damaged
-
ఎడమ కాలువకు ఎన్ని తూట్లో..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం చెరువు వద్ద దాదాపు 100 మీటర్ల పొడవున నాగార్జునసాగర్ ఎడమ కాలువ దెబ్బతింది. అందులో సగం వరకు కట్ట కోతకు గురైంది. భారీగా ప్రవాహం వస్తే ఎప్పుడు కట్ట తెగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ముప్పారం 30/2వ కిలోమీటర్ వద్ద 50 మీటర్ల వరకు ఎడమ కాలువ లైనింగ్ పోయి ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు తెగిపోతుందో తెలియదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితారామచంద్రపురం వద్ద కుంగిపోయిన వెంపలబోడు తూము. అధిక ప్రవాహం వస్తే ఎప్పుడు తూము తెగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ దుస్థితికి ఇవి కేవలం మూడు ఉదాహరణలు మాత్రమే. నల్లగొండ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లా వరకు 172 కిలోమీటర్ల పొడవున అనేక చోట్ల ఇలాంటి ప్రమాదకర పరిస్థితులే నెలకొన్నాయి. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. 2022లో నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద ఎడమ కాలువకు గండిపడటంతో వందల ఎకరాల్లో పంటలు పాడైపోయి రైతులు నష్టాలపాలయ్యారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు 25 రోజులపాటు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పంటలకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. నిర్లక్ష్యం కారణంగానే మళ్లీ గండ్లు ఎడమ కాలువకు నిడమనూరు వద్ద గండి పడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే గండిపూడ్చి వదిలేసింది. నీటిపారుదల శాఖ కాలువ పొడవునా లైనింగ్ దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలని రూ.44 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదు. 2009లో ప్రపంచ బ్యాంకు ని«ధులు రూ.4,444 కోట్లతో ఎడమ, కుడి కాలువల ఆధునీకరణ (లైనింగ్, మరమ్మతులు) పనులు చేపట్టారు. అందులో ఎడమ కాలువ పనులను చేపట్టినా చాలావరకు పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో అవి మరింతగా దెబ్బతిన్నాయి.ఈనెల 1వ తేదీన నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రంగులవంతెన వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పాలేరు వెనుక జలాల కారణంగా గండ్లు పడ్డాయి. రెండు చోట్ల 50 నుంచి 70 మీటర్ల పొడవునా కాలువ కట్ట కొట్టుకుపోయింది. పాలేరు వాగు నీటితోపాటు ఈ కాలువ నీరు కలిసి నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, వల్లాపురం, అనంతగిరి మండలం చనుపల్లి, పాలారం, కిష్టాపురం, కొత్తగూడెం, గోండ్రియాల, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మందడి నర్సయ్యగూడెం, చీతిలితండా, రాజపేట, ఈశ్వరమాదారం గ్రామాలను నీరు ముంచెత్తింది. వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొంచి ఉన్న ప్రమాదం ఎడమ కాలువ పొడవునా పలుచోట్ల లైనింగ్, కోతకు గురైన కాలువ కట్టలతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యాద్గార్పల్లి మేజర్ పరిధిలోని మిర్యాలగూడ మండలం ఐలాపురం, వేములపల్లి మండలంలోని అన్నపరెడ్డిగూడెం మధ్య దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవునా లైనింగ్ దెబ్బతింది. నడిగూడెం మండలం రామాపురం, చాకిరాల, సిరిపురం, కాగితరామచంద్రాపురం గ్రామాల సమీపాన కాలువ కట్టలు దెబ్బతిన్నాయి.నిడమనూరు మండలంలోని 32/2 వద్ద కాల్వ కరకట్ట లైనింగ్ పూర్తిగా తొలగిపోయి మట్టి పూర్తిగా కాల్వలోకి జారి ప్రమాదకరంగా మారింది. ముప్పారం బ్రిడ్జి వెంట లైనింగ్ పూర్తిగా ధ్వంసమై కట్ట బలహీనంగా మారింది. 30/4 కిలో మీటర్ వద్ద కాల్వ లైనింగ్ పూర్తిగా ధ్వంసమైంది. 29/6 కిలోమీటర్ వద్ద గుంటికగూడెం మేజర్ కాల్వ తూముకు ఇరువైపులా కాల్వ కట్ట లైనింగ్ పాడైపోయింది. ముకుందాపురం–దుగ్గెపల్లి బ్రిడ్జి వెంట లైనింగ్ పూర్తిగా దెబ్బతింది. గరిడేపల్లి మండలం వెలిదండ సమీపంలో ఎడమ కాలువ కట్ట దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో కాలువ నీటిని వాగులు, చెరువుల్లోకి మళ్లించే ఎస్కేప్ కెనాల్స్ (నీటిని మళ్లించేవి)ను పట్టించుకోకపోవడం, పైగా వాటిని ఓపెన్ చేయరాకుండా వెల్డింగ్ చేసి పెట్టడంతో గండ్లు పడుతున్నాయి. -
Afghanistan Floods: అఫ్ఘాన్ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)
-
పారిపోను.. సాయం చేస్తా
శత్రు దేశాలు, ఉగ్రమూకలు, తీవ్రవాదులు విరుచుకుపడినప్పుడు ఎంత శక్తిమంతమైన దేశమైనా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఆ మధ్యన అప్ఘానిస్థాన్ పరిస్థితి ఇలానే ఉండేది. అది మర్చిపోయే లోపు ఉక్రేయిన్ రష్యా యుద్ధం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. అప్ఘానిస్థాన్, ఉక్రెయిన్లలో ఏర్పడిన పరిస్థితులకు భయపడిపోయిన చాలామంది ప్రజలు ప్రాణాలు అరచేత బట్టి దేశం విడిచి పారిపోయారు. ఇక ఆయా దేశాల్లో ఉన్న విదేశీయులు ముందుగానే పెట్టే బేడా సర్దుకుని తమ తమ దేశాలకు పరుగెత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అయినా అక్కడ నివసిస్తోన్న 41 ఏళ్ల ప్రమీలా ప్రభు మాత్రం ‘‘నేను ఇండియా రాను. ఇక్కడే ఉండి సేవలందిస్తాను’’ అని ధైర్యంగా చెబుతోంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా.. హెర్గాలో పుట్టి పెరిగింది ప్రమీలా ప్రభు. మైసూర్లో చదువుకుంది. చదువు పూర్తయ్యాక ఉడిపిలోని మణిపాల్ ఆసుపత్రిలో నర్స్‌గా చేరింది. కొన్నాళ్లు ఇక్కడ పనిచేశాక, ఇజ్రాయేల్‌లో మంచి జీతంతో ఉద్యోగం దొరకడంతో.. తన ఇద్దరు పిల్లలతో ఇజ్రాయెల్‌కు వెళ్లింది. గత ఆరేళ్లుగా అక్కడే ఉంటోన్న ప్రమీలా ఆ దేశం మీద అక్కడి ప్రజల మీద మమకారం పెంచుకుంది. అందుకే పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ ... ‘‘ఇండియా నాకు జన్మనిస్తే.. ఇజ్రాయెల్ జీవితాన్నిచ్చింది. ఇలాంటి కష్టసమయంలో దేశాన్ని వదిలి రాను. నేను చేయగలిగిన సాయం చేస్తాను’’ అని కరాఖండిగా చెబుతూ అక్కడి పరిస్థితులను ఇలా వివరించింది.... నేను టెల్ అవీవ్ యాఫోలో నివసిస్తున్నాను. అక్టోబర్ 7తేదీన∙రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో భోజనం చేశాము. అప్పుడు ఎమర్జెన్సీ సైరన్ వినిపించింది. వెంటనే మేమంతా బంకర్లోకి వెళ్లిపోయాము. దాదాపు రాత్రంతా సైరన్ వినిపిస్తూనే ఉంది. నేను ఇజ్రాయెల్ వచ్చాక ఇంతపెద్ద హింసను ఎప్పుడూ చూడలేదు. మా ఇంటికి కిలోమీటర్ దూరంలో బాంబులు పడుతున్నాయి. పెద్దపెద్ద శబ్దాలు ఒక్కసారిగా భయపెట్టేశాయి. ఇక్కడ ప్రతి ఇంటికి బంకర్లు ఉన్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంకర్లు కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా వీటిలోకి వెళ్లి తలదాచుకోవచ్చు. సైరన్ మోగిన వెంటనే కనీసం ముప్ఫైసెకన్లపాటు బాంబుల శబ్దాలు వినపడుతున్నాయి. దశాబ్దకాలంగా ఇజ్రాయెల్‌పై తీవ్రవాద సంస్థ హమాస్ దాడులకు తెగబడుతూనే ఉంది. హమాస్ వల్ల గాజా కూడా దాడులతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఇప్పటికే వెయ్యిమందికిపైగా చనిపోయారు. ఇక్కడి ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. టెల్ అవీవ్‌లో షాపులు అన్నీ మూసేసారు. వీధుల్లో అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. అందరూ కిరాణా సామాన్లు తెచ్చుకుని నిల్వ చేసుకుంటున్నారు. అరగంట లోపలే... మా చెల్లి ప్రవీణ జెరుసలేంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నేను టెల్ అవీవ్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. ఈ అపార్ట్మెంట్లో ముఫ్పైమంది వరకు ఉన్నారు. మేమంతా అత్యవసరమైన ఆహారం, నీళ్లు, టార్చ్‌లైట్ వంటివాటిని దగ్గర ఉంచుకుని బేస్మెంట్ తలుపులు లె రుచుకుని ...సైరన్ రాగానే బంకర్లోకి పరుగెడుతున్నాం. సైరన్ ఆగినప్పుడు బంకర్ల నుంచి బయటకు వస్తున్నాం. బంకర్లోకి వెళ్లిన ప్రతిసారి అరగంట పాటు లోపలే ఉండాల్సి వస్తోంది. ఊహకందని దాడి ఇజ్రాయెల్‌మీద పాలస్తీనా దాడులు చేయడం ఇది కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు జరిగిన దాడి అస్సలు ఊహించలేదు. ఊహకందని వికృతదాడికి హమాస్ సంస్థ పాల్పడింది. దక్షిణ ఇజ్రాయెల్‌లో శాంతికోసం ఏర్పాటు చేసిన ‘మ్యూజిక్ ఫెస్టివల్’ను ఇలా అశాంతిగా మారుస్తారని అసలు ఊహించలేదు. ఆ ఫెస్టివల్ గురించి అత్యంత బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ ఎప్పుడూ.. యుద్ధానికి అన్నిరకాలా సన్నద్ధమై ఉండి, రక్షణాత్మక చర్యలను పర్యవేక్షిస్తుంటుంది. లేదంటే మరింతమంది హమాస్ దాడుల్లోప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు రాలేను.. ఇజ్రాయెల్ నాకు జీవితాన్నిచ్చింది. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నా మాతృదేశం వచ్చి సంతోషంగా ఉండలేను. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతిస్తే నా సేవలు అందించడానికి సిద్ధ్దంగా ఉన్నాను. ఉడిపిలో ఉన్న మా కుటుంబ సభ్యులు పదేపదే ఫోన్ చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నానా... లేదా... అని కంగారు పడుతున్నారు. ఇక నా పిల్లలు ఇండియా వెళ్లిపోయారు. వారిని విడిచి ఇక్కడ ఉన్నాను. వాళ్లంతా గుర్తొస్తున్నారు. అయినా ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి పారిపోవాలనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇండియా తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను’’ అని చెబుతూ ఎంతోమంది స్ఫూర్తిగా నిలుస్తోంది ప్రమీలా ప్రభు. -
చిరిగిన కరెన్సీ నోట్లను ఫ్రీగా మార్చుకోవడం ఎలా? ఆర్బీఐ రూల్స్ ఇలా..
సాధారణంగా మనం అప్పుడప్పుడు చిరిగిపోయిన లేదా పాడైపోయిన కరెన్సీ నోట్లను చూస్తూ ఉంటాము. ఇలాంటి వాటిని ఎక్కడా తీసుకోవడానికి అంగీకరించరు, కానీ కొంతమంది కొంత కమీషన్‌తో తీసుకోవడానికి ఒప్పుకుంటారు. కానీ ఎలాంటి కమీషన్ ఇవ్వకుండా బ్యాంకుల ద్వారా సులభంగా మార్చుకోవచ్చనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. చిరిగిన నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫారమ్ ఫిల్ చేయకుండానే మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి 20 చిరిగిన నోట్లను మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా రూ. 5000 మించి ఉండకూడదు. ఒక పరిమితిలో (తక్కువ డ్యామేజ్) పాడైన నోట్లకు ఆ విలువకు సమానమైన డబ్బు లభిస్తుంది. డ్యామేజ్ ఎక్కువగా జరిగిన నోట్లకు పర్సంటేజ్ ఆధారంగా తిరిగి చెల్లిస్తుంది. ఒకవేళా మీ దగ్గర చిరిగిన నోట్లు ఎక్కువగా ఉంటే బ్యాంకు వెంటనే మార్పిడి చేయదు, మొదట ఆ నోట్లను స్వీకరించి.. తరువాత మీ ఖాతాలో జమ చేస్తుంది. ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు! ఇవి తప్పనిసరి.. చిరిగిన కరెన్సీ నోట్ల మీద సీరియల్ నెంబర్, మహాత్మా గాంధీ మార్క్, గవర్నర్ సంతకం వంటి గుర్తులు ఉంటే వాటిని బ్యాంకులు మార్చడానికి అంగీకరిస్తాయి. ఎక్కడైతే మీ దగ్గరున్న చిరిగిన నోట్లను మార్చాలనుకుంటారో అక్కడ ఖచ్చితంగా అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కువగా చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకోవాలంటే దానికి సమానమైన మొత్తం లభించకపోవచ్చు. ఉదాహరణకు సుమారు 78 చదరపు సెం.మీ బాగున్న రూ. 500 నోటుకు దానికి సమానమైన డబ్బు ఇస్తారు. ఒకవేళా 39 చదరపు సెం.మీ పాడైపోయి ఉంటే దానికి కేవలం సగం డబ్బు లభిస్తుంది. ఇదే నియమం ఇతర నోట్లకు కూడా వర్తిస్తుంది. అయితే ఉద్దేశ్యపూర్వకంగా కట్ చేసిన నోట్లను బ్యాంక్ తీసుకునే అవకాశం ఉండదు. దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
ఆ పురాతన గోడ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
పురాతన వస్తువులను వేలం పాటల్లో అత్యధిక ధరలకు కొనుగోలు చేయడం మామూలే ! కానీ, ఒక సాధారణమైన గోడ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయి వార్తలకెక్కింది. వాషింగ్టన్ డీసీలోని ఈ గోడ యజమాని పేరు అలెన్ బర్గ్. ఒకసారి ఈ గోడ పక్కన ఉన్న ఇంటికి నీరు లీక్ అవుతున్నట్లు ఆ ఇంటి యజమాని గమనించాడు. దక్షిణంవైపు గోడకు సరైన నిర్వహణ లేకపోవడం వల్ల దూలాలు తడిసి శిథిలావస్థకు చేరుకున్నాయని ఇంజినీర్ చెప్పడంతో, ఆ యజమాని అలెన్‌ను తన గోడ భాగాన్ని సరిచేయాలని కోరాడు. అతడు అందుకు నిరాకరించడమే కాకుండా, ఆ యజమానితో గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో ఆ ఇంటి యజమాని సమస్య పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అలెన్‌కు కోటిన్నర రూపాయలు జరిమానా విధించింది. దీంతో ఇప్పుడు అలెన్ తనకున్న ఆ ఒక్క ఆస్తి, ఈ గోడను రూ.నలభై లక్షలకు అమ్మకానికి పెట్టాడు. దాదాపు నాలుగేళ్ల పాటు ఎవరూ కొనక పోవడంతో, తన ఇంటిని కాపాడుకోవడం కోసం ఆ పొరుగింటి యజమానే దీనిని కొన్నాడు. ఏది ఏమైనా ఆలెన్‌కు వాళ్ల తాత ఇచ్చిన ఆ ఒక్క గోడ అతన్ని కోటీశ్వరుడుని చేసింది. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
కష్టాల కడలిలో ‘గోదావరి’ రైతులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంత రైతులను నిండా ముంచాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరిపైర్లు వరదల తీవ్రతకు కొట్టుకుపోవడంతోపాటు పొలాలు కోతకు గురై ఇసుక మేటలు వేశాయి. చాలాచోట్ల పొలాల్లోనే విద్యుత్ తీగలు, స్తంభాలు పడిపోగా ట్రాన్స్ఫార్మర్లు వరదలో మునిగాయి. సుమారు లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతినగా ఇసుక మేటలు తొలగించలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వరదలకు ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో 22 మంది గల్లంతవగా ఇంకా ముగ్గురి ఆచూకీ లభించలేదు. తేలని నష్టపరిహారం లెక్కలు... వరదల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించినా ఆ ప్రకియ ఇంకా కార్యరూపం దాల్చలేదు. కేంద్ర, రాష్ట్ర బృందాలు ఐదు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించినా అధికారికంగా నష్టాలను తేల్చలేదు. పంట నష్టం 33 శాతంపైన ఉంటేనే వరద నష్టం అంచనా వేస్తామని మండలస్థాయి అధికారులు చెబుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. దీంతో నాట్ల దశలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వర్తించదన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా సుమారు రూ. 2,400 కోట్ల మేర నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా కాగా.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనే రూ. 1,000 కోట్లపైన నష్టం ఉంటుందని చెబుతున్నారు. ఇంత నష్టం జరిగినా అధికారులు మార్గదర్శకాలతో మల్లగుల్లాలు పడుతుండగా ఏం చేయాలో తెలియక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయినోళ్ల కోసం కళ్లలో వత్తులు వేసుకొని... బండ్ల సారయ్య–సారమ్మ... సారయ్య తల్లి రాజమ్మ... ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూరుగుపేటకు చెందిన ఈ ముగ్గురిని వరద మింగేసింది. జూలై 27న కురిసిన అతిభారీ వర్షంతో మారేడుగొండ చెరువుకు గండిపడి వరద ప్రవాహానికి సారయ్య ఇల్లు కొట్టుకుపోయింది. ఇంట్లో ఉన్న సారయ్య, సారమ్మ, రాజమ్మ గల్లంతయ్యారు. వారికి కొంతదూరంలో నివసించే సారయ్య కొడుకు, కోడలు ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వరద తగ్గాక సారయ్య మృతదేహం లభించినప్పటికీ అత్తా కోడళ్లయిన రాజమ్మ, సారమ్మల ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. వరదలతో ఆగమయ్యాం.. నాలుగు ఎకరాల్లో ఇసుకమేటలు వేసినా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా మా ముఖం చూడలేదు. వరదలతో ఆగమయ్యాం. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. – కొక్కిరాల తిరుపతిరావు, రైతు, పరకాల ఈ ఫొటోలోని యువరైతు పేరు కూతురు భూపాల్‌రెడ్డి. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఈయనకు చలివాగు వంతెన సమీపంలో 2.26 ఎకరాల పొలం ఉంది. ఈసారి సన్నరకం నారు అలికి సాగుకు సిద్ధపడుతున్న సమయంలో చలివాగు ప్రవాహానికి కొట్టుకుపోయి పొలమంతా ఇసుకమేటలు వేసింది. దీంతో రూ. లక్ష నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నాడు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన ఈ రైతు పేరు శ్రీపతి తిరుపతి. రెండెకరాల సాగుభూమిలో భారీగా ఇసుక మేటలు వేసింది. ఇసుక మేటను తీయాలంటే కనీసం రూ. 20 వేల ఆదనపు ఖర్చయ్యేలా ఉంది. తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేనందున పంట వదిలేయడం తప్ప వేరే మార్గం లేదంటున్నాడు. ఈయన పేరు చల్ల రవీందర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన రైతు. మానేరు వరద ఉధృతికి ఆయన మూడెకరాల పొలంలో పూర్తిగా ఇసుక మేటలు వేసింది. ఇప్పటికే పొలం దున్నడానికి రూ.10 వేల వరకు ఖర్చు చేశాడు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు. -
వర్షాలు, వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు ‘గృహలక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా ధ్వంసమైన 419 ఇళ్లకు గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న 7,505 ఇళ్లకు తగిన విధంగా పరిహారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు–భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గురువారం శాసనమండలిలో ‘భారీ వర్షాల పర్యవసానాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యల’పై నిర్వహించిన లఘు చర్చకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. వరదల సమయంలో ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఆదుకోకున్నా.. 2020లో, తర్వాత రాష్ట్రం వరదలతో నష్టపోతే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదని.. అయినా సీఎం కేసీఆర్ ధైర్యం కోల్పో కుండా పకడ్బందీగా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారని వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇళ్లు నీట మునిగిన వారికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర సర్కారే ఆర్థిక సాయం చేసిందని చెప్పారు. గతంలో భారీ వర్షాలకు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లితే.. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల ఆర్థిక సా యాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. అందులో ఇప్పటివరకు రూ.150 కోట్లు చెల్లించిందని, త్వరలోనే మిగతా రూ.300 కోట్ల ను చెల్లించనున్నామని తెలిపారు. ప్రస్తుత వరదల నేపథ్యంలోనూ సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసానిచ్చేలా రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతర సమీక్ష తెలంగాణలో ఎన్నడూ లేనంత భారీ వర్షా లు నమోదయ్యాయని, ఈ వానలు, వరదలపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షించార ని వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో అర్ధరాత్రి దాకా గంటలకొద్దీ సమీక్షలు, ప్రాజెక్టుల వారీగా పరిశీలనలతో ఆస్తి, ప్రాణనష్టం తగ్గించగలిగామని వివరించా రు. వరద ప్రాంతాలకు సీఎం రాలేదన్న వి మర్శలు సరికాదని.. సీఎం కేసీఆర్ ఫొటోల కవరేజీ కోసం ఫోజులిచ్చే నాయకుడు కాద ని, ఆయన ప్రజల కోసం పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక బృందాలను పురమాయించి. మంత్రులు, కలెక్టర్లు, అధికారులను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నం చేయడంలో కేసీఆర్ కీలకపాత్ర పోషించారని చెప్పారు. వరదలతో కోతకు గురైన భూములపై సర్వే చేయాలని ఆదేశించారని తెలిపారు. నష్టంపై పూర్తి అంచనాలు అందాక ఆర్థిక సాయంపై సీఎం తగిన నిర్ణయం ప్రకటిస్తారని వివరించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన మిషన్ కాకతీయ పనులతో చెరువుల అలుగులు పటిష్టమై, కాలువల కట్టలు బలపడటంతో ఎక్కువ నష్టం జరగలేదని పేర్కొన్నారు. వరదలు, వానల నష్టం ఇదీ.. రాష్ట్రంలో వరంగల్ కార్పొరేషన్, నిర్మల్, పరకాల, కోరుట్ల, భూపాలపల్లి, జమ్మి కుంట, ఖమ్మం కార్పొరేషన్, మహబూ బాబాద్, భైంసా, నిజామాబాద్ కార్పొరేషన్, పెద్దపల్లి, నర్సంపేటలలో అధిక నష్టం సంభవించిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసన మండలిలో చెప్పారు. 141 పురపాలికల్లో ముందస్తు, సహాయ చర్యలు చేపట్టామని, తాత్కాలిక మరమ్మతులకు రూ.76 కోట్లు అవసరమని అంచనా వేశామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాల శాశ్వత పునరుద్ధరణకు మొత్తం రూ.304 కోట్లు, యూఎల్బీల పునరుద్ధరణ పనులకు రూ.380 కోట్లు అవసరమన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.255.66 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, అవి మంజూరు దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. సహాయ చర్యల్లో భాగంగా 1,500 మందిని కాపాడామని మంత్రి చెప్పారు. 139 గ్రామాలకు చెందిన 27,062 మందికి 157 సహాయ శిబిరాల్లో ఆశ్రయం కలి్పంచామని.. తాగునీరు, ఆహారం, దుప్పట్లు, మందులు సరఫరా చేశామని వివరించారు. ములుగు జిల్లా కొండాయి గ్రామానికి హెలికాప్టర్ ద్వారా ఆహారం, మందులు పంపామన్నారు. 64 గ్రామాలు/ప్రదేశాలలో నీటిపైపులు దెబ్బతిని.. 1,199 జనావాసాలు 25,418 కుటుంబాలపై ప్రభావం పడగా.. వందశాతం తాగునీటి పునరుద్ధరణ జరిగిందని చెప్పారు. 773 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. 769 గ్రామాల్లో పునరుద్ధరించామని మంత్రి తెలిపారు. 23,075 స్తంభాలు, 3,405 డీటీఆర్లు దెబ్బతిని దాదాపు రూ.62.98 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. -
ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే..
తెలుగుదేశం పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చాయి.. ఎంతగా పాకులాడవలసి వస్తోంది? అయినా పరువు పోతోందే. తాజాగా ఎన్డీయేలోకి టీడీపీ అంటూ వచ్చిన వార్తలు ఆ పార్టీ ప్రతిష్టను మరింతగా దెబ్బతీశాయి. ఈ నెల పందొమ్మిదిన ఢిల్లీలో జరగబోయే నేషనల్ డెమొక్రాటిక్ అలియన్స్(ఎన్.డి.ఎ) సమావేశానికి తెలుగుదేశం పార్టీని కూడా ఆ ఆహ్వానించారని మీడియాలో వార్తలు వచ్చాయి. నిజంగా జాతీయ మీడియా ఊహాగానం చేసిందా? లేక తెలుగుదేశం వారెవరైనా ఇచ్చిన లీక్ ఆధారంగా కథనాలు ఇచ్చారో కాని, మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పపోతున్నారన్నంతగా ప్రచారం జరిగింది. తెలుగుదేశం మీడియా కూడా పోటీపడి ప్రచారం చేస్తూ, ఎన్డీయేలో చేరడమా? వద్దా అన్న దానిపై టీడీపీ ఆలోచన చేస్తోందని ముక్తాయింపు ఇచ్చారు. తీరా చూస్తే అసలు టీడీపీని ఎన్డీయే సమావేశానికి ఆహ్వానించనే లేదట. స్వయంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పివి మాధవ్ ఈ విషయాన్ని వెల్లడించడంతో టీడీపీ కుడితిలో పడినట్లయింది. 2017లో ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఉపసంహరించడమే కాకుండా ఎన్డీయేకి దూరం అయినట్లు ప్రకటించారు. అక్కడితో ఆగలేదు. బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టి ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి హడావుడి చేశారు. పశ్చిమ బెంగాల్ వెళ్లి ముఖ్యమంత్రి మమత బెనర్జీకి సంఘీభావం ప్రకటించి వచ్చారు. తదనంతరం కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. రాహుల్ గాంధీని తానే చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ పక్షాలతో కలిసి పోటీ చేసి దారుణ పరాజయాన్ని చవి చూశారు. ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి ఒంటరిగా పోటీ చేసి అధికారం కోల్పోయారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని ఉద్దేశించి తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరికి మోదీ వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు చేశారు. మోదీ ఏపీకి వస్తే నల్ల బెలూన్లు ఎగురవేయించారు. చదవండి: బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..! మోదీ వల్ల దేశం నాశనం అవుతోందని అనేవారు. అమిత్ షా తిరుపతి వస్తే టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. కాని 2019లో ఓటమి తర్వాత చంద్రబాబు మళ్లీ ప్లేట్ ఫిరాయించారు. తన ఎంపీలను బీజేపీలోకి పంపించారు. మెల్లగా బీజేపీ పెద్దలను కాకా పట్టడం ఆరంభించారు. మోదీ గొప్ప నేత అని చెప్పసాగారు. బీజేపీ వారు పట్టించుకోలేదు. అయినా పట్టు వదలకుండా, ఎలాగైతే అమిత్ షా అప్పాయింట్మెంట్ సంపాదించారు. ఈలోగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అవుతున్నాయని తనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియాలో పలుమార్లు ప్రచారం చేయించారు. అమిత్ షాతో భేటీ అవడం మొత్తం మీద ఏదో జరుగుతోందేమోనన్న భావన కలిగింది. కాని ఆ భేటీ తర్వాత చంద్రబాబు నోరు విప్పకపోవడం అందరిని ఆశ్చర్యపరచింది. అయినా టీడీపీ తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలపడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కేంద్ర బీజేపీ పెద్దలు వాస్తవ పరిస్థితిని గమనంలోకి తీసుకున్నారేమో తెలియదు కాని, ఏపీలో టీడీపీతో కలవడానికి భవిష్యత్తులో ఏమి చేస్తారో కాని, ప్రస్తుతానికి సిద్దపడడం లేదు. అక్కడికి తెలంగాణలో ఉపయోగపడతామని కూడా కబురంపారు. కాని చంద్రబాబు ట్రాక్ రికార్డు చూసిన బీజేపీ ఆయనను నమ్మడం లేదు. ఈ దశలో మళ్లీ ఎన్డీయే సమావేశానికి టీడీపీ, అకాలీదళ్, జెడిఎస్‌లను పిలిచారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ సోషల్ మీడియా ఎగిరి గంతేసినట్లుగా పోస్టులు పెట్టేసింది. తీరా చూస్తే అదంతా ఒట్టిదేనని తేలడంతో టీడీపీ ఉస్సూరుమంటూ కూర్చోవలసి వచ్చింది. ఒకపక్క ఆయా సర్వేలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభజనం ఏపీలో కొనసాగుతోందని వెల్లడవుతుండడంతో అనవసరంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఎందుకని బీజేపీ భావిస్తోంది. కాని బీజేపీలో చేరిన టీడీపీ నేతలు తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. అది ఎప్పటికైనా ఫలించకపోతుందా అన్న ఆశ వారిలోలేకపోలేదు. ఈలోగా జరగవలసిన డామేజీ జరిగిపోయింది. ఒకవైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారన్న వార్తలతో బీజేపీని వ్యతిరేకించే కొన్ని సామాజికవర్గాలలో టీడీపీపై నెగిటివ్ అభిప్రాయం మరింతగా పెరిగింది. విధం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లుగా అటు బీజేపీతో పొత్తు కుదరలేదు.. ఇటు ఆ పార్టీతో పొత్తు కోసం పాకులాడుతోందన్న భావనతో పరువు పోయింది. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఒంటరిగా పోటీచేస్తామని సవాలు విసురుతుంటే, తాము అలా చేయలేమని, ఒంటరిగా అయితే ఓడించలేమని చంద్రబాబు అంగీకరిస్తున్నట్లయింది. చదవండి: భయపెడుతున్నారా? భయపడుతున్నారా? టీడీపీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న జనసేన కూడా ఈ నేపథ్యంలో ఇంకో రకంగా ఇబ్బంది పడుతోంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కూడా ముగిసిపోయిందని, భార్యతో విడాకులు తీసుకున్నారంటూ జరిగిన ప్రచారం ఆయనకు బాగా అప్రతిష్ట తెచ్చిపెట్టింది. దీనిపై జనసేన పరోక్షంగా ఖండన ఇస్తూ వారాహి రెండో దశ యాత్ర కోసం జరిగిన పూజలో పవన్ దంపతులు పాల్గొన్నారంటూ ఒక ట్వీట్ చేసింది. కాని అది నకిలీ ఫోటో అంటూ కొన్ని యూ ట్యూబ్ చానళ్లు సోదాహరణంగా వివరించడంతో జనసేన మరింత గందరగోళంలో పడింది. దీనికి సంబంధించి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు జనసేన తెలిపి నష్ట నివారణ చర్యలకు తంటాలు పడుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి కావాలని ఒకసారి, తాను సీఎం పదవికి అర్హుడను కానని మరోసారి ప్రకటించి పరువు తీసుకున్న పవన్‌కు వ్యక్తిగత విషయం కూడా కాస్త ఇబ్బంది కలిగించేదే. ఇలా టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా తమ గాలి తామే తీసేసుకుంటూ రాజకీయంగా తీవ్రంగానే నష్టపోతున్నాయి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అమెజాన్ నుంచి ఇక అలాంటి ప్రొడక్ట్స్ రావు..
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దగ్గర నుంచి దుస్తుల వరకు అన్ని రకాల వస్తువులు ఈ-కామర్స్ సంస్థల ద్వారా ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా ఆన్లైన్లో కొన్న కస్టమర్లకు కొన్నిసార్లు డ్యామేజీ అయిన వస్తువులు డెలివరీ అవుతుంటాయి. దీంతో వాటిని మళ్లీ రిటర్న్ చేస్తుంటారు కస్టమర్లు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారం డ్యామేజీ వస్తువుల సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఉపాయం ఆలోచిస్తోంది. ఇందు కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారం తీసుకోనుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. అమెజాన్ తన గిడ్డంగులలో పెద్ద మార్పు చేస్తోంది. వస్తువులను కస్టమర్లకు పంపే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలంచడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల కస్టమర్లకు డ్యామేజీ వస్తువులు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. అదే విధంగా కస్టమర్ల ఆర్డర్లకు అనుగుణంగా వస్తువుల ఎంపిక, ప్యాకింగ్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుంది. అమెజాన్ గిడ్డంగులను మరింత ఆటోమేషన్ పెంచడానికి ఇది ఒక ముందడుగుగా భావిస్తున్నారు. కస్టమర్లకు పంపే వస్తువుల్లో ఏదైనా డ్యామేజీ ఉందా అనేది ప్రస్తుతం అమెజాన్ వేర్‌హౌస్‌లలో కార్మికులే మ్యానువల్‌గా పరిశీలిస్తున్నారు. అయితే ఉత్పత్తి లోడ్ చాలా ఎక్కువగా నేపథ్యంలో కొన్నిసార్లు డ్యామేజీ వస్తువులను గుర్తించలేక పోతున్నారు. దీంతో ఆ డ్యామేజీ వస్తువులు కస్టమర్లకు అలాగే చేరుతున్నాయి. డ్యామేజీ ఉత్పత్తులను మాన్యువల్‌గా స్క్రీనింగ్ చేసే ప్రక్రియ కష్టతరమైనది. చాలా సమయం తీసుకుంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అమెజాన్ భావిస్తోంది. -
దెబ్బ తిన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. నాసా ఆందోళన
వాషింగ్టన్ డీసీ: అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సంచలనంగా.. అదే సమయంలో కీలకంగానూ మారింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ప్రపంచంలోనే అత్యంత భారీ, శక్తివంతమైన టెలిస్కోప్‌గా దీనికి ఒక పేరు ముద్రపడింది. అంతెందుకు అంతరిక్ష శూన్యంలో ఆరు నెలల కాలం పూర్తి చేసుకుని.. అద్భుతమైన చిత్రాలను విడుదల చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే, తాజాగా ఓ నివేదిక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా National Aeronautics and Space Administration ను ఆందోళనకు గురి చేస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దెబ్బ తిందని.. రాబోయే రోజుల్లో అది టెలిస్కోప్ పని తీరుపై ప్రభావం చూపనుందన్నది ఆ నివేదిక సారాంశం. కమీషనింగ్ ఫేజ్‌లో టెలిస్కోప్ పని తీరును పరిశీలించిన సైంటిస్టుల బృందం ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది. ప్రస్తుతం, అనిశ్చితి యొక్క అతిపెద్ద మూలం సూక్ష్మ ఉల్కలతో దీర్ఘకాలిక ప్రభావాలు ప్రాధమిక అద్దాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. మే 22వ తేదీన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రాథమిక అద్దం, ఆరు మైక్రోమెటీరియోరైట్స్(సూక్ష్మ ఉల్కలు) కారణంగా దెబ్బ తింది. చివరి ఉల్క ఢీకొట్టడంతోనే టెలిస్కోప్ అద్దం దెబ్బతిందని సైంటిస్టులు స్పష్టం చేశారు. ప్రభావం చిన్నదిగానే చూపిస్తున్నప్పటికీ.. అది రాబోయే రోజుల్లో ఎంత మేర నష్టం చేకూరుస్తుందన్న విషయంపై ఇప్పుడే ఒక అంచనాకి రాలేమని సదరు సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అబ్జర్వేటరీ ప్రభావం ఎంతవరకు ఉందో చూపించే చిత్రాన్ని శాస్త్రవేత్తలు విడుదల చేశారు. అదే సమయంలో డ్యామేజ్ గురించి స్పందించిన జేమ్స్ వెబ్ రూపకర్తలు.. టెలిస్కోప్ అద్దాలు, సన్‌షీల్డ్(టెన్నిస్ కోర్టు సైజులో ఉంటుంది)లు ఉల్కల దెబ్బతో నెమ్మదిగా పని చేయడం ఆపేస్తాయని తేల్చడంపై నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ సమస్యను వీలైనంత త్వరగతిన పరిష్కరించాలనే ఆలోచనలో ఉంది నాసా. ఇదిలా ఉంటే హబుల్ టెలిస్కోప్ తర్వాత.. ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్‌గా పేరు దక్కించుకుంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నాసా NASA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(CSA)ల సహకారంతో సుమారు 10 బిలియన్ల డాలర్లు వెచ్చించి తయారు చేయించింది. ఈ టెలిస్కోప్ మిర్రర్స్ చాలా చాలా భారీ సైజులో ఉంటాయి. డిసెంబర్ 25, 2021లో దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించగా.. ఫిబ్రవరి నుంచి భూమికి 1.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో L2 పాయింట్ వద్ద ఇది కక్ష్యలో భ్రమిస్తూ ఫొటోలు తీస్తోంది. వెబ్ యొక్క అద్దం అంతరిక్షంలో తీవ్ర వేగంతో ఎగురుతున్న దుమ్ము-పరిమాణ కణాలతో బాంబు దాడిని తట్టుకునేలా రూపొందించబడిందని నాసా గతంలో ప్రకటించుకుంది. కానీ, ఇప్పుడు చిన్న చిన్న ఉల్కల దాడిలో దెబ్బ తింటుండడం ఆసక్తికరంగా మారింది. -
పొట్టు పొట్టు చినిగిన షూస్.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం
పారిస్: అరచేతిలో ఫోన్ ద్వారానే ఆర్డర్లు చేసుకునే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. బయటి మార్కెట్ల కన్నా.. ఆన్లైన్లోనే ఇప్పుడు అడ్డగోలు ప్రొడక్టులు దర్శనమిస్తున్నాయి. అదే టైంలో చిత్రవిచిత్రమైనవి కూడా కనిపిస్తున్నాయి. తాజాగా బాగా పేరున్న ఓ కంపెనీ వాళ్లు చేసిన పని.. సోషల్ మీడియాలో మామూలుగా ట్రోల్ కావడం లేదు. అందుకు కారణం.. పొట్టు పొట్టుగా చినిగిన షూస్‌ను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడం. లగ్జరీ బ్రాండ్లకు కేరాఫ్ అయిన ‘బలెన్షియాగా’ తాజాగా పారిస్ స్నీకర్ కలెక్షన్ పేరుతో లాంచ్ చేసింది. ఈ షూస్ ఎలా ఉన్నాయంటే.. కనీసం వేసుకోవడానికి కూడా పనికి రానంతగా! Balenciaga's New "Fully Destroyed" Shoe Set👟 x R36 000 per pair💵 Would you wear these? pic.twitter.com/oEduoUs1Fj — claztik🕊 (@claztik17) May 11, 2022 కానీ, వాళ్లు ఆ షూస్‌ను రిలీజ్ చేసింది వేసుకోవడానికేనట. పైగా అదే ఫ్యాషన్ అని ప్రకటించింది. వీటిలో రెండు స్టయిల్స్‌ను రిలీజ్ చేయగా.. మినిమమ్ ధర 495 డాలర్లు (మన కరెన్సీలో 38 వేల డాలర్లు) నుంచి గరిష్టంగా 1, 850 డాలర్లు (మన కరెన్సీలో లక్షా 44 వేల రూపాయల) దాకా ఉంది. మట్టి కొట్టుకుపోయి.. సర్వనాశనం అయిన ఈ షూస్‌ను లిమిటెడ్ ఎడిషన్ అంటూ వంద జతలను మాత్రమే రిలీజ్ చేసిందట. వీటి అందానికి తోడు ‘‘స్నీకర్స్ అంటే జీవిత కాలం ధరించేవి’’ అంటూ ఓ క్యాప్షన్ సైతం ఉంచింది బలెన్షియాగా. ఇంత దరిద్రాన్ని చూశాక ట్రోల్ రాజాలు ఊరుకుంటారా?.. ఆ ప్యాషన్‌ను పేకాట ఆడేసుకుంటున్నారు. Nueva Barbie Balenciaga pic.twitter.com/Wg9RCIvViA — Zorrito Zorrales (@ZorritoZorrales) May 9, 2022 Anyone who buys Balenciaga needs to go see the therapist https://t.co/xHG5N75x9y — Shabib Siddiqui 👨🏻🦯 (@shabibazam) May 10, 2022 -
రాజన్న సిరిసిల్ల: భారీ వర్షాలకు కోతకు గురైన రోడ్లు
-
గ్రామాల్లో తగ్గిన ఉపాధి..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు తీవ్రంగా దెబ్బతిన్నట్టు వివిధ సంస్థల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వివిధ రంగాల్లో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కోవిడ్ మహమ్మారి దాదాపు అన్ని రంగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన అవకాశాల తగ్గుదల, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధి రంగాలు ఇంకా పుంజుకోకపోవడం వంటి కారణాలతో భారత లేబర్ మార్కెట్ ఒత్తిళ్లకు గురవుతోంది. ఉపాధి కల్పనే మందు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పన ద్వారా లేబర్ మార్కెట్ పుంజుకునేలా చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఉపాధి కల్పన రేట్ మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవడం సవాళ్లతో కూడుకున్నదని, ఇందుకోసం ఆర్థికరంగం అదనపు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన అవసరముందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా విశ్లేషణలో పేర్కొంది. అఖిలభారత స్థాయి అంచనాల్లో గ్రామీణ భారతానికి అధిక ప్రాధాన్యం ఉన్నందున అక్కడ ‘ఎంప్లాయ్మెంట్ రేట్’ దిగజారకుండా చూడాల్సిన అవసరముందని తెలిపింది. ఆర్థికరంగం ఒడిదుడుకులు.. అక్టోబర్ తొలి 3 వారాల్లో సగటు గ్రామీణ ఎంప్లాయ్మెంట్ రేట్ 39.1 శాతం ఉండగా, సెప్టెంబర్‌లో 39.8 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సగటు ఎంప్లాయ్మెంట్ రేట్ అక్టోబర్ మొదటి 3 వారాల్లో 34.8 శాతం కాగా, సెప్టెంబర్‌లో 34.4 శాతంగా ఉంది. కరోనాతో గత ఏప్రిల్ నెలలో తలెత్తిన తీవ్ర పరిస్థితుల ప్రభావం కారణంగా భారత ఆర్థిక రికవరీ ప్రక్రియ స్తబ్ధతకు గురైనట్టు సీఎంఐఈ విశ్లేషించింది. ఆ స్థితి నుంచి ఆర్థిక రంగం గత మేలో బాగానే కోలుకోగా, జూన్‌లోనూ మెరుగైన స్థితిలో ఉంటూ జూలైలోనూ అదే కొనసాగినట్టు వెల్లడించింది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్లలో అది నిలిచిపోయి, అక్టోబర్‌లోనూ స్తబ్ధత కొనసాగిందని పేర్కొంది. -
భారీ వర్షం: ఇమేజ్.. డ్యామేజ్..
1908 సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి వర్షం మొదలైంది.. 24 గంటలు దాటేసరికి వర్షం మరింత పెరిగింది.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన 36 గంటల్లో దాదాపు 17 సెం.మీల వర్షపాతం నమోదైంది. మూసీ 60 అడుగుల ఎత్తువరకు నీరు పారింది. అఫ్జల్‌గంజ్ వద్ద వంతెనపై 11 అడుగులపైన ఎత్తులో నీరు ప్రవహించడంతో మూసీపై ఉన్న అఫ్జల్, ముస్లింజంగ్, చాదర్‌ఘాట్ వంతెనలు కొట్టుకుపోయాయి. కొస్లావాడి, ఘాన్సీబజార్ ప్రాంతాలతో పాటు 80 వేల ఇళ్లలోకి నీరు చేరింది. వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 2020 అక్టోబర్ 13వ ఉదయం నుంచి వర్షం మొదలైంది.. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురవడంతో నగరం అస్తవ్యస్తంగా మారింది. మూసీకి వరదలు వచ్చిన 112 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో మూసీ ప్రవహించింది. ఇరువైపులా ఉన్న కాలనీల్లోకి నీరు చేరింది. నగరంలోని చెరువులు తెగిపోయి వందల కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. వాహనాలు, ఇళ్లలోని వస్తువులు ధ్వంసమయ్యాయి. సాక్షి, హైదరాబాద్: 1908 వరదల తర్వాత పురానాపూల్, నయాపూల్, చాదర్‌ఘాట్ వంతెనలు నిర్మించారు. భారీ వర్షం కురిసి మూసీ ప్రవాహం పెరిగినా ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పురానాపూల్ బ్రిడ్జి పిల్లర్‌కు బీటలు రావడంతో వెంటనే అధికారులు రాకపోకలను నిలిపివేశారు. 400 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో ప్రస్తుతం చాలా నిర్మాణాలు కనీస మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అంతేగాకుండా నగరంలోని చాలా కట్టడాల గోడలు కూలుతున్నాయి. దీనిపై ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. చదవండి: (ప్రతి ఇంటికి రూ.10 వేలు..) తడుస్తున్న పురానీ హవేలీ గోడలు హైదరాబాద్ సంస్థానాన్ని దాదాపు 200 ఏళ్లు పాలించిన నిజాం పాలకుల నివాసం పూరానీ హవేలీ.. ప్రస్తుతం ఇందులో నిజాం మ్యూజియం కొనసాగుతోంది. ఇందులో విలువైన వస్తువులు ఉన్నాయి. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ వాడిన ప్రపంచంలోనే అతిపెద్ద వాడ్రోబ్ ఉంది. నిర్వహణ సరిగా లేక గోడల్లోకి నీరు చేరుతోంది. డ్రైనేజీ వ్యవస్థతో అవస్థ మక్కా మసీదులో ఎక్కడ చూసినా నిర్లక్ష్యం కనిపిస్తోంది. అక్కడ నిర్వహణ సరిగ్గా లేక పైనుంచి గోడల ద్వారా నీరు కిందకు వస్తోంది. మక్కా మసీదులో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రాంగణంలో నీరు నిల్వ ఉంటోంది. మరమ్మతులు మాత్రం సరిగా సాగడం లేదు. శిథిలావస్థలో చరిత్ర కుతుబ్‌షాహీ, ఆసీఫ్జాహీ కాలంలోని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చార్మినార్, మక్కా మసీదుల గోడల్లోంచి నీరు కారుతోంది. నిజాంల నివాసంలోనూ గోడలు తడిసిపోయాయి. చార్మినార్ పైకప్పు నుంచి నీరు కిందకు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైపుల్లో మట్టి పేరుకుపోవడంతో నీళ్లు కిందకు రావడం లేదు. దీంతో గోడలు తడిసిపోతున్నాయి. పురానా పూల్ వంతెనకు బీటలు 1992 ఫ్రిబవరి 28వ తేదీ పురానా పూల్ వంతెనకు పక్కనే మరో కొత్త వంతెన నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్ గేట్లు తెరిచి మూసిలోకి వరద నీటిని వదిలారు. వంతెన పిల్లర్లకు బీటలు పడ్డాయి. పార్థివాడ నుంచి జియాగూడ వైపు వచ్చే వంతెన పిల్లర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అర్ధరాత్రి నుంచి వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. మరుసటి రోజు సాయంత్రం చిన్న వాహనాలకు అనుమతించారు. నిజాం కాలంలో నిర్మించిన పురానా, నయాపూల్, చాదర్ఘాటల్ వంతెనలు తప్ప మిగతావి 1990 తర్వాత నిర్మించినవే.. కూలుతున్న గోల్కొండ కోట గోడలు గోల్కొండ: 500 ఏళ్ల క్రితం నిర్మితమైన గోల్కొండ కోట భారీ వర్షాలకు దెబ్బతింటోంది. కోట గోడలు కూలుతున్నాయి. కోట ప్రవేశ ద్వారాల తలుపు రెక్కలు సైతం పాడయ్యాయి. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన గోల్కొండ కోటలో 1518 బహమనీ వంశస్తుడైన సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్‌ముల్క్ 1518లో రాతి కోటగా మార్చాడు. అనంతరం కులీకుతుబ్‌షా కోటను మరింత పటిష్టం చేసేందుకు నయాఖిలాను నిర్మించాడు. కాగా ప్రస్తుతం గోల్కొండ కోటతో పాటు నయాఖిలాలోని కోట గోడలు, బురుజులు భారీ వర్షాలకు కూలుతున్నాయి. కోటలో రాణివాసంతో పాటు కోటలో నివాసం ఉండేవారికి నీరు అందించే చారిత్రక కఠోర హౌస్ కట్టడానికి చెందిన ప్రహరీ నేలకూలింది. గోల్కొండ కోట రాజులు, మంత్రి, సైన్యాధిపతి కోట పైభాగంలోని దర్బారు వద్దకు వెళ్లేందుకు కోట గోడ పొడవునా గుర్రాల దారిని నిర్మించారు. 5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ మార్గాన్ని భారీ బండరాళ్లు, మట్టి, సున్నపు డంగుతో నిర్మించారు. నిన్నటి భారీ వర్షానికి గోడ నేలకూలింది. ఈ నెల మొదటి వారంలో భారీ వర్షాలకు నయాఖిలాలోని మజ్నూ బురుజు కూడా నేలకూలింది. 8 మీటర్ల వెడల్పు గల ఈ బురుజుపై నుంచి శత్రు సైన్యంపై ఫిరంగి గుళ్లు వదిలేవారు. నిర్వహణ లోపంతో ఈ బురుజు కూలింది. ఒకప్పుడు సుగంధాలు వెదజల్లిన కఠోర హౌజ్ తటానికి ఉన్న ప్రహరీ సోమవారం ఓ వైపునకు ఒరిగి తటాకంలో కూలింది. 200 మీటర్ల పొడవు గల ఈ గోడ భారీ శబ్దంతో కూలిపోయింది. -
