ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దగ్గర నుంచి దుస్తుల వరకు అన్ని రకాల వస్తువులు ఈ-కామర్స్ సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా ఆన్‌లైన్‌లో కొన్న కస్టమర్లకు కొన్నిసార్లు డ్యామేజీ అయిన వస్తువులు డెలివరీ అవుతుంటాయి. దీంతో వాటిని మళ్లీ రిటర్న్ చేస్తుంటారు కస్టమర్లు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారం
డ్యామేజీ వస్తువుల సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఉపాయం ఆలోచిస్తోంది. ఇందు కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారం తీసుకోనుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. అమెజాన్ తన గిడ్డంగులలో పెద్ద మార్పు చేస్తోంది. వస్తువులను కస్టమర్లకు పంపే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలంచడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగిస్తున్నారు.
దీని వల్ల కస్టమర్లకు డ్యామేజీ వస్తువులు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. అదే విధంగా కస్టమర్ల ఆర్డర్‌లకు అనుగుణంగా వస్తువుల ఎంపిక, ప్యాకింగ్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుంది. అమెజాన్ గిడ్డంగులను మరింత ఆటోమేషన్ పెంచడానికి ఇది ఒక ముందడుగుగా భావిస్తున్నారు.
కస్టమర్లకు పంపే వస్తువుల్లో ఏదైనా డ్యామేజీ ఉందా అనేది ప్రస్తుతం అమెజాన్ వేర్‌హౌస్‌లలో కార్మికులే మ్యానువల్‌గా పరిశీలిస్తున్నారు. అయితే ఉత్పత్తి లోడ్ చాలా ఎక్కువగా నేపథ్యంలో కొన్నిసార్లు డ్యామేజీ వస్తువులను గుర్తించలేక పోతున్నారు. దీంతో ఆ డ్యామేజీ వస్తువులు కస్టమర్లకు అలాగే చేరుతున్నాయి.
డ్యామేజీ ఉత్పత్తులను మాన్యువల్‌గా స్క్రీనింగ్ చేసే ప్రక్రియ కష్టతరమైనది. చాలా సమయం తీసుకుంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అమెజాన్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment