఇప్పటికే రెబల్ అభ్యర్థులతో తలలు పట్టుకుంటున్న పార్టీలకు... నాయకుల ఆగ్రహ ఆవేశాలు గెలుపుపై నీళ్లు చల్లే విధంగా మారనున్నాయి.
విద్యానగర్ టికెట్ దక్కకపోవడంతో మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి వర్గీయులు స్థానికంగా ఉన్న టీడీపీ జెండా దిమ్మెను కూల్చివేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున విద్యానగర్ నుంచి చంద్రమౌళి కార్పొరేటర్‌గా గెలిచాడు. పునర్విభజనలో విద్యానగర్ రద్దయింది. దీంతో చంద్రమౌళి నల్లకుంట డివిజన్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే టీడీపీ వనం మాలతి అనే మరో నాయకురాలికి టికెట్ కేటాయించడంతో ఆగ్రహం చెందిన నాయకులు బీభత్సం సృష్టించారు. సిట్టింగ్ కార్పొరేటర్‌కు కాకుండా మరొకరికి ఎలా కేటాయిస్తారంటూ చంద్రమౌళి వర్గీయులు ప్రశ్నించారు. ఇది గ్రేటర్లో ఏ ఒక్క డివిజన్కే పరిమితం కాదు.. పలు డివిజన్లలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.