కొండపోచమ్మ కాల్వలకు వర్షం దెబ్బ
గజ్వేల్: కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ కాల్వలకు వర్షం దెబ్బ తగిలింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల కాల్వల సిమెంట్ లైనింగ్ దెబ్బతిన్నది. మట్టి కుంగిపోయి లీకేజీలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నది. గోదావరి జలాలు మల్లన్నసాగర్ సర్జిపూల్ నుంచి తుక్కాపూర్ గ్రావిటీ కెనాల్ ద్వారా 24 కిలోమీటర్లు ప్రయాణం చేసి గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద నిర్మించిన హెడ్‌రెగ్యులేటరీ వద్దకు చేరుకుంటాయి. ఇక్కడి గేట్లు ఎత్తిన తర్వాత కాల్వల ద్వారా అక్కారం పంపుహౌజ్ వైపు మరో 6 కిలోమీటర్లు తరలివెళ్తాయి. అక్కడి నుంచి మరో 6.5 కిలోమీటర్ల మేర మర్కూక్–2 పంపుహౌజ్‌కు, ఆ తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి చేరుతాయి. మల్లన్నసాగర్ సర్జిపూల్ నుంచి కొడకండ్ల వరకు ఉన్న ఈ కాల్వ సామర్థ్యం 11,500 క్యూసెక్కులు. ఇది నాగార్జునసాగర్ కాల్వల సామర్థ్యం కంటే కూడా పెద్దది. ఇంతటి కీలకమైన కాల్వ వర్షాలకు దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా గజ్వేల్ మండలం కొడకండ్ల హెడ్ రెగ్యులేటరీ వద్ద సిమెంట్ లైనింగ్, మెట్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల మట్టి కుంగిపోయి సిమెంట్ లైనింగ్ దెబ్బతినడంతో లీకేజీలు ఏర్పడే ప్రమాదం నెలకొన్నది. మర్కూక్ సమీపంలోనూ కాల్వ సిమెంట్ లైనింగ్ దెబ్బతిన్నది. దీంతో కాల్వ నాణ్యత ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై నీటిపారుదల శాఖ ఈఈ బద్రీనారాయణ వివరణ కోరగా, భారీ వర్షాల కారణంగానే నీటి ప్రవాహం పెరిగి కాల్వ దెబ్బతిన్న మాట వాస్తవమేనని తెలిపారు. అయితే నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే మరమ్మతు చేయిస్తున్నామని స్పష్టం చేశారు. -
పక్షి దెబ్బకు 14కోట్లు నష్టం
మేరీల్యాండ్: ప్రచ్చన్న యుద్ధ కాలంలో అమెరికా నేతలకు రక్షణ కల్పించడంతోపాటు అణుదాడులకు ఉపయోగపడిన ఓ కీలకమైన విమానం పక్షి కారణంగా దెబ్బతినడంతో రూ.14 కోట్ల మేర నష్టం కలిగింది. మేరీల్యాండ్‌లోని పట్యుక్సెంట్ రివర్ నేవల్ ఎయిర్ స్టేషన్లో ఈ నెల 2న జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ–6బీ మెర్క్యురీ రకం విమానం రన్‌వేపైకి వస్తున్న క్రమంలో ఓ పక్షి ఢీకొంది. విమానాన్ని వెంటనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, పక్షి కారణంగా విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి దెబ్బతింది. దీంతో రూ.14 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనను వైమానిక దళం ‘ఏ క్లాస్’ ప్రమాదంగా పేర్కొంది. ఈ–6బీ మెర్క్యురీ విమానం ఖరీదు రూ.10వేల కోట్లపైమాటే. -
పెచ్చులూడుతున్న ప్రాభవం!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర షాన్.. మన హైదరాబాద్ సంతకం.. ఈ చారిత్రక నగరానికి తలమానికంగా విరాజిల్లుతున్న చార్మినార్ భవితవ్యం ప్రమాదంలో పడింది. 428 ఏళ్ల ఈ కట్టడం నుంచి ఓ భారీ పెచ్చు ఊడి కింద పడింది. మక్కా మసీదు వైపు మినార్‌లో ఉన్న పూల డిజైన్‌లో కొంత భాగం బుధవారం రాత్రి 11.40 గంటలకు భారీ శబ్దంతో కింద పడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాంబు పేలిందేమోననే భయంతో అక్కడున్నవారంతా మక్కా మసీదు వైపు పరుగులు తీశారు. కాసేపటి తర్వాత వచ్చి, పెచ్చు ఊడి కింద పడిన సంగతి గుర్తించారు. దాదాపు రెండు మూడు క్వింటాళ్ల బరువైన భాగం అంత ఎత్తు నుంచి కింద పడటంతో అక్కడున్న బండరాయి సైతం పగిలిపోయింది. రాత్రి సమయం కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. పెద్ద డ్యామేజీయే...: చార్మినార్ నిర్మించిన 233 ఏళ్ల తర్వాత ఓ వైపు మినార్ కూలిపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా పెద్దగా ధ్వం సమైన దాఖలాలు లేవు. అయితే, బుధవారం రాత్రి ఊడిపడిన పెచ్చు ఈ 195 ఏళ్లలో జరిగిన పెద్ద డ్యామేజీ అని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఓసారి, దాదాపు 17 ఏళ్ల క్రితం ఓసారి.. చిన్నచిన్న పెచ్చులు ఊడిపడ్డాయి. అవి చాలా చిన్నవి కావడంతో అంతగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఊడిపడిన పెచ్చు భారీగా ఉండటంతో ఈ కట్టడం శిథిలావస్థకు చేరుకుంటోందన్న హెచ్చరికగానే భావించాలని అంటున్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన నిర్లక్ష్యానికి ఫలితం ఇలా మొదలైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మినార్‌లో పెచ్చులూడిన ప్రదేశం కాలుష్యమే కారకం... కొన్ని దశాబ్దాలుగా వేల సంఖ్యలో వాహనాలు చార్మినార్‌కు అతి చేరువగా సంచరిస్తుండటం.. ఈ కట్టడం బలహీనపడటానికి కారణమైంది. వాహనాల నుంచి వెలువడే పొగ, రేగుతున్న ధూళి కణాలు చార్మినార్ కట్టడం పటుత్వం దెబ్బతినేలా చేశాయి. విషవాయువులు, నైట్రోజన్ డయాక్సైడ్, ధూళికణాలు.. అన్నీ కలిపి కట్టడం గోడలపై పూతలాగా ఏర్పడ్డాయి. వాన నీళ్లు, వాతావరణంలోని తేమను గోడలు పీల్చుకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. డంగు సున్నం, కరక్కాయ పొడి, నల్లబెల్లం, రాతి పొడి, గుడ్డు సొన మిశ్రమంతో చార్మినార్‌ను నిర్మించారు. ప్రధాన కట్టడం రాతిదే అయినా, దానిపైన ఈ మిశ్రమాన్ని మందంగా ఏర్పాటు చేశారు. ఇవి తడిని పీల్చుకోవు. కానీ సందర్శకులు వారి పర్యటనకు గుర్తుగా చార్మినార్ గోడలపై లోతుగా పేర్లు చెక్కుతున్నారు. అవి క్రమంగా పగుళ్ల తరహాలో ఏర్పడి తేమను లోనికి పీల్చుకునేలా చేస్తున్నాయి. ఫలితంగా పై పూతతోపాటు, లోపలి ప్రధాన రాతి కట్టడం కూడా బలహీన పడిందని నిపుణులు గుర్తించారు. అందుకే కొన్నేళ్లుగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ శాఖ(ఏఎస్ఐ) అధికారులు గోడలకు కెమికల్ ట్రీట్మెంట్ చేసి సంప్రదాయ మిశ్రమంతో దెబ్బతిన్న భాగాలను సరి చేస్తున్నారు. కానీ కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం చుట్టుముట్టిన ఫలితంగా కట్టడం బాగా బలహీనపడింది. ధూళి కణాలు (రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్) సాధారణ స్థాయి 80. అది పెరిగేకొద్దీ కట్టడం క్రమంగా దెబ్బతినడం మొదలవుతుంది. ప్రస్తుతం అది చార్మినార్ వద్ద 110 నుంచి 140 వరకు ఉందని గుర్తించారు. ఇక నాన్ రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ సాధారణ స్థాయి 60 కాగా, చార్మినార్ వద్ద అది 90 పాయింట్ల వరకు నమోదవుతోంది. నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి కూడా 20 శాతం ఉండాల్సి ఉండగా చార్మినార్ వద్ద 25 శాతాన్ని మించుతోంది. కాపాడే పని.. నష్టం చేసిందా? చార్మినార్‌కు వాహనాల కాలుష్యం ప్రధాన శత్రువుగా గుర్తించి దాన్ని నివారించే ఉద్దేశంతో చార్మినార్ చుట్టూ వాహనాలు రాకుండా చేయాలని చాలాకాలం క్రితమే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు చేపట్టారు. చార్మినార్ వద్దకు నడుస్తూ మాత్రమే వెళ్లాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇటీవలే ఆ పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా చార్మినార్ చుట్టూ రోడ్డుపై రాళ్లు పరచటంతోపాటు, కొత్త డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు పనులు చేపట్టారు. కానీ, ఇది పురాతన కట్టడాలను పరిరక్షించే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న నిబంధనల ప్రకారం జరగలేదని ఇప్పటికే అటు పురావస్తుశాఖ అధికారులతోపాటు ఇటు స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పనుల్లో భాగంగా డోజర్లు, పొక్లెయిన్లు, ఇతర భారీ యంత్రాలను వినియోగించారు. అవి చార్మినార్ కట్టడం పక్కనే రోజుల తరబడి పనులు చేశాయి. వాటి నుంచి ఉత్పన్నమయ్యే తరంగాలు కట్టడం కదిలేలా చేస్తాయని అప్పట్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ దీన్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో పనులు జరిపారు. ఆ ప్రభావమే ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటి వరకు మరమ్మతు జరగని భాగమది... 428 ఏళ్ల క్రితం 48.7 మీటర్ల ఎత్తుతో అత్యంత పటిష్టంగా నిర్మించిన అందమైన కట్టడం చార్మినార్. అప్పట్లో రూ.లక్ష వ్యయంతో దీన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. చార్మినార్ నిర్మించాక 233 ఏళ్ల అనంతరం 1824లో నైరుతి వైపు భాగం ఉన్నట్టుండి కుప్పకూలింది. ప్రకృతి విపత్తే దానికి కారణమనే వాదన ఉంది. ఆ వెంటనే దాదాపు రూ.60 వేల వ్యయంతో దాన్ని పునర్నిర్మించారు. దెబ్బతిన్న మిగతా కొన్ని భాగాలకు కూడా మరమ్మతు చేశారు. కానీ ప్రస్తుతం పెచ్చు ఊడిన ప్రాంతానికి ఇప్పటి వరకు మరమ్మతు చేయలేదు. అంటే అది నాలుగు శతాబ్దాల క్రితం నాటి నిర్మాణమన్న మాట. దీంతో స్వతహాగానే ఆ భాగం కొంత బలహీనపడి ఉంటుంది. దీనికి అటు కాలుష్యం కాటు, వాతావరణ ప్రభావం, బలమైన యంత్రాలతో అతి సమీపంలో చేపట్టిన పనుల వల్ల ఏర్పడ్డ తరంగాల ప్రభావం.. ఇలా అన్నీ కలిసి భారీ పెచ్చు ఊడిపోవటానికి కారణమై ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక పరిశీలనలో పురావస్తు శాఖ అధికారులు ఇతమిత్థమైన కారణం చెప్పనప్పటికీ, కాలుష్యంతో బలహీనపడ్డ విషయంలో ఎలాంటి అనుమానమే లేదని పేర్కొంటున్నారు. భారీ యంత్రాలతో చేపట్టిన పనుల వల్ల సమస్య ఉత్పన్నమై ఉంటుందని, ఇటీవలి అకాల భారీ వర్షాలకు ఆ భాగం కొంత దెబ్బతిని పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. గురువారం రాత్రి ఏఎస్ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మిలింద్ తదితరులు ఈ కట్టడాన్ని పరిశీలించారు. శుక్రవారం ప్రత్యేక నిపుణులు వచ్చి పరిశీలించనున్నారు. కాగా, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కూడా గురువారం చార్మినార్‌ను సందర్శించారు. పెచ్చు ఊడిపడటానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
భగీరథ గేట్వాల్ లీక్
సాక్షి, కురవి: మండల కేంద్రం శివారులోని పెద్దచెరువు కింది భాగంలో 365 జాతీయ రహదారికి పక్కన ఏర్పాటు చేసిన భగీరథ గేట్‌వాల్వ్ విరిగిపోవడంతో నీళ్లు ఫౌంటెన్లా పైకి ఎగిసిపడుతున్నాయి. గురువారం సాయంత్రం 4.30గంటల సమయంలో గేట్వాల్ ఒక్కసారిగా విరిగి పక్కకు ఒరగడంతో నీళ్లు ఎగజిమ్ముతున్నాయి. ఈ నీరంతా దారిపక్కన వృథాగా పారుతున్న దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. -
చాక్లెట్లతో పర్యావరణానికి హాని!
లండన్: మనం ఎంతో ఇష్టపడే చాక్లెట్ల వల్ల పర్యావరణానికి అపారమైన హాని కలుగుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన పరిశోధకులు చాక్లెట్ల తయారీలో వాడే పదార్థాలు, తయారీ విధానం, ప్యాకింగ్ వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇందులో బ్రిటన్‌లోని చాక్లెట్ల పరిశ్రమ ఏటా 20 లక్షల టన్నుల గ్రీన్ హౌన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా చాక్లెట్లు, ప్యాకింగ్ వాడే ముడి పదార్థాల వల్ల ఎక్కువ హాని కలుగుతోందని గుర్తించారు. -
హనుమాన్ విగ్రహంపైనా దుండగుల ఆగ్రహం
లక్నో : లెనిన్, పెరియార్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలపై దాడుల ఘటనలు మరువక ముందే యూపీలో కొందరు దుండగలు హనుమాన్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన వెలుగుచూసింది. బలియా సమీపంలోని ఖరూవ్ గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నెలకొల్పిన హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహంపై దుండగులు ఓ పోస్టర్‌ను అతికించారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్ధం కిందట సురేష్ సింగ్ తన పొలంలో చనిపోయిన వానరాన్ని గుర్తించిన క్రమంలో అక్కడ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి స్ధానికులు అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై తీవ్ర చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి పరాజయం నేపథ్యంలో త్రిపురలో తొలుత లెనిన్ విగ్రహాన్ని బుల్డోజర్ సాయంతో కూల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఇక తమిళనాడులోని తిరుపత్తూర్‌లో ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ, సీపీఐకి చెందిన ఇద్దరు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇదే ఒరవడిలో పశ్చిమ బెంగాల్లో భారతీయ జన్‌సంఘ్ వ్యవస్ధాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని, యూపీలోని మీరట్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. చివరికి మహాత్మా గాంధీ విగ్రహాన్నీ దుండగులు విడిచిపెట్టలేదు. కేరళలోని కన్నూర్ జిల్లా తలిపరంబ వద్ద గాంధీ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. విగ్రహాల కూల్చివేతపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరికలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. -
రైతుల కష్టం ‘రాళ్ల’ పాలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. బలమైన ఈదురు గాలులతో కూడిన వడగండ్ల దాటికి పంటలు దెబ్బ తిన్నాయి. వేలాది ఎకరాల్లో ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కల్లాల్లో ఉన్న పసుపు తడిసి ముద్దయింది. చేతికందే పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు కంట నీరు పెడుతున్నారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం హోరెత్తించింది. ముందుగా బలమైన ఈదురు గాలులతో ప్రారంభమై.. వడగండ్ల వాన కురిసింది. పెద్ద పెద్ద మంచుగడ్డలు పడటంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కొన్ని చోట్ల గింజలు రాలిపోవడంతో రైతులు కన్నీటి పర్వంతమవుతున్నారు. 4 వేలకుపైగా హెక్టార్లలో పంటనష్టం.. వడగండ్ల వానతో బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్ మండలాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లింది. మోపాల్ మండలంలో కూడా కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంట నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం 6,600 మంది రైతులకు సంబంధించి 4,010 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు తేల్చారు. ఈ ఏడు మండలాల పరిధిలోని 69 గ్రామాల్లో ఈ అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. అత్యధికంగా 2,742 హెక్టార్లలో ఎర్రజొన్న పంట దెబ్బతిన్నట్లు తేలింది. 899 హెక్టార్లలో మొక్కజొన్న, వరి 299, నువ్వుపంట 69 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. తడిసిన పసుపు.. అకాల వర్షం పసుపు రైతులకు కన్నీటిని మిగిల్చింది. విక్రయించేందుకు సిద్ధంగా కల్లాల్లో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దయింది. దీంతో పసుపు రంగు మారి నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు గత నెల రోజులుగా పసుపును మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వర్షం కురియడంతో పంటను ఎలా విక్రయించుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా పోస్ట్ హార్వెసింగ్ (కోత అనంతరం) కావడంతో పంట నష్టం వివరాలను సేకరించలేక పోతున్నామని అధికారులు దాట వేస్తున్నారు. మరోవైపు ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 148 మంది రైతులకు సంబంధించి 153 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. టమాట, ఇతర కూరగాయలు దెబ్బతిన్నాయి. మామిడి పూత రాలిపోవడంతో ఈసారి కాత తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుందని రైతులు వాపోతున్నారు. కొత్తిమీర పంటకు కూడా నష్టం జరిగింది. సుమారు 200లకు పైగా గొర్రెల మృతి.. వడగండ్ల వాన పశు సంపదకు కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా 182 గొర్రెలు మృతి చెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ సుమారు రెండు వందలకు పైగా జీవాలు చనిపోయినట్లు అనధికారిక అంచనా. మృతి చెందిన గొర్రెల్లో 72 ప్రభుత్వం పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెలున్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి బీమా పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మిగతా గొర్రెల పరిహారానికి సంబంధించి విపత్తు నియంత్రణ శాఖకు ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంటున్నారు. -
నిర్లక్ష్యం ఖరీదు కోటిన్నర!
చీమకుర్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెండు బాధ్యతాయుతమైన శాఖల మధ్య కొరవడిన సమన్వయం తీవ్ర నష్టానికి కారణమైంది. కోట్లాది రూపాయల విలువైన కేబుల్ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఒంగోలు నగరం నుంచి కర్నూలు రోడ్డును ఫోర్‌లైన్‌గా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా ఆర్అండ్బీ అధికారులు ఒంగోలు బైపాస్ సమీపంలోని నవభారత్ భవనాల నుంచి పేర్నమిట్ట సంతనూతలపాడు వైపునకు సుమారు 5 కి.మీ పొడవునా రోడ్డును తవ్వేశారు. విచక్షణా రహితంగా తవ్వేయడంతో మార్జిన్ కింద ఉన్న టెలికం రంగానికి చెందిన కోట్ల విలువ చేసే కేబుల్ వైర్లు ధ్వంసమయ్యాయి. బీఎస్ఎన్ఎల్కు చెందిన విలువైన కేబుల్ పూర్తిగా ధ్వంసమైందని టెలికం అధికారులు వాపోతున్నారు. ఆర్అండ్బీ, టెలికం రంగాలకు చెందిన రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే టెలికం కేబుల్ ధ్వంసం కావడానికి కారణంగా కనిపిస్తోంది. ఒంగోలు అంజయ్యరోడ్డు, పేర్నమిట్ట పరిధిలోనున్న టెలికం కార్యాలయాలకు చెందిన కేబుల్ కర్నూల్ రోడ్డులో ఎక్కువగా ఉంది. ధ్వంసమైన కేబుల్ విభాగాల్లో 200 పెయిర్, 100, 20, 15 పెయిర్ కేబుల్స్ ఉన్నట్లు సాంకేతిక సిబ్బంది తెలిపారు. మెయిన్‌లైన్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ లైన్ల నుంచి పక్కనున్న వీధులకు సరఫరా చేసే కేబుల్స్ «ధ్వంసమైన వాటిలో ఉన్నాయన్నారు. మూగబోయిన ఫోన్లు.. ధ్వంసమైన కేబుల్, మళ్లీ వాటిస్థానంలో ఏర్పాటు చేయాల్సిన కొత్త కేబుల్ విలువలే బీఎస్ఎన్ఎల్కు చెందిన వాటి విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉండొచ్చని, ఇక ప్రైవేటు రంగానికి చెందిన ఐడియా, ఎయిర్టెల్, రిలయన్స్ వంటి సంస్థలకు చెందిన కేబుల్స్ విలువ మరో రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా. వాటితో పాటు నెల రోజులుగా కేబుల్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావడంతో వాటి పరి«ధిలోనున్న ల్యాండ్‌లైన్ ఫోన్లు, బ్రాడ్‌బాండ్‌లు, సెల్ఫోన్లు వేల సంఖ్యలో మూగబోయినట్లు వినియోగదారులు వాపోతున్నా రు. వాటి ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని టెలికం కంపెనీలకు రెవెన్యూ ద్వారా సుమారు మరో రూ.50 లక్షలు ఆదాయాన్ని కోల్పోయినట్లు ఆయా శాఖల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన కేబుల్‌కు పరిహా రాన్ని ఆర్అండ్బీ డిపార్టుమెంట్ నుంచి వసూలు చేసుకోవచ్చా..? రోడ్డు విస్తరణలో టెలికం వారికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా..? అనే అంశాలపై ఆర్అండ్బీ అధికారుల వద్ద స్పష్టత లేకపోవడం గమనార్హం. నెల రోజుల పాటు ప్రజలకు అందాల్సిన టెలికం సేవలకు ప్రజలు పడిన అవస్థలకు ఎంత విలువ కడతారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. -
నారాయణపూర్‌లో భారీ అగ్నిప్రమాదం
-
శశికళ పోస్టర్‌ను చించిన కార్యకర్త
-
మొలకెత్తిన మొక్కజొన్న
ఆదుకోవాలంటూ తహసీల్దార్‌కు రైతుల విన్నపం చిన్నశంకరంపేట: భారీగా కురిసిన వర్షాలకు తడిసిన మొక్కజొన్న కంకులు మొలకెత్తి తీవ్రంగా నష్టం వచ్చిందని పలు గ్రామాల రైతులు తహసీల్దార్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. శనివారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయానికి మొలకెత్తిన మొక్కజొన్న కంకులతో తరలి వచ్చి తమకు జరిగిన నష్టం వివరించారు. జంగరాయి గ్రామ నాగులమ్మ తండాకు చెందిన రెడ్యా నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేశారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలతో మొక్కజొన్న కంకులు మొలకెత్తి చేతికందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన మొక్కజొన్నలను ఎవరూ కొనుగోలు చేయరని, దీంతో తాము పెట్టిన పెట్టుబడులు చేతికందకపోగా, మరింత అప్పులయ్యయన్నారు. ప్రభుత్వం నష్టపరిహరం అందించి ఆదుకోవాలని కోరారు. గవ్వలపల్లి తండాకు కిషన్ కూడా మొలకెత్తిన మొక్కజొన్న కంకులతో తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయలక్ష్మి మార్క్‌ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి మొలకెత్తిన మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని కోరారు. -
పంటనష్టంపై స్పందించని అధికారులు
వెల్దుర్తి: కుండపోత వర్షాలు, వరదల బీభత్సంతో చేతికి వచ్చిన పంటలు నాశనమైనా అధికారులు స్పందించడం లేదని వెల్దుర్తికి చెందిన రైతులు చెంద్రయ్య, రాజు, మల్లయ్య ఆరోపించారు. బుధవారం వారు మొలకెత్తిన మొక్కజొన్న కంకులను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. నాలుగు రోజులుగా రెవెన్యూ, వ్యవసాయ అధికారులకు ఫోన్లు చేస్తున్నా స్పందించడం లేదని ఆరోపించారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్టాలపై సర్వే చేయాలని కోరారు. -
గాంధీ పార్కు పట్టించుకోరా?
నిలిచిన వర్షపు నీరు పట్టించుకోని నగర పంచాయతీ పాలకవర్గం జోగిపేట: జోగిపేటలో ఉన్నది గాంధీ పార్కు ఒక్కటే. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ పార్కు నిరాదరణకు గురవుతుంది. కేవలం 15వ అగస్టు, 26 జనవరిలలో మాత్రమే గేట్లు తెరచి పతాకావిష్కరణ చేసి మళ్లీ మూసేస్తారు. పార్కులో శుభ్రత విషయంలో పట్టించుకునే పరిస్థితి లేదు. పార్కులోకి వెళుతుండగా ఎదురుగా గాంధీ విగ్రహన్ని అప్పట్లో ఏర్పాటు చేశారు. విగ్రహం ముందు నీరు నిలవడంతో కనీసం నిలబడే పరిస్థితిలేదు. ఖాళీ ప్రదేశంలో కూడా వర్షపు నీరు నిండిపోయింది. చెట్లు వంగిపోయాయి. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ పార్కు అభివృద్ధి కోసం పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పార్కులను అభివృద్ధి చేపసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు, పాలకవర్గాలు సరైన శ్రద్ధ కనబరచడం లేదన్న విమర్శలున్నాయి. పార్కులో నీడనిచ్చే చెట్లు ఎన్నో ఉన్నాయి. పరిశుభ్రంగా లేకపోవడంతో దుర్గంధం వస్తుంది. సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే పార్క్‌ను తెరవడంతో ఆదరణ కోల్పోతుంది. పార్కులో బెంచీలు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు తెరచుకుంటే బాగుంటుందని స్థానికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్కు నిర్వాహణకు నగర పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుది. పార్కులో వేల చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. జోగిపేట నగర పంచాయతీ పాలకవర్గం పార్కు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. గాంధీ పార్కును అభివృద్ధి చేయాలి జోగిపేటలోని గాంధీ పార్కును అన్ని విధాలా అభివృద్ధి చేయాలి. పట్టణంలో ఇదే ముఖ్యమైన పార్కు,. పార్కులో అన్ని వసతులు కల్పించాలి. విద్యుత్‌లైట్లు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం వేళలో పార్కులో కూర్చునే విధంగా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. నగర పంచాయతీ నుంచి నిధులను విడుదల చేయాలి. చాలా సంవత్సరాలుగా పార్కు నిరాదరణకు గురవుతుంది. - రామకృష్ణ, జోగిపేట చర్యలు తీసుకుంటాం గాంధీ పార్కులో చేరిన వర్షపునీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. గాంధీ పార్కు అభివృద్ధికి సంబంధించి పాలకవర్గం దృష్టికి తీసుకువస్తాం. పార్కులో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూస్తాం. ప్రతిరోజు సిబ్బందితో శుభ్రం చేయిస్తాం. గాంధీ పార్కులో ఇతర సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించి పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. - రాజ్‌భరత్, ఏఈ నగర పంచాయతీ జోగిపేట -
ప్రమాదకరంగా రహదారి
తొగుట: మండలంలోని కాన్గల్, గుడికందుల గ్రామాల మధ్య నిర్మించిన రోడ్డు అధ్వానంగా తయారైంది. సుమారు మూడు కిలోమీటర్లు రోడ్డుపై కంకర తేలి ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొంది. రోడ్డుపై వాహనాలు నడుపడానికి వాహనదారులు జంకుతున్నారు. నిత్యం గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు ఈ రోడ్డు ద్వారానే వెళుతుంటారు. కాగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి బురదగా మారి ప్రజలు నడవలేని పరిస్థి నెలకొంది. మరోదారి లేకపోవడంతో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో బావి పనుల కోసం వెళ్లి వస్తున్న క్రమంలో జారీ బురదలో పడిపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు సైతం ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా కాన్గల్ గ్రామ ప్రజలు తమ అవసరాల కోసం ఈ రోడ్డుపైన సిద్దిపేటకు వెళుతుటారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇవి రోడ్లేనా?
భెల్: టౌన్‌షిప్‌లోని రోడ్లు అనేక చోట్ల అధ్వానంగా మారాయి.. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం వేసిన రోడ్లు గుంతలుగా ఏర్పడ్డాయి. రాత్రి వేళలో గుంతలు కనిపించక ప్రమాదాల బారినపడుతున్నారు. రోడ్డు నిర్మాణ సమయంలో అధికారులు నాణ్యతా ప్రమాణాలను పట్టించుకొకపోవడం వల్లనే రోడ్లు పాడవుతున్నాయని భెల్కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వర్షాల కారణంగా రోడ్డుపై డంబరు కంకరలేచి వాహనాలు వెళ్లినప్పుడు దుమ్ములేవడంతో మోటర్‌సైకిల్‌పై వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన భెల్ అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు. -
అధ్వానంగా అంతర్గత రోడ్లు
కొండాపూర్: గ్రామాల్లోని అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం పడితే చాలు కాలు వేస్తే తీయలేని పరిస్థితి. రోడ్ల పైనే మురుగు కాల్వలు ఏరులై పారుతున్నా పట్టించుకునే వారు లేరు. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అంతర్గత రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. తొగర్పల్లి, కొండాపూర్, మల్కాపూర్, గంగారం, అనంతసాగర్, కోనాపూర్, మునిదేవునిపల్లి, మల్కాపూర్ మదిర గ్రామమైన కుతుబ్‌షాహీపేట్, మారేపల్లి తదితర గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఇటీవలే పెద్దాపూర్ నుండి అనంతసాగర్ వరకు వేసిన డబుల్‌రోడ్డు, తొగర్పల్లి ప్రధాన రహదారి సైతం పూర్తిగా గుంతలమయమైందని వాహనదారులు పేర్కొంటున్నారు. కుత్బ్షాహీపేట్, మునిదేవునిపల్లి, మారేపల్లి గ్రామాల్లో అంతర్గత, కచ్చా రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారాయి. వర్షం పడడంతో కాలు వేస్తే తీయలేని పరిస్థితి.రాత్రివేళ్లలో నడవడానికి చాలా కష్టంగా ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మండల కేంద్రమైన కొండాపూర్లోనూ అంతర్గత రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. మారేపల్లి, అలియాబాద్, గంగారం గ్రామాలలో మురుగు కాల్వలను నిర్మించకపోవడంతో ఇళ్ల ముందు నుండే మురుగు నీరు ఏరులై పారుతోంది. దీంతో దోమలు, ఈగలు ప్రబలి సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కనీసం కాల్వల నుండి మురుగు తీసేవారే కరువయ్యారనీ పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సీసీగా మార్చాలంటున్నారు. -
సర్ధన రోడ్డుకు మోక్షమెప్పుడో?
నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా ముందుకు సాగని పనులు రోడ్డు పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ నరకయాతన పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు మెదక్: మారుమూల గ్రామాల అభివృద్ధికోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తూ...రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తుంటే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తు పనులను ముందుకు కదల నీయడం లేదు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. నిధులు సకాలంలో మంజూరైన పనులను ప్రారంభించడంలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుండా అధికారులు ఎమిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ నుంచి మండలంలోని సర్ధన గ్రామానికి 14.7కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇది సింగిల్‌రోడ్డు కావడంతో ప్రయాణికులు, వాహనదారులు ప్రయాణించడానికి నరక యాతన పడుతున్నారు. ప్రభుత్వం ఈ రహదారికి గత ఏడాది రూ.18కోట్లు మంజూరు చేసింది. కాగా ఆన్లైన్ టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ నేటికి పనులు ప్రారంభించిన పాపాన పోలేదు. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మెదక్ పట్టణం నుంచి సర్ధన వరకు మద్దుల్వాయి, ముత్తాయికోట, కూచన్‌పల్లి, ముత్తాయిపల్లి, ఫరీద్పూర్, జక్కన్నపేట, సర్ధనతోపాటు పలు గిరిజన తండాలకు ఈ రహదారే ఆధారం. కాగా ఇది సింగిల్‌రోడ్డు కావడం వల్ల చాలా కాలంగా ఆయా గ్రామాల ప్రజలు రవాణా విషయంలో పడరాని పాట్లు పడుతున్నారు. ఈ గ్రామాల వెంట నిత్యం 300 నుంచి 500మంది విద్యార్థులు మెదక్ పట్టణానికి వచ్చి చదువుకుంటారు. రోడ్డు సరిగా లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు గ్రామాలకు బస్సు నడిపించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ రహదారి ఓ వాహనం ఎదురుగా వస్తే మరో వాహనం వెళ్లాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటి సర్ధన రోడ్డును 4లైన్లుగా నిర్మించేందుకు ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసింది. కాగా గత ఏడాది మంత్రి హరీష్‌రావు, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించని చందంగా సర్ధన రోడ్డు పరిస్థితి మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గతుకులరోడ్డుతో నరకం మెదక్-సర్ధన ప్రధాన రహదారి అడుగడుగున గుంతలమయంగా మారి ఇబ్బందులు తప్పడం లేదు. ఇది సింగిల్‌రోడ్డు కావడం వల్ల మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. రోడ్డు మరమ్మతుల కోసం రూ.18కోట్లు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ నేటికి పనులు ప్రారంభించలేదు. - జవ్వాజి యాదయ్య, ఫరీద్పూర్. రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టండి సర్ధన-మెదక్ ప్రధాన రహదారి మరమ్మతులు కోసం రూ.18కోట్లతో పనులు వెంటనే చేపట్టాలి. ప్రస్తుతం గతుకుల రోడ్డు, సింగిల్‌రోడ్డు కావడంతో ప్రయాణం నరకంగా ఉంది. ద్విచక్ర వాహనం వెళ్లాలంటే గుంతల రోడ్డుతో ఆస్పత్రి పాలు కావాల్సిందే. - వెంకాగౌడ్, ముత్తాయిపల్లి -
కోయిల్‌సాగర్ కెనాల్‌కు గండి
– నిలిచిన నీటిసరఫరా – యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు నర్వ : భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతులమీదుగా గత గురువారం కోయిల్‌సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేసిన మూడోరోజే కోయిల్‌సాగర్ కాలువకు గండిపడింది. కోయిల్‌సాగర్ ఫేజ్–1 ప్రధాన కాలువ నుండి 9.7కిలోమీటర్ల వద్ద ఎక్లాస్పురం గ్రామ శివారులో శుక్రవారం రాత్రి కాలువకు గండిపడి నీరంతా పంటపొలాల్లోకి పారింది. దీన్ని గమనించిన అధికారులు, సిబ్బంది హుటాహుటిన మొదటి పంపును ఆఫ్చేయించి నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో కాలువ కరకట్ట పూర్తిగా తెగి సమీపంలో ఉన్న పంటపొలాలు సైతం నష్టపోకుండా కాపాడగలిగారు. మొదటి రోజు ఒకమోటార్‌తో 330క్యూసెక్కుల నీటిని కోయిల్‌సాగర్ ఫేజ్–1 పంపౌజ్ ( నాగిరెడ్డిపల్లి – ఉంద్యాల ) ద్వారా కోయిల్‌సాగర్ జలాశయానికి కాలువ ద్వారా నీటిని తరలించారు. శుక్రవారం రెండో మోటార్‌ను ప్రారంభించిన అధికారులు మొత్తం 660 క్యూసెక్కుల నీటిని కాలువ ద్వారా కోయిల్‌సాగర్‌కు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహ ఉధతి ఎక్కువగా ఉండడంతో రెండవ మోటర్‌ను రాత్రివేళ బంద్‌చేయించి ఒకేఒక మోటార్‌తో నీటి ప్రవాహాన్ని కాలువ ద్వారా వదిలేశారు. జలాశయానికి నీటిని తీసుకెళ్లే కాలువకు పూర్తిస్థాయిలో లైనింగ్ పనులను చేపట్టకపోవడం ప్రధాన కారణమంటున్నారు. వరదల సమయంలో జూరాల బ్యాక్‌వాటర్ నుంచి అనుకున్న విధంగా నీటిని తోడుకుంటూ సమీప గ్రామాలలోని చెరువులు నిండిపోతాయని ఆశపడ్డ రైతులకు ఈసంఘటనతో ఆశలు వదులుకుంటున్నారు. గడ్డిపడ్డ ప్రదేశంలో ఐవీఆర్సీఎల్ కంపెనీ సిబ్బందితో పాటు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు అధికారులు దగ్గరుండి కూలీలచే మరమ్మతులు చేపడుతున్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు డీఈ హజరతయ్య, జేఈ రాంప్రసాద్, ఏఈఈ జాకీర్ హుస్సేన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈసందర్భంగా ప్రాజెక్టు డీఈ మాట్లాడుతూ శనివారం రాత్రినుంచి నిలిచిపోయిన నీటిసరఫరాను పునఃప్రారంభిస్తామని చెప్పారు. -
భార్య కాపురానికి రావడం లేదని..
ఇండోర్: కోరికలు తీరాలని దేవున్ని వేడుకునే వాళ్లను, కష్టాలు ఎదురైనపుడు తననే ఎందుకిలా చేస్తున్నాడని తిట్టుకునే వాళ్లని మనం చూస్తుంటాం. కానీ భార్య కాపురానికి రాలేదని దేవుడిని తిట్టడమే కాకుండా విగ్రహాన్ని ధ్వంసం చేసే మనిషిని చూశామా..! అయితే ఇలాంటి ఘటన ఇండోర్ లోని పాండ్లా ప్రాంతంలో చోటుచేసుకుంది. తన భార్య కాపురానికి రానందుకు ఆగ్రహించిన ఓ భర్త దేవుని విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మనోజ్ బంజారా(37) తన భార్య గత కొంత కాలంగా కాపురానికి రావడం లేదని ఆగ్రహంతో ప్రాచీన దేవాలయంలోని మూల విరాట్ ను ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ మానసిక స్ధితి కొంత కాలంగా బాగాలేకపోవడంతో అతని భార్య పుట్టింటికి వెళ్లింది. అమెను కాపురానికి రప్పించడానికి బంజారా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరి ప్రయత్నంగా ఏదైనా అద్భుతం జరిపించి తన భార్యను కాపురానికి రప్పించాలని దేవుడిని వేడుకున్నాడట. అయినప్పటికీ తన భార్య తిరిగి రాక పోవడంతో ఆగ్రహించిన మనోజ్ శనివారం రాత్రి దేవుని విగ్రహాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీంతో పాండ్లా ఏరియాలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు అదనపు బలగాలను మెహరించారు. మనోజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనిపై స్పందించిన ఆర్ఎస్ఎస్ నేత వినోద్ మిశ్రా దేవాలయానికి భద్రత కల్సించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
మోకాళ్ళ నొప్పులకు త్రీడీ ప్రింటింగ్..!
మోకాళ్ళ నొప్పులతోపాటు, దెబ్బతిన్న చెవి, ముక్కు వంటి వాటికి త్రీడీ ప్రింటెడ్ ఇంప్లాంట్స్ తో సులభంగా చికిత్స చేయొచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. క్రీడాకారులు, వృద్ధులు, గాయాలవల్ల ఇబ్బందిపడే అనేక మందితో పాటు ఆర్థరైటిస్ ఉన్నవారు కార్టిలేజ్ (మృదులాస్థి) కోల్పోయి తీవ్రమైన నొప్పులతో బాధపడుతుంటారు. ఇటువంటి వారికోసం ఓ సరికొత్త ప్రయోగాన్ని అందుబాటులోకి తెచ్చింది అమెరికా శాండియాగోలోని అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసీసీ). 251వ జాతీయ సమావేశాల సందర్భంలో ఈ ప్రయోగాన్ని పరిశోధకులు పరిచయం చేశారు. త్రీ డైమెన్షనల్ బయో ప్రింటింగ్ అనేది సాంకేతిక కణజాల పునరుత్పత్తికి తోడ్పడుతుందని, ఇది వైద్య చరిత్రలో విప్లవాన్ని సృష్టిస్తుందని స్వీడన్ వాలెన్ బర్గ్ వుడ్ సైన్స్ సెంటర్ కు చెందిన పరిశోధక బృందంలోని పాల్ గాటెన్ హోమ్ చెప్తున్నారు. గాయాలు, కేన్సర్ వంటి వాటివల్ల నష్టపోయిన కార్టిలేజ్ (మృదులాష్టి) ను సృష్టించేందుకు తమ బృదం ప్లాస్టిక్ సర్జన్స్ తో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తోందన్నారు. ప్రస్తుతం సర్జెన్లు ముక్కు, చెవి వంటి శరీరంలోని ఇతర భాగాలను బాగు చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తోందని, ఏదో ఓరోజు త్రీడీ ప్రింటింగ్ ద్వారా రోగి కణాల నుంచి తయారు చేసే బయో ఇంక్ తో అటువంటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని గాటెన్ హోమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా తయారు చేసే బయో ఇంక్ తో గాటెన్ హోమ్ బృదం ప్రయోగశాల ద్వారా మృదులాస్థిని ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు జరుపుతోంది. ప్రయోగశాల్లో తయారైన ప్రింటెడ్ టిష్యూ శాంపిల్స్ ను పరిశోధకులు ఎలుకలకు అమర్చి చూశారు. కణాలు పనిచేయడంతోపాటు మృదులాస్థి ఉత్పత్తి అయినట్లుగా కొనుగొన్నారు. అయితే కణజాల సంఖ్యను పెంచేందుకు ఇక్కడ మరో అడ్డంకి ఎదురైంది. దీంతో ఎముక మజ్జు నుంచి తీసిన మూల కణాలతో కాండ్రోసైట్స్ ను కలిపి 60 రోజులపాటు వివో టెస్టింగ్ లో ఉంచారు. ఈ ప్రాధమిక పరిశోధనలు కాండ్రోసైట్ ను మృదులాస్థిని పెంచేందుకు ప్రోత్సహించినట్లు కనుగొన్నారు. ఇక మానవులపై ప్రయోగించేందుకు ముందుగా కొన్ని ప్రీ క్లినికల్ పరీక్షలు చేయాల్సి ఉన్నట్లుగా గాటెన్ హోమ్ తెలిపారు. -
గ్రేటర్లో తమ్ముళ్ల ఆగ్రహజ్వాలలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అసమ్మతి నాయకుల ఆగ్రహజాల్వలు పెల్లుబికాయి. ఇప్పటికే రెబల్ అభ్యర్థులతో తలలు పట్టుకుంటున్న పార్టీలకు... నాయకుల ఆగ్రహ ఆవేశాలు గెలుపుపై నీళ్లు చల్లే విధంగా మారనున్నాయి. విద్యానగర్ టికెట్ దక్కకపోవడంతో మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి వర్గీయులు స్థానికంగా ఉన్న టీడీపీ జెండా దిమ్మెను కూల్చివేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున విద్యానగర్ నుంచి చంద్రమౌళి కార్పొరేటర్‌గా గెలిచాడు. పునర్విభజనలో విద్యానగర్ రద్దయింది. దీంతో చంద్రమౌళి నల్లకుంట డివిజన్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే టీడీపీ వనం మాలతి అనే మరో నాయకురాలికి టికెట్ కేటాయించడంతో ఆగ్రహం చెందిన నాయకులు బీభత్సం సృష్టించారు. సిట్టింగ్ కార్పొరేటర్‌కు కాకుండా మరొకరికి ఎలా కేటాయిస్తారంటూ చంద్రమౌళి వర్గీయులు ప్రశ్నించారు. ఇది గ్రేటర్లో ఏ ఒక్క డివిజన్‌కే పరిమితం కాదు.. పలు డివిజన్లలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. -
ప్రమాదకరంగా మారిన శ్రీవారి మెట్టు మార్గం
-
ఇంట్లోకి దూసుకెళ్లిన సఫారీ, 3 బైక్‌లు ధ్వంసం
-
5,800 ల్యాండ్ రోవర్ కార్లు ధ్వంసం
-
చెట్టు కూలి రెండు ఇళ్లు, ఆటో ధ్వంసం
అర్వపల్లి(నల్లగొండ): నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న పెద్ద రావి చెట్టు గురువారం ఉదయం కూలిపోవటంతో రెండు ఇళ్లు, ఒక ఆటో, ఓ కొట్టు ధ్వంసం కాగా ఒకరికి గాయాలయ్యాయి. చెట్టు కొమ్మలు విద్యుత్ లైనుపై పడటంతో రెండు స్తంభాలు విరిగిపోగా వైర్లు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. అటుగా వెళ్తోన్న మెరుగు వెంకన్నపై చెట్టు కొమ్మలు పడి గాయపడ్డాడు. -
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
సంగారెడ్డి(మెదక్ జిల్లా): మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామంలో జాతీయరహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది గుర్తుతెలియని దుండగులు శుక్రవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. విషయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఈ చర్యకు పాల్పడ్డ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
హుదూద్ బీభత్సంతో దెబ్బతిన్న అంధ్రాయూనివర్సిటీ
-
విశాఖ ఎయిర్ పోర్ట్ పైకప్పు ధ్వంసం
-
గాలీవాన బీభత్సం
గాలీవాన సృష్టించిన బీభత్సంతో రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. ఈదురుగాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో గడ్డివాములు గాలికెగిరిపోగా.. పెద్ద ఎత్తున అరటి, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమై విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కన్నబిడ్డలా పెంచుకున్న చెట్లు కూలిపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. పెద్దవడుగూరు/పెద్దపప్పూరు/తాడిపత్రి రూరల్/ఉరవకొండ, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి, బుధవారం గాలీవాన రైతాంగానికి అపారనష్టం కలిగించింది. పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి, దిమ్మగుడి గ్రామాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి విపరీతమైన గాలులు వీచాయి. రాత్రి 9 గంటలకు గాలి తీవ్రత ఎక్కువ కావడంతో ఆయా గ్రామాల్లోని రైతులు తమ దొడ్లలో వేసుకున్న గడ్డివాములు చెల్లాచెదురైపోయాయి. వర్షం కూడా కురవడంతో అంతా తడిసిపోయింది. సుమారు 40 మంది రైతులకు చెందిన గడ్డివాములు గాలికెగిరిపోయాయి. కొట్టాలపల్లిలో రామచంద్రరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిల ఇళ్లు కూలిపోయాయి. పెద్దవడుగూరు, చిన్నవడుగూరు, దిమ్మగుడి, కొట్టాలపల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో గ్రామస్తులు చీకట్లో మగ్గాల్సి వచ్చింది. భీమునిపల్లిలో పిడుగుపడి చౌడప్పకు చెందిన 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. చెన్నారెడ్డికి చెందిన రెండు ఎకరాల పత్తి పంట నేలకొరిగింది. బుధవారం ఆయా గ్రామాల్లో అధికారులు పర్యటించి నష్టం అంచనా వేశారు. విద్యుత్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నేలకొరిగిన చెట్లు పెద్దపప్పూరు మండల కేంద్రంతో పాటు చిన్నపప్పూరు, తిమ్మనచెరువు, గార్లదిన్నె, పసలూరు, ధర్మాపురం, చింతలపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరటి, బొప్పాయి, రేగు, మామిడి దిగుబడులు నేలకొరిగాయి. పసలూరు గ్రామ సమీపంలోని పొలాల్లో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామం అంధకారంలో మగ్గింది. వేప చెట్లు కూలి పెద్దపప్పూరుకు చెందిన గంగమ్మ, పసలూరుకు చెందిన ఎర్రమ్మ ఇళ్లపై పడడంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులు వీయగానే ఇంటి యజమానులు సమీపంలోని ఇతరుల ఇళ్లలోని వెళ్లి తలదాచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇళ్లలోని సరుకులన్నీ దెబ్బతినడంతో వారు తీవ్రంగా నష్టపోయారు. అంధకారంలో గ్రామాలు తాడిపత్రి మండల పరిధిలోని గంగాదేవిపల్లి, పులిపొద్దుటూరు, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. ఈ మూడు గ్రామాల్లో అంధకారం నెలకొంది. గంగాదేవి పల్లిలోని ఎస్సీ కాలనీలో ఇళ్లపై విద్యుత్ తీగలు పడిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాలివాన బీభత్సానికి మామిడి కాయలు రాలిపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్లు రైతులు నారాయణస్వామి, నారాయణరెడ్డి, గంగన్న, గంగిరెడ్డి తెలిపారు. ఉరవకొండలో భారీ వర్షం ఉరవకొండలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో జనం భీతిల్లిపోయారు. పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. గుంతకల్లు రోడ్డులోని సుధాకర్ టీ స్టాల్ వద్ద ఉన్న పెద్ద చెట్టు కూలడంతో టీ తాగుతున్న వారు ఒక్కసారిగా భయందోళనకు గురై పరుగు తీశారు. చిన్నకొండ వద్ద ఉన్న అమీనా ఇంటిపై చెట్టు విరిగిపడింది. అయితే ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. శివరామిరెడ్డి కాలనీ, డ్రైవర్స్ కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు ఇళ్లలోకి చేరింది. 50 చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరి ముడిసరుకులు దెబ్బతిన్నాయి. మేదరకాలనీలో 30 ఇళ్లలోకి నీరు రావడంతో బియ్యం, దుస్తులు తడిసిపోయాయి. నిత్యావసర సరుకులు కొట్టుకుపోయినట్లు కాలనీకి చెందిన పద్మావతి, యుగంధర్ తదితరులు తెలిపారు. రంగావీధిలో కూడా ఇళ్లలోకి నీరు చేరింది. గవిమఠం ఎదురుగా వారం క్రితం ఏర్పాటు చేసిన గీతా సర్కస్ టెంట్ నేలకూలింది. సాయంత్రం 6 గంటలకు సర్కస్ ప్రారంభం కావాల్సి ఉండగా.. 5 గంటలకు భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో టెంట్ కూలిపోయింది. రూ.8 లక్షలు విలువ చేసే సామగ్రి, సర్కస్‌కు వినియోగించే పరికరాలు పాడైపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. కుంటలు, చెక్‌డ్యాంలకు జలకళ చిలమత్తూరు మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురవడంతో కుంటలు, చెక్‌డ్యాంలు నిండాయి. ముంగారు సేద్యానికి ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా భూపసముద్రంలో శివప్పకు చెందిన ఇల్లు వర్షానికి కూలిపోయింది. తెగిపడిన విద్యుత్ వైర్లు : గుంతకల్లులో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీయడంతో చెట్లు కూలిపోయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సత్యనారాయణపేటలో హై ఓల్టేజ్‌తో టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. రాయదుర్గంలో రాత్రి 7 గంటల నుంచి అరగంట పాటు వర్షం కురిసింది. ఇందిరాగాంధీ స్కూల్, పార్వతినగర్, శాంతినగర్, ప్రభుత్వాస్పత్రి వద్ద చెట్లు నేలకూలాయి. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. -
రైతులను కుదేలు చేసిన ఎడతెరిపిలేని వర్షాలు
-
కొత్తగూడెంలో వైఎస్ విగ్రహానికి నిప్పు
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్:కొత్తగూడెం మండలంలోని హౌజింగ్ బోర్డు వద్ద ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు డీజిల్ చల్లి నిప్పంటించారు. ఈ ఘటనలో వైఎస్ విగ్రహం కొంత మేర కాలి మసిబారింది. ఈ విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వకర్త, సీఈసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి ఉన్న డీజిల్‌ను తొలగిం చారు. అనంతరం ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ మహానేత విగ్రహాలకు నిప్పు పెట్టడం పిరికిపంద చర్య అని అన్నారు. తెలంగాణ ముసుగులో కొందరు దుండగులు వైఎస్ విగ్రహాలకు నిప్పు పెడుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం మహానేత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. అటువంటి మహానుభావుడి విగ్రహానికి నిప్పుపెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వైఎస్సార్సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు. మేము తెలంగాణ బిడ్డలమేనని, వైఎస్సార్సీపీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ భూక్యా దళ్‌సింగ్ మాట్లాడుతూ వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరైంది కాదని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. అనంతరం ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్ నుంచి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి సీఐ నరేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐ మాట్లాడుతూ త్వరగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ భీమా శ్రీధర్, మండల కన్వీనర్ తాళ్లూరి శ్రీనివాస్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, పీక కృష్ణ, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జక్కం సీతయ్య, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు సాధిక్ షాషా, వైఎస్సార్ సీపీ నాయకులు తాండ్ర నాగబాబు, నాగుల శేఖర్, కందుల సుధాకర్‌రెడ్డి, బాలరెడ్డి లింగం సత్యనారాయణ రెడ్డి, తీట్ల భాస్కర్, ఎర్పుల సుధాకర్‌రావు, ఏలూరి రాజేష్, వీరభద్రం, భాస్కర్‌రావు, రాములు, జామ్లా నాయక్, ఫ్రాన్సిస్, నాగరాజు, శ్రీను పాల్గొన్నారు. -
వర్షాలతో 2500 రోడ్లకు నష్టం