సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా ధ్వంసమైన 419 ఇళ్లకు గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న 7,505 ఇళ్లకు తగిన విధంగా పరిహారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు–భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గురువారం శాసనమండలిలో ‘భారీ వర్షాల పర్యవసానాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యల’పై నిర్వహించిన లఘు చర్చకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. వరదల సమయంలో ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
కేంద్రం ఆదుకోకున్నా..
2020లో, తర్వాత రాష్ట్రం వరదలతో నష్టపోతే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదని.. అయినా సీఎం కేసీఆర్ ధైర్యం కోల్పో కుండా పకడ్బందీగా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారని వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇళ్లు నీట మునిగిన వారికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర సర్కారే ఆర్థిక సాయం చేసిందని చెప్పారు.
గతంలో భారీ వర్షాలకు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లితే.. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల ఆర్థిక సా యాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. అందులో ఇప్పటివరకు రూ.150 కోట్లు చెల్లించిందని, త్వరలోనే మిగతా రూ.300 కోట్ల ను చెల్లించనున్నామని తెలిపారు. ప్రస్తుత వరదల నేపథ్యంలోనూ సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసానిచ్చేలా రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారని చెప్పారు.
సీఎం కేసీఆర్ నిరంతర సమీక్ష
తెలంగాణలో ఎన్నడూ లేనంత భారీ వర్షా లు నమోదయ్యాయని, ఈ వానలు, వరదలపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షించార ని వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో అర్ధరాత్రి దాకా గంటలకొద్దీ సమీక్షలు, ప్రాజెక్టుల వారీగా పరిశీలనలతో ఆస్తి, ప్రాణనష్టం తగ్గించగలిగామని వివరించా రు. వరద ప్రాంతాలకు సీఎం రాలేదన్న వి మర్శలు సరికాదని.. సీఎం కేసీఆర్ ఫొటోల కవరేజీ కోసం ఫోజులిచ్చే నాయకుడు కాద ని, ఆయన ప్రజల కోసం పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగి్నమాపక బృందాలను పురమాయించి.
మంత్రులు, కలెక్టర్లు, అధికారులను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నం చేయడంలో కేసీఆర్ కీలకపాత్ర పోషించారని చెప్పారు. వరదలతో కోతకు గురైన భూములపై సర్వే చేయాలని ఆదేశించారని తెలిపారు. నష్టంపై పూర్తి అంచనాలు అందాక ఆర్థిక సాయంపై సీఎం తగిన నిర్ణయం ప్రకటిస్తారని వివరించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన మిషన్ కాకతీయ పనులతో చెరువుల అలుగులు పటిష్టమై, కాలువల కట్టలు బలపడటంతో ఎక్కువ నష్టం జరగలేదని పేర్కొన్నారు.
వరదలు, వానల నష్టం ఇదీ..
- రాష్ట్రంలో వరంగల్ కార్పొరేషన్, నిర్మల్, పరకాల, కోరుట్ల, భూపాలపల్లి, జమ్మి కుంట, ఖమ్మం కార్పొరేషన్, మహబూ బాబాద్, భైంసా, నిజామాబాద్ కార్పొరేషన్, పెద్దపల్లి, నర్సంపేటలలో అధిక నష్టం సంభవించిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసన మండలిలో చెప్పారు.
- 141 పురపాలికల్లో ముందస్తు, సహాయ చర్యలు చేపట్టామని, తాత్కాలిక మరమ్మతులకు రూ.76 కోట్లు అవసరమని అంచనా వేశామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాల శాశ్వత పునరుద్ధరణకు మొత్తం రూ.304 కోట్లు, యూఎల్‌బీల పునరుద్ధరణ పనులకు రూ.380 కోట్లు అవసరమన్నారు.
- ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.255.66 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, అవి మంజూరు దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు.
- సహాయ చర్యల్లో భాగంగా 1,500 మందిని కాపాడామని మంత్రి చెప్పారు. 139 గ్రామాలకు చెందిన 27,062 మందికి 157 సహాయ శిబిరాల్లో ఆశ్రయం కలి్పంచామని.. తాగునీరు, ఆహారం, దుప్పట్లు, మందులు సరఫరా చేశామని వివరించారు.
- ములుగు జిల్లా కొండాయి గ్రామానికి హెలికాప్టర్ ద్వారా ఆహారం, మందులు పంపామన్నారు.
- 64 గ్రామాలు/ప్రదేశాలలో నీటిపైపులు దెబ్బతిని.. 1,199 జనావాసాలు 25,418 కుటుంబాలపై ప్రభావం పడగా.. వందశాతం తాగునీటి పునరుద్ధరణ జరిగిందని చెప్పారు.
- 773 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. 769 గ్రామాల్లో పునరుద్ధరించామని మంత్రి తెలిపారు. 23,075 స్తంభాలు, 3,405 డీటీఆర్‌లు దెబ్బతిని దాదాపు రూ.62.98 కోట్ల నష్టం జరిగిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment