ఫేమస్‌ బ్రిటిష్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ లోగోకి ప్రేరణ కాళిమాత..! | The Rolling Stones Band Was Inspired By The Hindu Goddess Kali | Sakshi
Sakshi News home page

ఫేమస్‌ బ్రిటిష్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ లోగోకి ప్రేరణ కాళిమాత..!

Published Wed, Nov 20 2024 12:04 PM | Last Updated on Wed, Nov 20 2024 12:12 PM

The Rolling Stones Band Was Inspired By The Hindu Goddess Kali

ఇటీవల కాలంలో మన నగరాల్లో కూడా చిన్ని చిన్న మ్యూజిక్‌ బ్యాండ్‌లు వచ్చాయి. ప్రజలు వాటిని ఆదరిస్తున్నారు కూడా. అయితే పాశ్చాత్య దేశాల్లో ఈ సంస్కృతి ఎప్పటి నుంచే ఉంది. అక్కడ పాప్‌ సాంగ్స్‌తో ఉర్రూతలూగించే రాక్‌ మ్యూజిక్‌కి క్రేజ్‌ ఎక్కువ. 60ల కాలంలో ఓ ప్రసిద్ధ మ్యూజిక్‌ బ్యాండ్‌ ఉండేది. ఇప్పటికీ వివిధ పాటల ఆల్బమ్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది ఒక ఐకానిక్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌. దీని నుంచి విడుదలై ప్రతి మ్యూజిక్‌ హిట్‌. అలాంటి ఫేమస్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ లోగో డిజైన్‌ చూస్తే కంగుతింటారు. ఆ డిజైన్‌కి ప్రేరణ మన హిందువుల ఆరాధ్య దైవమైన కాళిమాత అట. 

1962లో, ది రోలింగ్ స్టోన్స్ పేరుతో బ్రిటిష్ రాక్ బ్యాండ్ స్థాపించారు కొందరూ పాప్‌ గాయకులు. ఆ బ్యాండ్‌లోని సభ్యులు  మిక్ జాగర్, కీత్ రిచర్డ్స్, బ్రెయిన్ జోన్స్, బిల్ వైమాన్, చార్లీ వాట్స్ తదితరులు. బ్రిటన్‌లో 1963 ఆ టైంలో వీరి బ్యాండ్‌ నుంచి విడుదలైన 'కమ్‌ ఆన్' అనే మ్యూజిక్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. దీంతో తమ బ్యాండ్‌ అని తెలిసేలా ఓ ప్రత్యేక లోగో ఉంటే బాగుంటుందని బ్యాండ్‌ సభ్యులు భావించారు. 

కానీ సరిగ్గా ఆ టైంలో ఉన్న యూరోపియన్‌ పర్యటన ఉండటంతో ఫేమస్‌ బ్రిటిష్‌ గ్రాఫిక్‌ డిజైనర్‌ జాన్ పాస్చేచే హడావిడిగా యూరప్‌లో ఉండే మిస్టీరియస్‌ స్టోన్స్‌నే లోగోగా డిజైన్‌ చేయడం జరిగింది. అయితే బ్యాండ్‌కి అనతి కాలంలో మంచి పేరు రావడంతో తమ మ్యూజిక్ మ్యాగ్జైన్‌ కవర్‌పేజీ గ్రాఫిక్‌ని డిజైన్‌ చేసేలా జాన్ పాస్చేకే మళ్లీ పని పురమాయించారు బ్యాండ్‌ సభ్యులు. అప్పుడే మంచి లేబుల్‌తో కూడిన లోగో ఉండాలి. అంది తమ బ్యాండ్‌ దర్పాన్ని, గొప్పతనాన్ని తెలియజేసేట్టు ఉండాలనుకున్నారు బ్యాండ్‌ సభ్యులు. 

ఆ దిశగా రాక్ అండ్‌ రోల్ బ్యాండ్ రోలింగ్ స్టోన్స్ లోగోని ఆవిష్కరించమని పాస్చేకి చెప్పారు. అయితే ఆ బ్యాండ్‌ సభ్యుల్లో ఒకరైన  మిక్ జాగర్‌ని కాళి దేవత రూపం ఎంతగానో ఆకర్షించింది. ఆ రూపం చిహ్నమైన నాలుక, పెదాలనే లోగోగా తీసుకుంటే అనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్నే డిజైనర్‌ జాన్ పాస్చేకే చెప్పి డిజైన్‌ చేయించాడు. ఆ బ్యాండ్‌ ధరించే టీ షర్ట్‌లపై కూడా ఆ లోగోనే ఉంటుంది. ఇక జాగర్‌కి హిందూ దేవత కాళిమాత గురించి ఎలా తెలిసిందంటే..తన తమ్ముడు ద్వారా తెలుసుకున్నాడు. ఆయన భారతదేశ పర్యటనలు చేస్తుంటాడు. 

అలా అతడు భారత్‌ నుంచి తెచ్చిన కొన్ని పుస్తకాలను జాగర్‌కి ఇస్తుండేవాడు. అందులో కనిపించిన కాళి మాత రూపం జాగర్‌ని బాగా ఆకర్షించింది. దీంతో ఆమె చిహ్నలతోనే లోగో తయారు చేయాలనే ఆలోచన జాగర్‌కి తట్టడం జరిగింది. ఆయన కోల్‌కతాలో కాళీ పూజలు చేసి వచ్చి మరీ ఈ లోగోని డిజైన్‌ చేయించుకున్నారట. ఈలోగో కాళిమాత విగతమైన నాలుక, పెదాలతో ఉంటుంది. అయితే అందరూ మత్రం ఆబ్యాండ్‌ అసలు సభ్యలైన గాయకుడు జాకర్‌ పెదాలుగా భావిస్తుంటారు. 

అసలు కాళీమాత అంటే..  ధిక్కారణ, స్థితిస్థాపకత, శక్తిని సూచిస్తుంది. అలానే తమ బ్యాండ్‌ ఉనికిని చాటుకుంటూ.. ప్రజలను ఆకట్టుకునేలా.. శక్తిమంతమైన మ్యూజిక్‌ని అందించే బ్యాండ్‌ అని అర్థం ఇచ్చేలా ఈ విధంగా లోగోని డిజైన్‌ చేయించినట్లు తెలిపారు. అందుకుగానూ డిజైనర్‌ పాస్చేకి అప్పట్లో సుమారు రూ. 5 వేల రూపాయలకు పైనే చెల్లించారట. అయితే 1976లో ఆ లోగో ఆ బ్యాండ్‌ అధికారిక చిహ్నంగా మారడంతో పాస్చేకి దాదాపు రూ.27 లక్షలు చెల్లించి మరీ కాపీరైట్‌ హక్కలును తీసుకుంది ది రోలింగ్ స్టోన్స్ బ్యాండ్.

(చదవండి: వినదగ్గదే శ్రీమతి చెబుతుంది)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement