
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లోగోను తమ ప్రభుత్వం మార్చలేదని రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోగోను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్చిందని కొందరు నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సెక్యులర్ నాయకుడని, అన్ని మతాలను సమానంగా గౌరవించే వ్యక్తి అని పేర్కొన్నారు. లోగోపై నిగ్గు తేల్చే బాధ్యతలను ఉస్మానియా ఉర్దూ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్‌కు అప్పగించగా ఆయన పలు వివరాలు వెల్లడించారని తెలిపారు.
1951 సంవత్సరంలో లోగోలో కొంతమార్పు జరిగిందని, 1960లో లోగోను పూర్తిగా మార్చేశారని, ఐతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని ఆయన పేర్కొన్నారు. 1960 సంవత్సరం తరువాత వర్సిటీ ధ్రువపత్రాలు ఉన్నవారు ‘లోగో’ను గమనించవచ్చని, నిరాధారమైన వార్తలను నమ్మవద్దని హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment