కంకర తేలిన రహదారి
భెల్: టౌన్‌షిప్‌లోని రోడ్లు అనేక చోట్ల అధ్వానంగా మారాయి.. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం వేసిన రోడ్లు గుంతలుగా ఏర్పడ్డాయి. రాత్రి వేళలో గుంతలు కనిపించక ప్రమాదాల బారినపడుతున్నారు. రోడ్డు నిర్మాణ సమయంలో అధికారులు నాణ్యతా ప్రమాణాలను పట్టించుకొకపోవడం వల్లనే రోడ్లు పాడవుతున్నాయని భెల్‌కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వర్షాల కారణంగా రోడ్డుపై డంబరు కంకరలేచి వాహనాలు వెళ్లినప్పుడు దుమ్ములేవడంతో మోటర్‌సైకిల్‌పై వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన భెల్ అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.